28, ఏప్రిల్ 2022, గురువారం

విష్ణుచిత్తుల ఉద్యానం - ప్రబంధం

విష్ణుచిత్తుల ఉద్యానం ;

అణువు అణువునా ఆనందం ;

ఎటుల జరుగునిది, నిత్య వేడుక ;

భక్తి భావమా! ముందిది చెప్పు ; ||

;

ప్రణవం ప్రణయం, మధురం మధురం ;

గోదా గోవింద -

అనురాగ ప్రయాణమె - అనుశ్రుత ప్రబంధం ;

ఎటుల జరుగునిది, నిత్య వేడుక ;

భక్తి భావమా! ముందిది చెప్పు ; ||

;

రాధా బింబం - గోదా హాసం, దరహాసం ;

సుభగ సుగంధం, సుమధురం ;

క్రిష్ణ అనునయం, అభి వేదం ;

హసంతి రాధిక సుగంధ మల్లిక ;

మురళీరవళీ పరిమళ చంద్రిక ;

గోదాదేవికి పాశుర గీతిక ;

నిత్య నవీన వచన వేదిక ;

ఎటుల జరుగునిది నిత్య వేడుక ;

భక్తి భావమా! ముందిది చెప్పు ; ||

=======================,

wishNucittula udyaanam ;

aNuwu aNuwunaa aanamdam ;

eTula jarugunidi, nitya wEDuka ;

bhakti BAwamA! mumdidi ceppu ; ||

;

praNawam praNayam, madhuram madhuram ;

gOdaa gOwimda -

anuraaga prayAName - anuSruta prabamdham ;

eTula jarugunidi, nitya wEDuka ;

bhakti BAwamA! mumdidi ceppu ; ||

;

raadhaa bimbam - gOdaa haasam, darahaasam ;

subhaga sugamdham, sumadhuram ;

krishNa anunayam, abhi wEdam ;

hasamti raadhika - sugamdha mallika ;

muraLIrawaLii parimaLa camdrika ;

gOdaadEwiki paaSura geetika ;

nitya naweena wacana wEdika ;

eTula jarugunidi, nitya wEDuka ;

bhakti BAwamA! mumdidi ceppu ; || 

&

శుభకృత్ సుమ గీత మాలిక ;- 14 ; song - 14 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి