23, ఏప్రిల్ 2022, శనివారం

చెలిమి చెలమ - తేట ఊట

చెలిమి చెలిమి చెలిమి ;

చెలిమి  చెలమ - తేట ఊట ;

క్రిష్ణ జ్ఞాన అంశములతో ; 

సుధారసము లుప్పొంగును ; || 

సదా చెలిమి చేస్తున్నవి - 

ఊసులన్ని ఊహలతో ; 

క్రిష్ణ గాన మధు శాలల ; 

సుధారసము లుప్పొంగును ; ||  

క్రిష్ణయ్యా! నాదు -

కంటి చూపు తోటి చెలిమి ;

నువు ఉన్న దృశ్యాలు ;

నీవిపుడు రాకుంటే -

కన్నీళ్ళతొ తన చెలిమి -

క్రిష్ణయ్యా, నాదు వీక్షణాలకు -

కన్నీళ్ళ తోటి కుదురు చెలిమి ; ||

నీ గాధల వినికిడులు ;

వీనులకు కలిమి చెలిమి ; || 

వేణురవళి - గాలి కూడి ;

నాదు - మేనెల్లా చేయు చెలిమి ;

మది, దేహములను చుట్టి -

నిలువెల్లా చేయు చెలిమి ; ||  

================= ,

celimi celimi celimi ;

celimi  celama - tETa UTa ;

krishNa jnaana amSamulatO ; 

sudhaarasamu luppomgunu ; || 

sadaa celimi cEstunnawi - 

uusulanni uuhalatO ; 

krishNa gaana madhu Saalala ; 

sudhaarasamu luppomgunu ; ||  

krishNayyA! naadu -

kamTi cuupu tOTi celimi ;

nuwu unna dRSyaalu ;

neewipuDu rAkumTE -

kannILLato tana celimi -

krishNayyaa, naadu weekshaNAlaku -

kannILLa tOTi kuduru celimi ; ||

nee gaadhala winikiDulu ;

weenulaku kalimi celimi ; || 

wENurawaLi - gaali kUDi ;

naadu - mEnellaa cEyu celimi ;

madi, dEhamulanu cuTTi -

niluwellaa cEyu celimi ; ||

&

 song = Lable - శుభకృత్ సుమ గీత మాలిక -  2 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి