అదిగదిగో వేణురవళి - తోటలోని ప్రతి కొమ్మయు ;
పుష్పవనము *నామఫలకమాయెను ; ||
బృందావన క్రీడలు - మోదములకు మేడలు ;
మృదు భావాల ప్రణయాల ఆవరణము ఇది, గాన - ;
మురళిగాన వీచికల - గాలి ఆయె హర్షమాల ; -
సృజనలై పద పదము - గాధలాయెను ;
సృజనలై పద పదము - నాట్యాలు ఆయేను ; ||
గుప్పెడంత గుండెలు - కృష్ణ కథల వేదికలయె ;
పద ముగ్ధ పారాయణం - నిత్య పారాయణం ;
సాన్నిధ్య పారాయణం - సన్నిహిత పారాయణం ;
కృష్ణ కృష్ణా కృష్ణ - రాధ కృష్ణా కృష్ణ ;
============== ,
adigadigO wENurawaLi - tOTalOni prati kommayu ;
pushpawanamu naamaphalakamaayenu ; ||
bRmdaawana kreeDalu - mOdamulaku mEDalu ;
mRdu bhAwaala praNayaala aawaraNamu idi, gaana - ;
muraLigaana weecikala - gaali aaye harshamaala ; -
sRjanalai pada padamu - gaadhalaayenu ;
sRjanalai pada padamu - nATyaalu aayEnu ; ||
guppeDamta gumDelu - kRshNa kathala wEdikalaye ;
pada mugdha paaraayaNam - nitya paaraayaNam ;
saannidhya paaraayaNam - sannihita pArAyaNam ;
kRshNa kRshNaa kRshNa - raadha kRshNaa kRshNa ;
;
& **నామఫలకం = *name plate ;
శుభకృత్ సుమ గీత మాలిక ;- 16 ; song - 16 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి