31, మే 2022, మంగళవారం

రేపల్లెలోన విరిసె కలువ

నీలి కలువ, నీలి కలువ, నీలి కలువ -

పుట్టింది - మన వ్రేపల్లియలోన ; ||

నీలి యమున కెరటాల - పున్నమలు ఎగిసాయి ;

చంద్రకళలు ఆడాయి ;

*షోడశ కళలొకేసారి - కూరిమిని ఆడసాగె ; ||

రాజీవ లోచనుని తిలకిస్తూ - భూదేవి మురిసింది ;

దివికి దూరమిక రద్దు - ఈ భువియె దివిజులకు ముద్దు ;

స్వర్గమునకు - ఇటు - ఇక పయిన - లేదు లెండి, ఏ హద్దు ; ||

=================== ,

neeli kaluwa puTTimdi - wrEpalliyalOna ;

neeli kaluwa, neeli kaluwa, neeli kaluwa -

puTTimdi - mana wrEpalliyalOna ; ||

neeli yamuna keraTAla - punnamalu egisaayi ;

camdrakaLalu ADAyi - *shODaSa kaLalokEsaari -

kuurimini ADasaage ; ||

raajiiwa lOcanuni tilakistuu - BUdEwi murisimdi ;

diwiki duuramika raddu - ee bhuwiye diwijulaku muddu ;

swargamunaku - iTu - ika payina - lEdu lemDi, E haddu ; ||

&

notes ;- *షోడశకళా ప్రపూర్ణుడు చంద్రుడు = 16 కళలు ; &

శుభకృత్ సుమ గీత మాలిక -  64 ;; రచయి3 = కుసుమ ;

పాల్కడలి ఉయ్యాల

ఉంగ ఉంగ క్రిష్ణయ్య, 

కేరింతల చొంగలు ;;

చొంగ నురుగు ఉరకలెత్త ;

ఊయెల క్షీరాబ్ధి ఆయె ;

ఊగూ ఊగూ  ఉయ్యాలా, 

ఉగ్గు పాల జంపాలా ; ||

పాలకడలి కొత్తది ;

భువిని తోచె అందరికీ ;

శ్రీలక్ష్మి విచ్చేసెను -

సరగున ఈ వ్రేపల్లెకు - 

అందులకే - ఆహాహా ;

=========== ;

umga umga krishNayya, 

kErimtala comgalu ;;

comga nurugu urakaletta ;

uuyela ksheeraabdhi aaye ;

uuguu uuguu  uyyAlA, 

uggu paala jampaalaa ; ||

paalakaDali kottadi ;

bhuwini tOce amdarikee ;

Sreelakshmi wiccEsenu -

saraguna ee wrEpalleku - 

amdulakE - aahaahaa ;

&

శుభకృత్ సుమ గీత మాలిక -  63 ;; రచయి3 = కుసుమ ; 

28, మే 2022, శనివారం

త్రిభువనములకు స్వర జతులు

నెలవంకకు సాపత్యం - నెలత రాధ కెమ్మోవి ;

పెదవి అంచు చేరినది, చిన్ని వేణువు ; ||

కదిలించును అధరమ్ములు ; 

రాధ - కదిలించగ అధరమ్ముల ; 

పలికించే రాగఝరి ;

పులకించెను ప్రకృతి ఎద ; ||

కురిపించెను సంగీతము ;

రాధ - కురిపించగ సంగీతము ; 

దిశలన్నియు పురి విప్పిన ;

పింఛము తరి మెరిసేను ; ||

త్రిభువనములకు అదనముగా ;

ఒనగూడెను స్వర జతులు ;

భావ జ్ఞాన గాధావళి తేజములు ; ||

========= ;

nelawamkaku saapatyam - nelata raadha kemmOwi ;

pedawi amcu cErinadi, cinni wENuwu ; ||

kadilimcunu adharammulu ; 

raadha - kadilimcaga adharammula ; 

palikimcE raagajhari ;

pulakimcenu prakRti eda ; ||

kuripimcenu samgeetamu ;

raadha - kuripimcaga samgeetamu ; 

diSalanniyu puri wippina ;

pimCamu tari merisEnu ; ||

tribhuwanamulaku adanamugaa ;

onagUDenu swara jatulu ;

bhaawa jnaana gaadhaawaLi tEjamulu ; ||

& *

శుభకృత్ సుమ గీత మాలిక -  62 ;; రచయి3 = కుసుమ ;

26, మే 2022, గురువారం

సృజనల దశ

కళల కూడలి ఆయెను జగతి ; 

షోడశాలంకార ప్రియుడు -

శ్రీకృష్ణుడు, గోవిందుడు -

వినూత్న సృజనలకు - తాను, 

పెట్టింది పేరు కదా! ||

నీటి కొలత తెలిసినోడు ;

మీన, కూర్మ అవతారుడు ;

అవని కొలత తెలిసినోడు ;

శ్రీవామన అవతారుడు ; ||

విల్లంబు కొలత తెలిసినోడు ;

వెదురు కొలత తెలిసినోడు ;

శ్రీరామ, కృష్ణ అవతారుడు ; ||

కడలి కొలత తెలిసినోడు ;

త్రి శరణ సూత్ర వితరణలు -

సంఘమునకు ఇచ్చినోడు ;

పరశురామ, బుద్ధదేవ అవతారుడు ; || 

ఖడ్గధారి, చతుష్పాత్తు అశ్వస్వారి ;

ధర్మ శృతి - తన ధర్మముగా -

బయలుదేరె - కలిపురుషుడు - శ్రీకృష్ణుడు; || 

===================== ;

sRjanala daSa ;-  Telugu song ;- 

kaLala kUDali aayenu jagati ; 

shODaSAlam kAra priyuDu -

SrIkRshNuDu, gOwimduDu -

winuutna - sRjanalaku - 

taanu, peTTimdi pEru kadA! ||

nITi kolata telisinODu ;

meena, kuurma awatAruDu ;

awani kolata telisinODu ;

SrIwAmana awatAruDu ; ||

willmbu kolata telisinODu ;

weduru kolata telisinODu ;

SrIrAma, kRshNa awatAruDu ; ||

kaDali kolata telisinODu ;

tri SaraNa suutra witaraNalu -

samghamunaku iccinODu ;

paraSuraama, buddhadEwa awatAruDu ; || 

khaDgadhaari, catushpaattu aSwaswaari ;

dharma SRti - tana dharmamugaa -

bayaludEre - kalipurushuDu - SrIkRshNuDu; || 

&

శుభకృత్ సుమ గీత మాలిక -  61 ;; రచయి3 = కుసుమ ;

గగనం - శ్రీహారతి పళ్ళెము

గగనమిపుడు పళ్ళెరము - 

శ్రీహారతి పళ్ళెము ; || 

ప్రాక్ గగనము -  అపరంజి పళ్ళెము ;

తెలివెలుగులు కురిసేను ;

ఈ రీతిని కురిసేను - భళ్ళున - 

తొలి పొద్దుకు ఎందుకయా, ఈ తొందర!!? ;

తెలిసె తెలిసె  -

శ్రీకృష్ణస్వామి ఆగమన వేళ ఇది ;

వేణు రవళి మధు హవళి ; ||

తూర్పు చెట్టు తొర్ర లోన ;

దాచుకొనెను ఇంత కాంతి ; 

తొలి పొద్దు శుభమస్తని -

నింగి కొంగు పట్టినది ; ||

ప్రాక్ గగనము - హారతి పళ్ళెమాయె ;

మేల్మి మిసిమి ప్రభలు కురిసె ;

తమసు తొలిగి, పెను మాయగ -

ప్రభా వీచి కదలసాగె ; ||

==============, ;

gaganamipuDu paLLeramu - 

Sreehaarati paLLemu ; || 

praak gaganamu - aparamji paLLemu ;

teliwelugulu kurisEnu - 

I reetini kurisEnu - bhaLLuna - ;

toli podduku emdukayaa, ee tomdara!!? ;

telise SreekRshNaswaami aagamana wELa idi ;

wENu rawaLi madhu hawaLi ; ||

tuurpu ceTTu torra lOna ;

daacukonenu imta kaamti ; 

toli poddu Subhamastani -

nimgi komgu paTTinadi ; ||

praak gaganamu - haarati paLLemAye ;

mElmi misimi prabhalu kurise ;

tamasu toligi, penu maayaga -

prabhaa weeci kadalasaage ; ||  

&

శుభకృత్ సుమ గీత మాలిక - 60 ; రచయి3 = కుసుమ ;  

24, మే 2022, మంగళవారం

మదనజనకుని మందగమనము

యమున ఒడ్డు, రాసక్రీడ వేళాయెను, 

జనులందరు - వేచి చూచుచున్నారు -

మన క్రిష్ణయ్య రాక కొరకు ; ||

మదనజనకుడు తాను - మందగమన మేలనే!?

ఇటు పున్నమి వెన్నెల - మసకబారుచుండెనే!; ||

వందనములు రాధవి - శతకోటి వందనములు రాధికవి ;

మదనగోపాలస్వామి! విచ్చేయుము, వేగిరముగ ; || 

=============================== ,

madanajanakuni mamdagamanamu ;-

yamuna oDDu, raasakreeDa - wELAyenu, 

janulamdaru - wEcicuucucunnaaru - 

mana krishNayya rAka koraku ; ||

madanajanakuDu taanu - mamdagamana mElanE!?

iTu punnami wennela - masakabaarucumDenE!; ||

wamdanamulu raadhawi - SatakOTi wamdanamulu raadhikawi ;

madanagOpAlaswAmi! wiccEyumu, wEgiramuga ; || 

& శుభకృత్ సుమ గీత మాలిక - 59 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;

కడవేమో నల్లన - పాలేమో తెల్లన

గోపి భుజమున కడవ ; కడవ నిండా పాలు ;

కడవేమో నల్లన - పాలేమో తెల్లన ; ||

నీలి కలువలు మడుగున- ఒడ్డున గోపీ రాధలు ;

కలువలేమొ నల్లన - ఇంతి నవ్వులేమొ తెల్లన ;

సఖికి వేణుగానమ్ములు నేర్పుచుండె కన్నయ్య ;

రాధ మనసు తెల్లన - శ్రీకృష్ణ ఛాయ నల్లన ; ||

============================ , 

kaDawEmO nallana - paalEmO tellana ;- 

gOpi bhujamuna kaDawa ; kaDawa nimDA pAlu ;

kaDawEmO nallana - paalEmO tellana ; ||

neeli kaluwalu maDuguna - oDDuna gOpee raadhalu ;

kaluwalEmo nallana - imti nawwulEmo tellana ;

sakhiki wENugaanammulu nErpucumDe kannayya ;

raadha manasu tellana - SrIkRshNa CAya nallana ; ||

& శుభకృత్ సుమ గీత మాలిక - 58 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ; ;

బుల్లి వెదురుబద్ద పిల్లనగ్రోవిగ మారినది

సోకులన్ని తనవేలే - మూరెడంత వంశీ ;

సోకులన్ని తనవేలే ; || 

కృష్ణయ్య - పద్మహస్తములందున చేరెను -

బుల్లి వెదురుబద్ద ఇపుడు, పిల్లనగ్రోవిగ మారె - అదీ కథ ; 

||సోకులన్ని తనవేలే! || 

కామదేవు జన్మదాత - చిగురువేళ్ళ శక్తి, మహిమ -

చందము అది - చిందించును సంగీతము ; 

||సోకులన్ని తనవేలే||

ఆస్థాన- వాయిద్యమాయె - చిట్టి మురళి ;

మధుర రాగ సం స్థానముగా - వెలిసింది నేడు చూడు సఖీ!

కృష్ణమూర్తి - పద్మహస్తముల చేరెను -

బుల్లి వెదురుబద్ద ఇపుడు, పిల్లంగ్రోవి ఆయె- అదీ కథ ; 

సోకులన్ని తనవేలే ; 

========================= ,

bulli wedurubadda pillanagrOwiga mArinadi ;- song ;-

sOkulanni tanawElE - muureDamta wamSI ;

sOkulanni tanawElE ; || 

kRshNayya - padmahastamulamduna cErenu -

bulli wedurubadda ipuDu, pillanagrOwiga mAre - adee katha ; 

||sOkulanni tanawElE! || 

kaamadEwu janmadaata - ciguruwELLa Sakti, mahima -

camdamu adi - cimdimcunu samgeetamu ; 

||sOkulanni tanawElE||

aasthAna- waayidyamaaye - ciTTi muraLi ;

madhura raaga sam sthaanamugaa - welisimdi nEDu cuuDu sakhee!

kRshNamuurti - padmahastamula cErenu -

bulli wedurubadda ipuDu, pillamgrOwi aaye- adee katha ; 

sOkulanni tanawElE ; 

& శుభకృత్ సుమ గీత మాలిక - 57 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;

కలువరేకుల పాట - గురువు రాధ

కువలయ దళనేత్రి రాధ - సన్నిధికి అరుగుచుండె -

శ్వేతపుష్ప పరిమళాలు - విశ్వగాన సంభ్రమాలు ; || 

తెలి - కలువరేకుల పాట - గురువు రాధ మ్రోలనే - 

రాగ సాధనలు - చేయు శిష్య వలయ - 

కువలయ సుమ సందోహము ; ||

కృష్ణపారిజాతమాలల - మధుతావులు ఉప్పొంగెను ;

మిత్ర కలువబాలలు - చేయుచున్న పరిచయ కృతి -

సౌరభాల విభ్రమాలు - రాణువ కెక్కుచున్న -

భవ్య కృష్ణ గానమ్ములకు - దొరికె కొత్త చరణమ్ముల -

అభ్రకద్యుతి హేలల సిరి లాలనలు -

ఇంపుసొంపు గమకమ్ముల మేళవింపు ;  || 

=================== ;

kaluwarEkula pATa - guruwu rAdha  ;-

kuwalaya - daLanEtri raadha - sannidhiki arugucumDe -

SwEtapushpa parimaLAlu - wiSwagaana sambhramaalu ; || 

teli - kaluwarEkula pATa - guruwu raadha mrOlanE - 

raaga saadhanalu - cEyu Sishya walaya - 

kuwalaya suma sam dOhamu ; ||

kRshNapaarijaatamaalala - madhutaawulu uppomgenu ;

mitra kaluwabaalalu - cEyucunna paricaya kRti -

saurabhaala wibhramaalu - raaNuwa kekkucunna -

bhawya kRshNa gaanammulaku - dorike kotta caraNammula -

abhrakadyuti hElala siri laalanalu -

impusompu gamakammula mELawimpu ;  ||  

;

& శుభకృత్ సుమ గీత మాలిక - 56 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;

మురళీధర ఇష్టసఖీ, రాధమ్మా! రావమ్మా!

కృష్ణసఖి రాధ కడనె ఉన్నవిలే -

సకల సంతోషమ్ములు ; || 

వేణువింత డీలాపడె ; మగువ జాడ క్రాంతిరేఖ - 

విలోమ గతి చెందినదా అని ; 

వింతగాను, వేణువింత డీలాపడె ; ||

నది యమున వడి తప్పెను ; 

మునుముందుగ వనిత పాద స్పర్శ తెలిసి ఉన్న -

నీలి యమున వడి తప్పెను ; || 

మురళీధర ఇష్టసఖీ, రాధమ్మా! రావమ్మా!

నీ పొలుపు చాలు ;

నిఖిల జగతి - సక్రమగతి మరల పొందు -

రాధమ్మా! రావమ్మా!

=============== ;

tana waddane unnawilE, sakala samtOshammulu ;

kRshNasakhi raadha kaDane unnawilE -

sakala samtOshammulu ; || 

wENuwimta DIlaapaDe ; maguwa jADa kraamtirEKa - 

wilOma gati cemdinadaa ani ; 

wimtagaanu, wENuwimta DIlaapaDe ; ||

nadi yamuna waDi tappenu ; 

munumumduga wanita paada sparSa telisi unna -

neeli yamuna waDi tappenu ; || 

muraLIdhara ishTasakhee, 

raadhammA! rAwammA!

nee polupu caalu ;

nikhila jagati -

sakramagati marala pomdu -

raadhammA! rAwammA! ;

& శుభకృత్ సుమ గీత మాలిక - 55 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;

మనోసరసి నళినములు

కృష్ణ దర్శనం - శ్రీకృష్ణ దర్శనం -

హృదయసరసి నళినములకు మనోల్లాసమే ; ||

సుప్రజా నాయకమణి - వసుమతీ మాత - 

హరిత సస్య విరాజితయై - 

విలసిల్లుట - కృష్ణ చాతుర్యమే ; 

||మందహాస వదనం|| 

ఛప్పన్నారుల సీమలు - శాంతి సంతోష భోగ -

శుభగతి విలసిల్లుట - కృష్ణచాతుర్యమే ; 

||ఆహా, మందహాస వదనం|| 

==================== ; 

aahaa - mamdahAsa wadanam -

kRshNa darSanam - SreekRshNa darSanam -

hRdayasarasi naLinamulaku manOllaasamE ; ||

suprajaa naayakamaNi - wasumatee maata - 

harita sasya wiraajitayai - 

wilasilluTa - kRshNa caaturyamE ; 

||mamdahAsa wadanam|| 

Cappannaarula seemalu - Saamti samtOsha BOga -

Subhagati wilasilluTa - kRshNacaaturyamE ;

 ||AhA, mamdahAsa wadanam|| ;

& శుభకృత్ సుమ గీత మాలిక - 54 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;

సరి పోలికలను చూపవయా

 కానీ, కానీ - ఎంతసేపనీ .... ,

నీదు అల్లరిని భరియించు - భామిని!? ;

సహియించు యశోద!!? ---

క్రిష్ణా - నీదు ముగురులు - అతి చంచలములు ;

కెమ్మోవిని ఉరికే - నీ దరహాసం చంచలమ్ము కద ;

కొంటెతనమ్ముల వెల్లువ ఎంతని - ఎంచగలమిక, క్రిష్ణయ్యా! 

సంచలించు నీ తులిపితనమ్ములు - చిలిపితనమ్ములు, ఆగడమ్ములు ;

సాదృశ్యములు ఏవైనా - ఉంటే నీవే చూపవయా ; ;

నీవే మాకిక చూపవయా చూపవయా ;

=========================  ,

sari pOlikalanu cUpawayA ;- song ;-

kaanee, kaanee - emtasEpanii .... ,

needu allarini bhariyimcu - bhaamini!? ;

sahiyimcu yaSOda!!? ---

krishNaa - needu mugurulu - ati camcalamulu ;

kemmOwini urikE - nee darahaasam camcalammu kada ;

komTetanammula welluwa emtani - emcagalamika, krishNayyA! 

samcalimcu nee tulipitanammulu - cilipitanammulu, aagaDammulu ;

saadRSyamulu Ewainaa - umTE neewE cUpawayA ; ;

neewE maakika cuupawayaa cuupawayaa ;

& శుభకృత్ సుమ గీత మాలిక - 53+ ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ; 

మయూరి తోటి కబురు

ఆలమందల ధూళి ఎగసెను ;

సంధ్య వన్నెలు - అరుణిమలాయెను ;

పాటలగంధి - నీదు రాధిక - 

వెన్నముద్దలు చేసిఉంచినది ;

మయూరి తోటి కబురు పంపినది ;

నీకు తెలుపలేదా ...,

కబురును - మయూరి తెలుపలేదా!? - - -

యమునా వాహిని కెరటమ్ము, నురుగులు ;

నీ నాట్యజాలమున -

బందీలవగా - పరితపించుచూ -

ఎగయుచున్నవి - 

కొంటెతనములకు ముద్దుబిడ్డవు -

లీలాక్రిష్ణా, రావయ్యా! || 

=============== ,   

aalamamdala dhULi egasenu ;

samdhya wannelu - aruNimalaayenu ;

paaTalagamdhi - needu rAdhika - 

wennamuddalu cEsiumcinadi ;

mayuuri tOTi kaburu pampinadi ;

neeku telupalEdaa ...,

kaburunu - mayuuri telupalEdaa!? - - -

yamunaa waahini keraTammu, nurugulu ;

nee naaTyajaalamuna -

bamdeelawagaa - paritapimcucuu -

egayucunnawi - 

komTetanamulaku muddubiDDawu -

leelaakrishNA, rAwayyA! || 

శుభకృత్ సుమ గీత మాలిక - 52 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;

లయగతి - సంగతి గమక శృతి

మధుకుంజమ్ముల భృంగతతుల - 

విభ్రమ క్రీడలు, సంభ్రమమ్ములు - 

రమణి రాధిక - భ్రూ విభ్రమ చలన -

అభ్రక కాంతుల నాట్య భంగిమల - 

లయగతి - సంగతి గమక శృతి ;  ||

అల్లవిగో, మేఘాడంబర పటహధ్వనులు -

ఫెళఫెళార్భటులు ;;

భయవిహ్వలయై యమునాతటిని -

నిలిచెను రాధ - 

పిల్లనగ్రోవిని తడవనీయక -

చెంగున దాచెను భద్రముగా ;

నీవు వత్తువని - 

మురళిని నిమిరి - మృదుగానములను -

జగతి కొసగుదువని ....,

ముగ్ధ రాధిక - వేచిఉన్నది ; ||

===============,

madhukumjammula BRmgatatula - 

wibhrama krIDalu, sambhramammulu - 

ramaNi raadhika - bhruu wibhrama calana -

abhraka kaamtula nATya bhamgimala - 

layagati - samgati gamaka SRti ;  ||

allawigO, mEGADambara paTahadhwanulu -

pheLapheLArBaTulu ;;

bhayawihwalayai yamunaataTnii -

nilicenu raadha - 

pillanagrOwini taDawaneeyaka -

cemguna daacenu bhadramugaa ;

niiwu wattuwani - 

muraLini nimiri - mRdugaanamulanu -

jagati kosaguduwani ....,

mugdha rAdhika - wEciunnadi ; ||

&  శుభకృత్ సుమ గీత మాలిక - 51 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;

వ్రేపల్లె భాగ్యములు - వాస్తవమ్ములు, సహజోక్తులు

ఎంతమాత్రమూ హెచ్చులు కాదులె ;

వ్రేపల్లె భాగ్యములు - వాస్తవమ్ములే ;

                          సహజోక్తులులే ; || 

రాసక్రీడల ఆటల పాటల - పాటవమ్ములు ;

సుపరిచితాలు - ఈ గ్రామమునకు -

పంచదారగుళికలు - తానెన్నడో -

దానము చేసెను, కాబోలు ;

దీపావళిని పర్వదినముగా -

ప్రపంచమ్మునకు తానిచ్చినది ; ||

భోగ*శయనుడు - భోగఫణమ్ముల - 

నాట్యాసక్తి చోద్యమటే!?

ఎంతమాత్రమూ హెచ్చులు కాదులె ;

వ్రేపల్లె భాగ్యములు - వాస్తవమ్ములే ;

                   సహజోక్తులులే ; ||

భోగ*శయనుడు = *శేషశాయి ;;  భోగఫణి* = కాళీయుడు ;

============================= ,

emtamaatramuu hecculu kAdule ;

wrEpalle BAgyamulu - waastawammulE ;

                      sahajOktululE ; || 

raasakrIDala ATala pATala - paaTawammulu ;

suparicitaalu - ee graamamunaku -

pamcadaaraguLikalu - taanennaDO -

daanamu cEsenu, kaabOlu ;

deepaawaLini - parwadinamugaa -

prapamcammunaku taaniccinadi ; ||

BOga*SayanuDu - bhOgaphaNammula - 

naaTyaasakti cOdyamaTE!?

emtamaatramuu hecculu kAdule ;

wrEpalle BAgyamulu - waastawammulE ;

            sahajOktululE ; ||

BOga*SayanuDu = *SEshaSAyi ;; bhOgaphaNi* = kaaLIyuDu ;

& శుభకృత్ సుమ గీత మాలిక -  51 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;; 

అన్వేషణల సత్వర ఫలితము

పులుకు పులుకున - వెలయుచున్నవి -

పణతి నయనముల వీక్షణ కాంతులు ;

ఆతృత ఏలనె, గోపీ రమణీ!

దర్పణమైన చూడకుండగనే -

యమునా తటికి పరుగులేలనే!? ; ||

కౌస్తుభమణి తళుకు తటిల్లత ప్రభలప్రాభవము ;

కురిసిన బృందావనము లోపలనె ;

మన శ్రీకృష్ణ దేవుడు - ఉండునులే ;

మనసు పెట్టి, నువు - సాగించేటి -

అన్వేషణలకు సత్వర ఫలితము -

లభియించునులే -

విజయము నీదగు - తథ్యములే ;  ||

================= ,

puluku pulukuna - welayucunnawi -

paNati nayanamula weekshaNa kaamtulu ;

aatRta Elane, gOpI ramaNI!

darpaNamaina cuuDakumDaganE -

yamunaa taTiki parugulElanE!? ; || 

kaustubhamaNi taLuku taTillata prabhalaprABawamu ;

kurisina bRmdaawanamu lOpalane ;

mana SreekRshNa dEwuDu - umDunulE ;

manasu peTTi, nuwu - sAgimcETi -

anwEshaNalaku satwara phalitamu -

labhiyimcunulE -

wijayamu needagu - tathyamulE ;  ||

& శుభకృత్ సుమ గీత మాలిక -  50 ;; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;; 

శరత్ పూర్ణిమ - స్వీకృతి

చల్లని తెల్లని వెన్నెలను - నెరి వెన్నెలను ; ||

నీలమోహనుని మేను అంబరము -

స్వీకృతి సతతము - శరత్ పూర్ణిమగ -

సరికొత్త ప్రభలతో భాసిల్లునుగా ; ||

మోహనకృష్ణుని మ్రోల భామిని -

శుభ శోభలను పుణికిపుచ్చుకుని ; 

పొంగుచున్నది యమున వాహిని ; || 

=========================  ,

kaluwarEkula kannulu kurisenu -

callani tellani wennelanu - neri wennelanu ; ||

neelamOhanuni mEnu ambaramu -

sweekRti satatamu - Sarat puurNimaga -

sarikotta prabhalatO bhaasillunugaa ; ||

mOhanakRshNuni mrOla BAmini -

Subha SObhalanu puNikipuccukuni ; 

pomgucunnadi yamuna waahini ; || 

;  & శుభకృత్ సుమ గీత మాలిక - 49 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;

చైత్ర చిత్రములు - చిత్ర చైత్రములు

చైత్ర చిత్రములు - చిత్ర చైత్రములు ;

కృష్ణలీలలు శతకోటి వర్ణ చిత్రములు ;

పుటము పెట్టిన పసిడి పటములు -

ప్రకృతికి పట్టము కట్టిన బంగారు పటములు ; ||

నీ లావణ్య రూపము - సిరి వైభవములకు ;

రాధ డెందము - మణిమందిరము ;

మీ ఊహల తలపుల ఉనికిని పొందిన - 

ఈ భక్తులదెంతటి సౌభాగ్యమయా ; ||

=============== ,

caitra citramulu - citra caitramulu ;

kRshNalIlalu SatakOTi warNa citramulu ;

puTamu peTTina pasiDi paTamulu -

prakRtiki paTTamu kaTTina bamgaaru paTamulu ; ||

nee laawaNya ruupamu - siri waibhawamulaku ;

rAdha Demdamu - maNimamdiramu ;

mee uuhala talapula unikini pomdina - 

ee bhaktulademtaTi sauBAgyamayaa ; ||

శుభకృత్ సుమ గీత మాలిక - 48 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;

15, మే 2022, ఆదివారం

ఫక్కున చంద్రుడు నవ్వేను

ఫక్కున ఎందుకు నవ్వెను చందురుడు ;

మన రాధమ్మకు - కోపం వచ్చెనని ; ||

ఎపుడూ అలుకలు ఎరుగని పిల్ల -

తమాల పల్లవ సుకుమారి -

మంజీరములు ఘల్లున మ్రోగుతు ;

వంతలు పాడెను - రాధ కినుకకు ; ||

పెంకికృష్ణుడు తుంటరి మాధవ -

మొండిగ పాముతొ - ఆటలాడెనని ;

తెగ నాట్యాలాడుచుండెనని ;

... కారం మిరియాల్ నూరసాగినది -

బాష్పనేత్ర ఈ బాలామణి - అని ;

ఫక్కున నవ్వెను చందురుడు -

మిరియపు వంటల జాణలు -

ఆడువారు* - ఈ స్త్రీలు కదా - అని ;

ఫక్కున నవ్వేను ; || 

&

* ఆడువారు = *ఆడవాళ్ళు ;

===================== ,

phakkuna emduku nawwenu camduruDu ;

mana raadhammaku - kOpam waccenani ; ||

epuDuu alukalu erugani pilla -

tamaala pallawa sukumaari -

mamjeeramulu ghalluna mrOgutu ;

wamtalu pADenu - raadha kinukaku ; ||

pemkikRshNuDu tumTari maadhawa -

momDiga paaamuto - aaTalADenani ;

tega naaTyaalADucumDenani ;

... kaaram miriyaal nuurasaaginadi -

baashpanEtra ee baalaamaNi - ani ;

phakkuna nawwenu camduruDu -

miriyapu wamTala jANalu -

ADuwaaru* -  ee streelu kadaa - ani ;

phakkuna nawwEnu ; || 

&

* ADuwAru = *ADawaaLLu ;

&

శుభకృత్ సుమ గీత మాలిక - 47 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;

మంచి నమూనా దొరికింది

మదనుని పత్ని రతీదేవి - పోతపోయసాగెను ;

ఇన్ని యుగాలకు - మనకు -

మంచి నమూనా దొరికెను - అనుచు ; ||

చీటికిమాటికి కదులు ముంగురులు -

సవరించుకొనేను రాధమ్మ ;

గాలి అల్లరిని, జాణతనమ్మును -

కోపగించుకుంటూ -

ప్రణయిని రాధిక కోపగించుకుంటూ ; ||

నవనీతప్రియుడు చాటుగ వచ్చి -

తన మేలిముసుగును, కొంగును పట్టి,

లాగి చిలిపిగా - నవ్వుతు  ఉంటే ;

ప్రణయిని రాధిక కోపగించుకుంటూ ; ||

ఈ కొంటె సన్నివేశం , 

శిల్ప కళలకు బంగరు కానుక -

అమూల్య బహుమతియె, ఓ చెలియా!

కనుకనె, నేడు ;

ప్రణయశిల్పులకు - అంతులేని పని ; || 

================= ;

madanuni patni rateedEwi - pOtapOyasaagenu ;

inni yugaalaku - manaku -

mamci namuunaa dorikenu- anucu ; ||

ciiTikimATiki kadulu mumgurulu -

sawarimcukonEnu rAdhamma ;

gaali allarini, jaaNatanammunu -

kOpagimcukumTU -

praNayini rAdhika kOpagimcukumTU ; ||

nawaneetapriyuDu cATuga wacci -

tana mElimusugunu, komgunu paTTi,

laagi cilipigaa - nawwutu umTE ;

praNayini rAdhika kOpagimcukumTU ; ||

ee komTe sanniwESam , 

Silpa kaLalaku bamgaru kaanuka -

amuulya bahumatiye, O celiyA!

kanukane, nEDu ;

praNayaSilpulaku - amtulEni pani ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక - 46  ; రచయి3 = కుసుమ ; &  Ksp రాధా వేణు రవళి ;  FB ;

కృష్ణప్రేమ అనే తెడ్డు

వింతలెన్నొ తోచుచుండెనే, 

నేడు - వింతలెన్నొ తోచుచుండెనే ; ||

శీత మలయసమీరము - ముంగురులను త్రోస్తున్నది ;

రాధ - ముంగురులను త్రోస్తున్నది ; ||

రాధా హృదయము యమున వాహిని - 

తెడ్డు అలల తోయుచుండె ;

కృష్ణప్రేమ అనే తెడ్డు - ఆ అలలను తోయుచుండె ; ||

ఇంత మంచి దృశ్యాలను - వీక్షిస్తూ -

రతి అచ్చెరువందుచుండ ;

నవ్వులను చిందించును -

అయిదు పూల విలుకాడు* ; ||

&

అయిదు పూల విలుకాడు* = పంచబాణహస్తుడు = మన్మధుడు ;; 

================ ; 

wimtalenno tOcucumDenE, 

nEDu - wimtalenno tOcucumDenE ; ||

SIta malayasameeramu - mumgurulanu trOstunnadi ;

raadha - mumgurulanu trOstunnadi ; ||

raadhaa hRdayamu yamuna waahini - 

teDDu alala tOyucumDe ;

kRshNaprEma anE teDDu - aa alalanu tOyucumDe ; ||

imta mamci dRSyaalanu - weekshistuu -

rati acceruwamducumDa ;

nawwulanu cimdimcunu -

ayidu puula wilukADu* ; ||

ayidu pUla wilukADu* = pamcabANahastuDu / manmadhuDu  ; 

;

శుభకృత్ సుమ గీత మాలిక - 45 ; రచయి3 = కుసుమ ;  & + Ksp రాధా వేణు రవళి ;  FB ;

11, మే 2022, బుధవారం

కొండగాలి వీచింది

కొండగాలి వీచింది ;

బంగారు శంఖమ్ములోకి ;

పార్ధసారధి ఊదేటి శంఖమ్ములోనికి ; ||

కొండగాలి దూరింది -

ఇందీవర శ్యాముని మురళిలోనికి ; ||

కొండగాలి జారుతోంది -

యమునా జల అలలలోకి - 

తళుక్కుమని - అలలపైకి ; ||

కొండగాలి విస్తరింపు -

రసగానలోల భక్తజనుల - 

హృదయాలలోనికి ; ||

కొండగాలి కింత చొరవ ... ,

ఔరా! ఆహాహా ... , - ఎందువలన అంటే -

తాను - చిన్ని పిల్లనగ్రోవిలోన ; 

మధురవళిగ మారేందుకు ; 

మృదువు మృదువుగా ; 

మృదు మధురమ్ముగ పరిణమిస్తు... , 

పరిణమిస్తు పరిణమిస్తు - 

పరిఢవిల్లుతూ .... ;

===============,

komDagaali weecimdi ; 

bamgaaru SamkhammulOki ;

paardhasaaradhi uudETi SamkhammulOniki ; ||

komDagaali duurimdi -

imdeewara Syaamuni - muraLilOniki ; ||

komDagaali jaarutOmdi -

yamunaa jala alalalOki - 

taLukkumani - alalapaiki ; ||

komDagaali wistarimpu -

rasagaanalOla bhaktajanula -hRdayaalalOniki ; ||

komDagaali kimta corawa ... ,

auraa! aahaahaa ... ,

emduwalana amTE -

taanu - cinni pillanagrOwilOna ; 

madhurawaLiga maarEmduku ; 

mRduwu mRduwugaa ; 

mRdu madhurammuga pariNamistu... , 

pariNamistu pariNamistu - 

pariDhawillutuu .... ; 

& ;- 

శుభకృత్ సుమ గీత మాలిక - 44 ; రచయి3 = కుసుమ ;  & + Ksp రాధా వేణు రవళి ;

గాలి దారి మళ్ళింది

గాలి దారి మళ్ళింది ;

వేణుగానమ్ము బాటలోకి ;

నేడు, గాలి దారి మళ్ళింది ; || 

రాధ హృదిని సాగేటి పాట ; 

కృష్ణ మురళి పయి ; 

పల్లవాంగుళుల ఆట ; || 

ప్రేమమాట సురభిళం ; 

వ్యాపి చెందు ప్రతి చోట ; 

బృందావన తోట ; 

నందన బృందావన తోట ; ||  

================= ,

gaali daari maLLimdi ; 

wENugaanammu bATalOki ;

nEDu, gaali daari maLLimdi ; || 

raadha hRdini saagETi pATa ; 

kRshNa muraLi payi ; 

pallawaamguLula ATa ; || 

prEmamATa surabhiLam ; 

wyaapi cemdu prati cOTa ; 

bRmdaawana tOTa ; 

namdana bRmdaawana tOTa ; ||

;

శుభకృత్ సుమ గీత మాలిక - 43 ; రచయి3 = కుసుమ ;  & + Ksp రాధా వేణు రవళి ;

10, మే 2022, మంగళవారం

మహిళ జడ - ముగ్గుకర్ర కొలత

ముగ్గు కఱ్ఱ కొలత కొరకు ; 

వేరె వెదుకులాట ఏల, గోపీ! 

నీదు - బారు జడయె చాలు నిదిగో భామినీ ;

అనుచు లాగి పట్టె ముద్దులొలుకు కృష్ణ ; 

లాగి పట్టె నిటుల ముద్దు కృష్ణ ; 

================= ; 

muggu ka~r~ra kolata koraku ; 

wEre wedukulaaTa Ela, gOpee! needu - 

baaru jaDaye caalu nidigO BAminee ;

anucu laagi paTTe mudduloluku kRshNa ; 

laagi paTTe niTula muddu kRshNa ;

&

శుభకృత్ సుమ గీత మాలిక - 42 ; రచయి3 = కుసుమ ; 

& + Ksp రాధా వేణు రవళి ;; song =  మహిళ జడ - ముగ్గుకర్ర  కొలత ;

మూడు నవ్వులు - ఆరు వెన్నెలలు

మూడు నవ్వులు - ఆరు వెన్నెలలు ...... , ;

       ఇచ్చోట, అచ్చెరువే ; 

ముగ్ధ లావణ్య రాధిక ఉన్నది -

       అందుకనే - ఇచ్చోట -

మూడు నవ్వులు - ఆరు వెన్నెలలు - 

       ఓ సఖియా!

గానలోలుడు, నీలమోహనుని ఎడదలోన ;

      తానే వెలిగే దీపము ; 

తిష్య తిమిర లోకమ్ములన్నిటికి - ;

      తానే దీపిక - 

మన సుమ సుకుమారి రాధిక ; ||

తన ప్రతి ఊహయు కిరణవల్లరి ;;

       అందులకే, రాధ కతమున -

క్రిష్ణ గాధలు తేజరిల్లుచుండు ;

      నిరంతరమ్ము తేజరిల్లుచుండు ; ||  

================== ;

mUDu nawwulu - aaru wennelalu ...... ,

       iccOTa, acceruwE ; 

mugdha lAwaNya raadhika unnadi -

       amdukanE - iccOTa -

||mUDu nawwulu - aaru wennelalu -

       O saKiyA! ||

gAnalOluDu, neelamOhanuni eDadalOna ;

      taanE weligE deepamu ; 

tishya timira lOkammulanniTiki - ;

      taanE deepika - 

mana suma sukumaari raadhika ; ||

tana prati uuhayu kiraNawallari ;;

       amdulakE, raadha katamuna -

krishNa gaadhalu tEjarillucumDu ;

      niramtarammu tEjarillucumDu ; ||

;

శుభకృత్ సుమ గీత మాలిక - 41 ; రచయి3 = కుసుమ

&  & + Ksp రాధా వేణు రవళి ;

3, మే 2022, మంగళవారం

జూకా మల్లె తావి

1] మైనాల పాటలకు , చిలక పలుకులకు - 

కొత్త పల్లవి చరణాల ;

చెబుతూన్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లుగానే ఉన్నది ;

2] మిలమిలల అల్లరిని - కృష్ణ చెలి రాధిక -

చెవుల జూకాలకు - తావి జూకా మల్లె -

చెబుతున్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లే ఉన్నది ;

3] గలగలల రంగుల సున్నితపు గాజులు ;

వడ్డాణ పట్టీల చిరు గంట, అందియలు ;

మమతానురాగాల స్వచ్ఛతల తీపిని ;

చెబుతూ ఉన్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లే ఉన్నది ;

4] కిలకిలల నవ్వుల పెదవి వంపులలోన - చిక్కిన చిరుగాలి ;

సంగీత, నాట్యాల - గురు కళల కూర్మిని ;

విశ్వమెల్లెడలా చాటుతున్నటే ఉన్నది .....,

వివరించి, చెబుతున్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లే ఉన్నది ; ||

రాధికను తలచుకుని, ఇన్నిన్ని ఊసుల - తలపోతల వెతలు ;

క్రిష్ణునికి సిగముడిని మెరిసేటి పింఛము 

తెలుసుకుని, జవ్వని రాధికకు -

చెబుతున్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లే ఉన్నది ; ||

;

=============================,

1] mainAla pATalaku ; cilaka palukulaku ;

kotta pallawi caraNAla ;

cebutuunnaTlE unnadi, 

amdistunnaTlugaanE unnadi ;

2] milamilala allarini - kRshNa celi raadhika -

cewula juukaalaku, taawi juukaa malle -

cebutunnaTlE unnadi, amdistunnaTlE unnadi ;

3] galagalala ramgula sunnitapu gaajulu ;

waDDANa paTTIla ciru gamTa, amdiyalu ;

mamataanuraagaala swacCatala teepini ;

cebutuu unnaTlE unnadi, amdistunnaTlE unnadi ;

4] kilakilala nawwula pedawi wampulalOna - cikkina cirugaali ;

samgeeta, nATyAla - guru kaLala kuurmini ;

wiSwamelleDalaa caaTutunnaTE unnadi .....,

wiwarimci, cebutunnaTlE unnadi, amdistunnaTlE unnadi ; ||

raadhikanu talacukuni, inninni uusula - talapOtala wetalu ;

krishNuniki sigamuDini - merisETi pimCamu ;

telusukuni, jawwani raadhikaku -

cebutunnaTlE unnadi, amdistunnaTlE unnadi ; ||

song 40 ; శుభకృత్ సుమ గీత మాలిక - 40 ; రచయి3 = కుసుమ ; ;

చాందినీ సొగసులు

శీత చాందినీ సొగసుల ;

జగతికి అభిషేకం ; ||

రాధ కలువ కన్నుదోయి ;

ప్రణయ భావ ముంగిలి ;

చంద్ర - కిరణాల ముగ్గులు ;

కోటి కిరణాళుల ముగ్గులు ; ||

సుధా చంద్ర తారుణ్యం ;

వసుధ మేను సువర్ణం ;

వేణు గాన మాధుర్యం ;

క్రిష్ణ ధ్యాన సంరంభం ; ||

==================,

SIta caamdinee sogasula ;

jagatiki aBishEkam ; ||

raadha kaluwa kannudOyi ;

praNaya BAwa mumgili ;

camdra -kiraNAla muggulu ;

kOTi kiraNALula muggulu ; ||

sudhaa camdra taaruNyam ;

wasudha mEnu suwarNam ;

wENu gaana maadhuryam ;

krishNa dhyaana sam rambham ; ||

&

& song 39 ; శుభకృత్ సుమ గీత మాలిక -  39  38 ; రచయి3 = కుసుమ ; ;  

ప్రియాళి ధ్యాన దీపిక

చల్లనైన నీ చూపులు పూల గొడుగులు ;

అమావాస్య నిశి రేయి యాచించుచున్నది నిన్ను ;

పున్నమిగా తను మారేనట, రాధికా ; ||

;

విరాళి ఏల, రాధికా! ప్రియాళి ధ్యాన దీపికా ;

శిఖి పింఛమౌళి మురళి రవళి కోసమెగా -

విరహ క్రోధ నవ రసాళి - ఇంత జాగు, చాలిక ;

కొమ్మలలో రామచిలుక తొంగిచూచుచున్నది ;

రాధ - నీదు - కినుక కూడ కందళించు వెన్నెలయే -

అనుచు - పచ్చదనము నారబోయు రాచిలుక ;

"చిలక పచ్చ" వన్నియలను - ఆరబోయు ముచ్చటగా,

చల్లబడవె రాధికా ; మా ముద్దుల మల్లికా ; ||

;

అదిగదిగో వేణు రవళి, శ్రీకృష్ణ వాత్సల్య రసకేళి ;

లాస హాస ధవళిమ, ముదిత రాధ ఆమోదము ;

ఒసగేను ముదము ప్రకృతికి - ఇక, వలసినంత చంద్రిక ;

రాత్రి ఇపుడు పున్నమి - రేయి నిత్య పౌర్ణమియే ; ||

==========================,

callanaina nee cuupulu puula goDugulu ;

amaawaasya niSi rEyi yaacimcucunnadi ninnu ;

punnamigaa tanu maarEnaTa, raadhikaa ; ||

wirALi Ela, rAdhikA! priyALi dhyAna dIpikaa 

;

SiKi pimCamauLi muraLi rawaLi kOsamegA -

wiraha krOdha nawa rasALi - imta jAgu, cAlika 

;

kommalalO raamaciluka tomgicuucucunnadi ;

raadha - needu - kinuka kUDa kamdaLimcu wennelayE -

anucu - paccadanamu nArabOyu raaciluka ;

"cilaka pacca" wanniyalanu - aarabOyu muccaTagA,

callabaDawe raadhikaa ; maa muddula mallikaa ; ||

adigadigO wENu rawaLi, SreekRshNa waatsalya rasakELi ;

lAsa hAsa dhawaLima, mudita rAdha AmOdamu ;

osagEnu mudamu prakRtiki - ika, walasinamta camdrika ;

rAtri ipuDu punnami - rEyi nitya paurNamiyE ; ||

&

song - 38 ; శుభకృత్ సుమ గీత మాలిక -  38 ; రచయి3 = కుసుమ ; 

వీక్షణముల తీగలు

వీక్షణముల తీగలపై జాలువారె కాలము ;

రాధ - వీక్షణముల తీగలపై జాలువారె కాలము ; ||

క్షణములన్ని వీణియ గానమ్ములు ఆయెనే ;

మృదు వీణియ గానమ్ములు ఆయెనే ;

మధుర రాగ మోహమ్ములు ఆయెనే ; ||

భళిర, ఇపుడు -

కృష్ణ మురళికిక మీదట ;

జత కరువు లేదులే ;

మురళి రవళి ప్రకృతికి ;

బహుమతియై వరలులే ; ||

=====================,

wIkshaNamula tIgalapai jAluwAre kAlamu ;

rAdha - wIkshaNamula teegalapai jAluwAre kAlamu ; ||

kshaNamulanni wINiya gaanammulu aayenE ; ;

mRdu wINiya gaanammulu aayenE ;

madhura raaga mOhammulu aayenE ; ||

BaLira, ipuDu -

kRshNa muraLikika mIdaTa ;

jata karuwu lEdulE ;

muraLi rawaLi prakRtiki ;

bahumatiyai waralulE ; ||

DemdamulO - walapu rEpenE, wirALi rEpenE ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక -  37 ; రచయి3 = కుసుమ ; 

లిపి - బొమ్మలు, ప్రతీకలు

లిపి - బొమ్మలు, ప్రతీకలకు - పారవశ్యమే ;

శ్రీకృష్ణలీలలు గ్రోలుతు ; ||

పద్యాలై, శ్లోకాలయి ; భక్తి కథలు, కావ్యాలుగ -

పౌరాణిక గాధలకు శోభ లొసగి ;

మారి మారి, తనివినొందు ; ||

తాళ పత్రములు పట్టినాడు సూరదాసు ;

తుకారామ్, మీరా - అగణిత భక్తకోటి -

మానస సరసులందు ఓలలాడు రాజహంస -

క్రిష్ణ, విఠల్, క్రిష్ణ విఠల్ ; ||

ఇక, అందుకోండి కవులారా - ఆ హృదయాహ్లాదం ;

అక్షరాల గుడి దీర్ఘాల్ కొమ్ములన్నీ ;

ఓత్వాలు, విసర్గలను సరిదిద్దండి ;

ప్రణయ భావ జిలుగులను అద్దండి ;

అద్దండి హత్తండి కొత్త జిలుగులు ;

హత్తండి హత్తండి కొత్త జిలుగు తళుకులు ;

యుగయుగాల క్రిష్ణ గాధ, మధురం మధురం ;

హత్తెరిగి, అందుకేనండీ, ఇది-

సదా సదా - మననం, మననం ; ||

==================,

lipi - bommalu, prateekalaku - paarawaSyamE ;

SreekRshNaleelalu grOlutu ; ||

padyAlai, SlOkAlayi ; bhakti kathalu, kAwyAluga -

paurANika gaadhalaku SOBa losagi ;

maari maari, taniwinomdu ; ||

tALa patramulu paTTinADu suuradaasu ;

tukaaraamm, meeraa - agaNita bhaktakOTi -

maanasa sarasulamdu ; OlalADu rAjaham sa -

krishNa, wiThal, krishNa wiThal ; ||

ika, amdukOwOmDi kawulaaraa - aa hRdayaahlaadam 

;

aksharaala guDi dIrGAl kommulannee ;

Otwaalu, wisargalanu sarididdamDi ;

praNaya BAwa jilugulanu addamDi ;

addamDi hattamDi kotta jilugulu ;

hattamDi hattamDi kotta jilugu taLukulu ;

yugayugAla krishNa gAdha ; madhuram madhuram ;

hatterigi, amdukEnamDI,

idi-  sadaa sadaa - mananam, mananam ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక - 36 ; రచయి3 = కుసుమ ;

పల్లె రహదారి

వ్రేపల్లె రాదారి* - నిడుపాటి జడపాయ ;

జవనాల గోపికలు నడిచి వెళ్ళంగా ;

రహదారి పూతావి అల్లికలు ఆయె ;

;

రాధమ్మ వయ్యారి నడిచి వెళ్ళంగా ;

బాటలు సురభిళ పందిరి ఆయె ;

శుభమస్తు, శ్రీఘ్రముగ, రావయ్య క్రిష్ణా!

దారిపై నీ లేత పాదాలు మోపు ;

నీ అడుగుజాడలతొ, రేపల్లె త్రోవ ;

దేవతా సుమ నిత్య పరిమళమ్మే అగును కదటయ్యా!

&

వ్రేపల్లె రాదారి* = * రేపల్లె రహదారి ;;

=============================,

wrEpalle raadaari - niDupATi jaDapAya ;

jawanaala gOpikalu naDici weLLamgA ;

rahadaari puutaawi allikalu aaye ;

;

raadhamma wayyaari naDici weLLamgA ;

bATalu suraBiLa pamdiri aaye ;

Subhamastu, SreeGramuga, raawayya krishNA!

daaripai nee lEta paadaalu mOpu ;

nee aDugujADalato, rEpalle trOwa ;

dEwataa suma nitya parimaLammE agunu kadaTayyA!

&

*wrEpalle rAdAri = rahadAri ;; & 

బాట పాట ; &

song - 36 ; శుభకృత్ సుమ గీత మాలిక -  36; రచయి3 = కుసుమ ; 

మెరుపులకు కులుకు హెచ్చింది

క్రిష్ణుడొచ్చాడమ్మ, క్రిష్ణుడొచ్చాడు ;

నల్ల మబ్బులలోన మెరుపు మెరిసింది ;

క్రిష్ణుడొచ్చాడొచ్చాడమ్మ, క్రిష్ణుడొచ్చాడు ;

మెరుపులకు అందుకే కులుకు హెచ్చింది ;

క్రిష్ణుడొచ్చాడమ్మ, క్రిష్ణుడొచ్చాడు ;

మెరుపులు నాట్యాలు నేర్చినాయపుడే ;

క్రిష్ణుడొచ్చాడమ్మ, క్రిష్ణుడొచ్చాడు ;

సరికొత్త వింతల ఇతిహాసమై వెలసి,

జగతి మన నేత్రముల కొలువుదీరింది ;

==================,

krishNuDoccADamma ; krishNuDoccADu ;

nalla mabbulalOna merupu merisimdi ;

krishNuDoccADoccaaDamma, krishNuDoccADu ;

merupulaku amdukE kuluku heccimdi ;

krishNuDoccADamma, krishNuDoccADu ;

merupulu nATyaalu nErcinaayapuDE ;

krishNuDoccADamma, krishNuDoccADu ;

sarikotta wimtala itihaasamai welasi,

jagati mana nEtramula koluwudeerimdi ;;

&

song 35 ; శుభకృత్ సుమ గీత మాలిక - 35 ; రచయి3 = కుసుమ ; ; 

కూడికలు, హెచ్చవేత, భాగహారములు

 చందమామ ఉపాధ్యాయ - పటుతరమౌ బోధన ;

చుక్కల గిలిగింతల పటిష్ఠ - మిణుకు మిణుకులు ; ||

గురివింద పొద చాటున -

ఏమిటి ఆ అలజడి? - ఏమో ఆ సందడి ?

ఆకులకు ఆ అలికిడి, ఆ సందడి ;

అది పత్రాల వాద్యాల - గీత సందడి ;

పూవుల మకరందాలకు - సౌందర్య కూడికలు ; ||

కీలాగ్ర పుప్పొడులకు హెచ్చింతలు,

హెచ్చు హెచ్చు హెచ్చవేతలు ; ||

రాధ, గోపి కోలాటం ఆటలలో హుషారులు ;

క్రిష్ణ మురళి మేళవింపు - ఆనందం -

అదనంగా అందేను చెవికి ఇంపు ;

పరస్పరం ఆమోద - సమ్మోద భావ హారమ్ములు ;

నిశీధి భాగహారమ్ములు ; ||

==================,

camdamaama upaadhyaaya - paTutaramau bOdhana ;

cukkala giligimtala paTishTha - miNuku miNukulu  ; ||

guriwimda poda cATuna EmiTi A alajaDi? 

EmO A samdaDi ?

aakulaku aa alikiDi, aa samdaDi ;

adi patraala wAdyaala - geeta samdaDi ;

pUwula makaramdaalaku - saumdarya kUDikalu ; ||

keelaagra puppoDulaku heccimtalu,

heccu heccu heccawEtalu ; ||

raadha, gOpi kOlATam aaTalalO hushaarulu ;

krishNa muraLi mELawimpu - aanamdam -

adanamgaa amdEnu cewiki impu ;

parasparam AmOda - sammOda BAwa hArammulu ;

niSIdhi BAgahaarammulu ; || 

&

song 34 ; శుభకృత్ సుమ గీత మాలిక - 34 ; రచయి3 = కుసుమ ; 

చిత్ర కావ్య పల్లవం

మహర్నవం, పునర్నవం - నవ నవీనమే ;

చిత్ర కావ్య పల్లవం - నిత్య పల్లవి ;

కృష్ణ ధ్యాన చరణం - ఏక ధ్యాస గీతము ;

తదేక ధ్యాస కావ్యావళి - ఇది రంగరంగేళీ ; ||

ఎవరి మాట వినడండీ, వేణురాగ వినోది -

మోహనాల కృష్ణుడు ;

బహు మొండి గోపిక - బొత్తిగా మాట్లాడదు,

ఈ గోపిక, సుమండీ ;

ఇలాగైతె ఎట్లాగ - సూత్రం ముడి పడేను ;

స్నేహ సూత్రం ముడి పడేను ; ||

ముడి పడిన పెదాలేమొ బుంగమూతి ;

గోపిక - ముడి పడిన పెదాలేమొ బుంగమూతి ;

ముడి వీడిన కురులేమో నంగనాచి ;

నిడుపాటి కేశాలు నంగనాచి ;

ఇరు మనసుల మూగభాష ఆత్రంగా ;

చిడిముడి పడిన ఊహలెన్నో చిత్రంగా ;

పీటముడిని విప్పగల ప్రజ్ఞ ఎవరిదో ; ||

=====================,

maharnawam, punarnawam - nawa nawInamE ;

citra kAwya pallawam - nitya pallawi ;

kRshNa dhyAna caraNam - Eka dhyAsa gItamu ;

tadEka dhyAsa kAwyAwaLi - idi ramgaramgELI ; ||

ewari maaTa winaDanDI, wENuraaga winOdi -

mOhanaala kRshNuDu ;

bahu momDi gOpika - bottigaa mATlADadu,

ee gOpika, sumamDI ;

ilaagaite eTlaaga - suutram muDi paDEnu ;

snEha suutram muDi paDEnu ; ||

muDi paDina pedAlEmo bumgamUti ;

gOpika - muDi paDina pedaalEmo bumgamUti ;

muDi wIDina kurulEmO namganAci ;

niDupATi kESAlu namganaaci ;

iru manasula muugaBAsha aatramgaa ;

ciDimuDi paDina uuhalennO citramgA ;

pITamuDini wippagala prajna ewaridO ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక -  33 ; రచయి3 = కుసుమ ; 

రాధకు మక్కువ

రేయి నింగి నల్లన - యమున నీరు నల్లన ;

ముద్దు కన్న మేను రంగు నల్లన ;

నలుపు వన్నె అంటేనే - రాధకెటుల మక్కువ అయె!? ;  ||

అల్లనల్లనదే అదే - వెలిసినది నెలవంక ;

ఇల మీద ఇక్కడనే - వెలసె కొత్త చంద్రవంక ;

ఇదేమి వింత, చెప్పరే, చెలియలార ; ||

;

చెక్కిలిపయి వేలు ఉంచి, అంత యోచనా!? ;

రాధిక విప్పేయగలదు, ఇందులోని చిక్కు ముడిని ; ||

క్రిష్ణుని కడ వనిత - చాల -

నేర్చె కదా పొడుపు కథలు -

చెప్పింది ఇట్టే - ఆ ప్రశ్న సమాధానం ; ||

;

ముద్దు కృష్ణ చిరునవ్వే ;

భువి పైన ఉన్న నెలవంక ;

ముత్తు క్రిష్ణ చిరునగవే -

వెన్నల నగ - నెలవంక ; ||

అయ్యారే చప్పట్లు, చమత్కార జవాబుల ;

గడుసు ముదిత రాధమ్మకు ;

మన గడుసు ముదిత రాధమ్మకు ; ||

======================,

rEyi nimgi nallana - yamuna neeru nallana ;

muddu kanna mEnu ramgu nallana ; ||

nalupu wanne amTEnE -

raadhakeTula labhyamaaye!? ||

allanallanadE adE - welisinadi nelawamka ;

ila meeda ikkaDanE - welase kotta camdrawamka ;

idEmi wimta, cepparE, celiyalaara ; ||

;

cekkilipayi wElu umci, amta yOcanA!? ;

rAdhika wippEyagaladu, imdulOni cikku muDini ; ||

krishNuni kaDa wanita - caala -

nErce kadaa poDupu kathalu -

ceppimdi iTTE - aa praSna samAdhAnam ; ||

;

muddu kRshNa cirunawwE ;

bhuwi paina unna nelawamka ;

muttu krishNa cirunagawE -

wennala naga - nelawamka ; ||

ayyArE cappaTlu, camatkAra jawAbula ;

gaDusu mudita raadhammaku ;

mana gaDusu mudita rAdhammaku ; ||

&

song  = 33 ; శుభకృత్ సుమ గీత మాలిక -  33 ;

నవ్వు తరువుల సంబరం

మోడు మాను కొమ్మలకు ;

పాట నేర్పు దరహాసం ;

రాధ అధర దరహాసం ; ||

కొమ్మలకు పులకింతలు ;

గీతమ్ముల సంపదలు ;

కమ కమ్మని -

గీతావళి సంపదలు ; ||

పువుల తొణుకు పుప్పొళ్ళు ;

మకరంద ధార - రవళికి ఆధారం ;

మోహన రవళికి ఆధారం ; ||

సుధా ధార సంగీత రాణి ;

ఆసీనయౌ - సింహాసనం అయ్యానని ;

తరువుకెంత సంబరమో!! ; ||

=================,

mODu maanu kommalaku ;

pATa nErpu darahaasam ;

raadha adhara darahaasam ; ||

kommalaku pulakimtalu ;

geetammula sampadalu ;

kama kammani - geetAwaLi sampadalu ; ||

puwula toNuku puppoLLu ;

makaramda dhaara - rawaLiki aadhaaram ;

mOhana rawaLiki aadhaaram ; ||

sudhaa dhaara samgeeta rANi ;

aaseenayau -

sim hAsanam ayyaanani ;

taruwukemta sambaramO!! ; ||

&

song - 32 ; శుభకృత్ సుమ గీత మాలిక -  32 ; రచయి3 = కుసుమ ;

వెన్నెలను చదువే హక్కు

 యమునలోన అలలు ;

తీరైన పంక్తులు ;

వెన్నెల లిపి ఇచట ;

వ్రాస్తున్నది ఎవ్వరో!? ; ||

పలు పలు పలు పద్యాలు ;

పలు కావ్యాలు, ప్రబంధాలు ;

విరచించున దెవ్వరో!?

మరి, పఠియించున దెవ్వరో!? ; ||

యమున రేవు, వ్రేపల్లె సీమలిటుల ;

ప్రణయ సుభగ మనోహరం ;

స్వచ్ఛ ప్రేమ నెలకొన్న ;

ప్రతి హృది బృందావనియే ;

పౌర్ణమీ చంద్రికలను ;

చదువు హక్కు వారిదే ; ||

================,

yamunalOna alalu ;

teeraina pamktulu ;

wennela lipi icaTa ;

wraastunnadi ewwarO!? ; ||

palu palu palu padyaalu ;

palu kaawyaalu, prabamdhaalu ;

wiracimcuna dewwarO!?

mari, paThiyimcuna dewwarO!? ; ||

yamuna rEwu, 

wrEpalle seemaliTula ; ||

praNaya subhaga manOharam ;

swacCa prEma nelakonna ;

prati hRdi bRmdaawaniyE ;

paurNamee camdrikalanu ;

caduwu hakku waaridE ; ||

&

song  = 31 ;; శుభకృత్ సుమ గీత మాలిక -  31 ; రచయి3 = కుసుమ ; ;

డెందము - మణి మందిరము

భువనము లన్నింటా నీవేరా , 

త్రిభువనము లన్నింటా నీవేరా, నా స్వామీ ; ||

నా మనసే అలంకృత మందిరము స్వామీ ;

నీవే - కొలువైనందున -

ఈ నా డెందము - మణి మందిరమై -

శోభలందినది, అద్భుతమ్ముగా నా స్వామీ ; ||

నీ చింతన సుధలను అమితముగా ;

గ్రోలిన జన్మము ధన్యముగా ;

అర్ధమ్మిట పరమార్ధమ్మందున ;

లీనమ్మగుటయె - వింతయాయె, నా జీవనమే ; ||

=================,

bhuwanamu lannimTA nIwErA ,

tribhuwanamu lannimTA -

neewErA, nA swAmI||

nA manasE alamkRta mamdiramu swaamI

neewE - koluwainamduna -

I nA Demdamu - maNi mamdiramai -

SOBalamdinadi, adbhutammugA nA swAmI||

nI cimtana sudhalanu amitamugA ;

grOlina janmamu dhanyamugaa ;

ardhammiTa paramaardhammamduna ;

leenammaguTaye wimtayaaye,

naa jeewanamE : ||

&

song - 30 ; శుభకృత్ సుమ గీత మాలిక - 30 ; రచయి3 = కుసుమ ;

ఇంతింత సంతోషం, ప్రకృతిలో, ఎందుకని!

 ఇంతింత సంతోషం - ప్రకృతిలోన,

ఎందుకని!? ఎందుకని!? ; ||

మేఘమాల పురిని విప్పి -

ఆడుతోంది నింగి నెమలి ; ||

అంబర సంబరముల గని ;

తిమిర గగన గని నుండి -

నక్షత్ర మణుల తళుకు నిధి ; ||

నెలవంక కురిసేను -

హర్ష శీతలమ్ముల -

సుతారంపు వెన్నెల ; ||

వంక వాగు ఝరుల వోలె -

ఇంతింత సంతోషం ; ప్రకృతిలో, ఎందుకని!? ; ||

ఇంత అంత హంగు పొంగు ;

అంతట హృత్ రంజనము ;

అల్లదే, వేణురవళి -

గాలిలోన తేలి వచ్చు - సాగి వచ్చు ;

కృష్ణ గీతి సమీరముల

డోలలూగు ఎల్లెడల ;

అందుకనే .....,

సృష్టిలోన ఇంతింత సంతోషం ;

ప్రకృతిలోన ఇంతింత సంతోషం ; ||

===================,

imtimta samtOsham - prakRtilOna,

emdukani!? ; emdukani!? ; ||

mEGamaala purini wippi -

ADutOmdi nimgi nemali ; ||

ambara sambaramula gani ;

timira gagana gani numDi -

nakshatra maNula taLuku nidhi ; ||

nelawamka kurisEnu -

harsha SItalammula -

sutaarampu wennela ; ||

wamka waagu jharula wOle -

imtimta samtOsham ; 

prakRtilO, emdukani!? ; ||

imta amta hamgu pomgu ;

amtaTa hRt ramjanamu ;

alladE, wENurawaLi -

gaalilOna tEli waccu -saagi waccu ;

kRshNa geeti sameeramula

DOlaluugu elleDala ;

amdukanE .....,

sRshTilOna imtimta samtOsham ;

prakRtilOna imtimta samtOsham ; ||

;

శుభకృత్ సుమ గీత మాలిక -  30 ; రచయి3 = కుసుమ ;