శ్రీకృష్ణ సంగీత లహరికలు - శృతి శ్రవణ భాగ్యములు ;
అనురాగ అంబర వీధిలోన - తారాడుచున్నవి కొంగ్రొత్త మెరుపులు ;
వేణు గానమ్ములను, అధిరోహణము సేయుచున్నవి ,
ఆ నవ విద్యుత్తు లతలు ; ||
రాతిరికి, వేకువకు - సాన్నిధ్య మబ్బినది ;
విడలేని బంధమేదొ ఏర్పడెను చిత్రము ;
రాతిరికి, వేకువకు -
విడలేని బంధమేదొ ఏర్పడెను చిత్రము ; ||
నిశీధిలో వెలుగుల జిలుగుల పరివ్యాప్తి అయ్యేను ;
అయ్యారె, తిమిరముల రాతిరి -
కాంతుల పటమయ్యి, వెలిసింది ;
మేలిమి కాంతుల పటము అయ్యి, వెలిసింది ; ||
జత నీవె రాధికా - కొరత రానీయకు ;
తక్షణమె మురళికి నీ మోవి నందించు మృదువుగా ;
క్రిష్ణయ్య గీతికి - అందించు మధువుగా ; ||
========================, ;
SrIkRshNa samgeeta laharikalu -
SRti SrawaNa bhaagyamulu ;
anuraaga ambara weedhilOna ;
taarADucunnawi komgrotta merupulu ;
wENu gaanammulanu, adhirOhaNamu sEyucunnawi ,
aa nawa widyuttu latalu ; ||
raatiriki, wEkuwaku - saannidhya mabbinadi ;
wiDalEni bamdhamEdo ErpaDenu citramu ;
raatiriki, wEkuwaku -
wiDalEni bamdhamEdo ; ErpaDenu citramu ; ||
niSIdhilO welugula jilugula pariwyaapti ayyEnu ;
ayyaare, timiramula raatiri -
kaamtula paTamayyi, welisimdi ;
mElimi kaamtula paTamu ayyi, welisimdi ; ||
jata neewe raadhikaa - korata raaneeyaku ;
takshaName muraLiki nee mOwi namdimcu mRduwugaa ;
krishNayya geetiki - amdimcu madhuwugaa ; ||
& ;
శుభకృత్ సుమ గీత మాలిక ;- 8 - song - 8 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి