29, ఏప్రిల్ 2022, శుక్రవారం

కృష్ణ గగనం హంగామా

ఔరా, గగనం హంగామా, ; 

కృష్ణుని వాటం నీదే లేమ్మా! 

కాదంటామా మేమెవరము ఐనా ; 

భళి భళీ, భలే భలే ;  ||

తారలు చూపిస్తుంటావు ;

కన్నయ పదముల మువ్వలు -

      ఇవి - అంటుంటావు ;

భళి భళీ, భలే భలే ;  ||

మబ్బుల తళుకులు చూపిస్తూ ;

క్రిష్ణ హాసములు అంటున్నావు ;

భళి భళీ, భలే భలే ;  ||

తొలి - మలి ప్రొద్దుల కోవెల కట్టి ;

కృష్ణ గోవింద నిలయం అని -

మాకందరికీ దృశ్యమానము చేస్తున్నావు ;  

భళి భళీ, భలే భలే ;  ||

ఔర, అంబరమ! 

కృష్ణుని వాటం నీదే లేమ్మా! 

నల్లని వాని మేని ఛాయతో పోటీ నీది, 

ఐతేనేమి, రంజుగ ఉన్నది నీ ధాటి ; 

కాదంటామా మేమెవరము ఐనా 

భళి భళీ, భలే భలే ;  || 

&

కృష్ణ గగనం హంగామా ; - song = 19 ;; శుభకృత్ సుమ గీత మాలిక ;- 19 ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి