రాతకోత చాలించు చందమామా -
విశ్రాంతి సుంత తీసుకో, చందమామా ; ||
;
యమున నీటి అలల పైన చందమామా,
చాందినీ - కావ్యాలు రాసినావు చందమామా ;
రాసి రాసి అలసినావు చందమామా ;
సుంత విశ్రాంతి తీసుకో, చందమామా ;
బడలిక తీరే లాగున - సుంత -
విశ్రాంతి తీసుకో, చందమామా ; ||
;
రాధ నేడు రాదంట, యనునా తటికి ;
క్రిష్ణునికి తెగ గుబులు, చందమామా ;
ప్రణయ జంట రాక లేక చందమామా ;
రేవు చిన్నబోయింది చందమామా ;
అందుకనే వ్రాతకోత చాలించు చందమామా -
విశ్రాంతిగ సేదదీరు, చందమామా ; ||
=================;
raadha nEDu raadanTa, yanunaa taTiki ;
krishNuniki tega gubulu, camdamAmA ;
;
yamuna nITi alala paina camdamAmA,
caamdinee - kaawyaalu raasinaawu camdamAmA ;
raasi raasi alasinaawu camdamAmA ;
sumta wiSraamti teesukO, camdamAmA ; ||
;
praNaya jamTa raaka lEka camdamAmA ;
rEwu cinnabOyimdi camdamAmA ;
amdukanE wraatakOta caalimcu camdamAmA ;
wiSraamti tiga sEdadeeru camdamAmA ; ||
;
శుభకృత్ సుమ గీత మాలిక ;- 14 ; song - 14 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి