28, ఏప్రిల్ 2022, గురువారం

వయ్యారమొలికించు సయ్యాటల గాలి

 వయ్యారమొలికించు సయ్యాటల గాలి ;

సరితం చకోరం - మలయం సమీరమ్ము ; ||

;

జల వాయులీనములు జాగు సేయకను ;

చేరేను మృదు క్రిష్ణ సంగీత హవణి ;

అల్లనల్లన కదిలె ఆ పల్లవాంగుళి ;

చేరినది క్రిష్ణమ్మ చేతిలో లఘు మురళిని ;

ఆ చల్లని గాలి నెమ్మది నెమ్మదిగ ; ||

;

చేరినంతనే గాలి మైమరుపు శీతలం ;

ఆయెను మాయగా సుర సుధా సరళి ;

అందింది అందరికి వర మధుర స్వరళి ;

&

శుభకృత్ సుమ గీత మాలిక ;- 18  ; song -  18 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి