29, ఏప్రిల్ 2022, శుక్రవారం

అలల నురుగుల దండలు

 అలల నురుగు పూదండలు ; 

వెన్నెలమ్మ విచ్చేసెను ; 

యశోదమ్మకు కనుగీటెను ; 

కన్నయ్యకు సింగారం చేయు మేటిని నేనే -;

సింగారం చేయుటలో నీ కంటే - మేటిని నేనే - 

అంటూను, యశోదతోటి ఒకటే పోటీ ; 

జాబిలీ వెన్నెలమ్మ వేసెను ముందడుగు ; 

శశిచంద్రిక, తానే - వేసేను ముందడుగు ; || 

;

కనుబొమ్మలు ఎగరేస్తూ, మొదలెట్టింది ; 

కడలి అలలు నెలవులుగా చేసుకున్నది  ; 

అలల నురుగు బుడగలన్నిటా - 

వెదజల్లెను పున్నమలను ; 

ప్రతి బుద్బుద మణిని ఏరి, ఆభరణం చేసింది ;

రవల మణులు పొదిగిన తరగ నగలన్నిటిని ; 

క్రిష్ణయ్యకు వేసింది మనసారా ;

యశోదమ్మ, రేవతి నవ్వారు మనసారా ;

పౌర్ణమీ చంద్రికను ; అభినందించారు నోరారా ;

"ఓహోహో వెన్నెలమ్మ, ధన్యమాయె నీ జన్మం" 

అన్నారు ఆ ఇరువురు ; 

ఇరులు సమసి, వెలుగు పగలు ఆయెను కద, 

ఇప్పుడు ఈ రేయి మనసులోని -

ఈసు, అసూయ, పగలు,  

ప్రతీకారమంత - మటుమాయం అయ్యింది ;  ||

&

song - 20 ;; శుభకృత్ సుమ గీత మాలిక ;- 20 ;

కృష్ణ గగనం హంగామా

ఔరా, గగనం హంగామా, ; 

కృష్ణుని వాటం నీదే లేమ్మా! 

కాదంటామా మేమెవరము ఐనా ; 

భళి భళీ, భలే భలే ;  ||

తారలు చూపిస్తుంటావు ;

కన్నయ పదముల మువ్వలు -

      ఇవి - అంటుంటావు ;

భళి భళీ, భలే భలే ;  ||

మబ్బుల తళుకులు చూపిస్తూ ;

క్రిష్ణ హాసములు అంటున్నావు ;

భళి భళీ, భలే భలే ;  ||

తొలి - మలి ప్రొద్దుల కోవెల కట్టి ;

కృష్ణ గోవింద నిలయం అని -

మాకందరికీ దృశ్యమానము చేస్తున్నావు ;  

భళి భళీ, భలే భలే ;  ||

ఔర, అంబరమ! 

కృష్ణుని వాటం నీదే లేమ్మా! 

నల్లని వాని మేని ఛాయతో పోటీ నీది, 

ఐతేనేమి, రంజుగ ఉన్నది నీ ధాటి ; 

కాదంటామా మేమెవరము ఐనా 

భళి భళీ, భలే భలే ;  || 

&

కృష్ణ గగనం హంగామా ; - song = 19 ;; శుభకృత్ సుమ గీత మాలిక ;- 19 ;;

28, ఏప్రిల్ 2022, గురువారం

ఐనాడు అవతారమూర్తి

శేషశయనుడు - 

ఆదిశేషశయనుడు, గోవిందుడు ; 

మాయామానుష రూపుడు ; 

మన మోహనకృష్ణుడు ;  || 

;

శేషశాయికి ఇదేమి తుత్తర, నిత్యము తాను ; 

పాము పానుపు పయి పవళిస్తుతున్నా, 

పాములతోటి ఆటలు వీడు వీడడెప్పుడూ ; 

అదేమిటో గాని - 

పాములాటలను మానడెప్పుడూ ;  ||

;

కాళిందిలొ దూకెను - అల్లరి పిల్లడు - 

అనుకున్నామే - అది తప్పు ఆయెను ; 

కాళియ సర్పం ఫణాళిని ; 

ధిమ్ ధిమ్ ధిత్ ధిత్ ధిత్తళాంగులు -  

శుభ చరణముల - ఝళిపించిన స్వర జడి ; 

నాట్యశాస్రముకు లక్ష్య సూత్ర విధి ;

లక్షణ నిర్దేశ నిధి ; ................... ;

;

అందులకే కద, ఇతగాడు ఐనాడు అవతారమూరితి - 

ఐనాడు తానే - మానవ మానస దైవ స్వరూపము ; ||  

=====================, ; 

;

aadiSEshaSayanuDu, gOwimduDu ; 

kRshNuDu, mana mOhana kRshNuDu ;  

maayaamaanusha ruupuDu ;

;

1] SEshaSaayiki idEmi tuttara, nityamu taanu ; 

paamu paanupu payi pawaListutunnaa, 

paamulatOTi ATalu weeDu, weeDaDeppuDuu ;;

adEmiTo gAni - 

paamulATalanu maanaDeppuDU ;  ||

;

2] kALimdilo duukenu - allari pillaDu - 

anukunnaamE - adi tappu aayenu ; 

kaaLiya sarpam phaNALini ; 

SuBa caraNamula - dhimm 

dhimm dhit dhit dhittaLAmgulu -  

jhaLipimcina swara jaDi ; 

nATyaSAsramuku lakshya suutra widhi ;

lakshaNa nirdESa nidhi .......... ; 

;

amdulakE kada, itagADu ainADu awataaramuuriti - 

ainADu tAnE, mAnawa mAnasa daiwa swarUpamu ; ||  

&

శుభకృత్ సుమ గీత మాలిక ;- 18  ; song -  18 ; 

వయ్యారమొలికించు సయ్యాటల గాలి

 వయ్యారమొలికించు సయ్యాటల గాలి ;

సరితం చకోరం - మలయం సమీరమ్ము ; ||

;

జల వాయులీనములు జాగు సేయకను ;

చేరేను మృదు క్రిష్ణ సంగీత హవణి ;

అల్లనల్లన కదిలె ఆ పల్లవాంగుళి ;

చేరినది క్రిష్ణమ్మ చేతిలో లఘు మురళిని ;

ఆ చల్లని గాలి నెమ్మది నెమ్మదిగ ; ||

;

చేరినంతనే గాలి మైమరుపు శీతలం ;

ఆయెను మాయగా సుర సుధా సరళి ;

అందింది అందరికి వర మధుర స్వరళి ;

&

శుభకృత్ సుమ గీత మాలిక ;- 18  ; song -  18 ;

గరుడ, నంది వర్ధనాలు

పరిమళాల పూలమూట - వనితామణి - 

రాధ తేట నగవుల ఊట ; ||

గోవర్ధన గిరి పైన నందివర్ధనం - 

పూలు పూసె నిండుగాను - 

మన కన్నుల తారలొహో - మన మనసులు అంబరమే ; ; 

వర్ధనాలు, వర్ధనాలు - గరుడ, నంది వర్ధనాలు - ;

కృష్ణయ్యా, రావోయీ -  - ఇట - 

నీకోసమె - విరబూసెను గరుడవర్ధనాలు  ;

అట, నీకొరకు  వేచినది - బేల రాధిక ; 

వేయి కనులతో నీకై - వేచి చూస్తు ఉన్నాది ; || 

కొంగు నిండ నింపి ఉంచె -  

తన ఓణీ - కొంగు నిండ నింపి ఉంచె - నందివర్ధనాలు  ;

వర్ధనాలు, వర్ధనాలు - నందివర్ధనాలు ;

వర్ధనాలు, వర్ధనాలు - గరుడవర్ధనాలు ; || 

========================== ,

parimaLAla puulamUTa - wanitaamaNi - 

raadha tETa nagawula UTa ; ||

gOwardhana giri paina namdiwardhanam - 

puulu puuse nimDugaanu - 

mana kannula taaralohO - mana manasulu ambaramE ; ; 

wardhanaalu, wardhanaalu - garuDa, namdi wardhanaalu - ;

kRshNayyaa, raawOyI -  - iTa - 

neekOsame - wirabuusenu garuDawardhanaalu  ;

aTa, neekoraku  wEcinadi - bEla raadhika ; 

wEyi kanulatO neekai - wEci cuustu unnaadi ; || 

komgu nimDa nimpi umce -  

tana ONI - komgu nimDa nimpi umce - namdiwardhanaalu  ;

wardhanaalu, wardhanaalu - namdiwardhanaalu ;

wardhanaalu, wardhanaalu - garuDawardhanaalu ; ||

&  

వర్ధనాలు, వర్ధనాలు - గరుడ, నంది వర్ధనాలు ;;

శుభకృత్ సుమ గీత మాలిక ;- 17  ; song - 17 ;;

అదిగదిగో వేణురవళి

అదిగదిగో వేణురవళి - తోటలోని ప్రతి కొమ్మయు ;

పుష్పవనము *నామఫలకమాయెను ; ||

బృందావన క్రీడలు - మోదములకు మేడలు ;

మృదు భావాల ప్రణయాల ఆవరణము ఇది, గాన - ;

మురళిగాన వీచికల - గాలి ఆయె హర్షమాల ; -

సృజనలై పద పదము - గాధలాయెను ;

సృజనలై పద పదము - నాట్యాలు ఆయేను ; ||

గుప్పెడంత గుండెలు - కృష్ణ కథల వేదికలయె ;

పద ముగ్ధ పారాయణం - నిత్య పారాయణం ;

సాన్నిధ్య పారాయణం - సన్నిహిత పారాయణం ;

కృష్ణ కృష్ణా కృష్ణ - రాధ కృష్ణా కృష్ణ ;

============== ,

adigadigO wENurawaLi - tOTalOni prati kommayu ;

pushpawanamu naamaphalakamaayenu ; ||

bRmdaawana kreeDalu - mOdamulaku mEDalu ;

mRdu bhAwaala praNayaala aawaraNamu idi, gaana - ;

muraLigaana weecikala - gaali aaye harshamaala ; -

sRjanalai pada padamu - gaadhalaayenu ;

sRjanalai pada padamu - nATyaalu aayEnu ; ||

guppeDamta gumDelu - kRshNa kathala wEdikalaye ;

pada mugdha paaraayaNam - nitya paaraayaNam ;

saannidhya paaraayaNam - sannihita pArAyaNam ;

kRshNa kRshNaa kRshNa - raadha kRshNaa kRshNa ;

;

& **నామఫలకం = *name plate ;

శుభకృత్ సుమ గీత మాలిక ;- 16  ; song - 16  ;

లాలి పాట ఉఌౡ హాయి

జనని నిన్ను లాలించి - తనివితీర బుజ్జగిస్తు ; 

జో జో జోల - జోల పాడేనిదె క్రిష్ణ! 

లాలిపాట లాలనల ; 

వనరుగ ఒదిగి ఉండు అమ్మ తీపి ప్రేమ ; ||

జోలపాట లన్నిటిని - గుది గుచ్చిన తారలతో ; 

హలహలల కళకళల ; 

నింగి అంత మిలమిలల - హేలాపురి ఆయేను ; ||

ఉళ్ళుళ్ళ హాయి హాయి ; 

ఉఌౡ హాయి - లాలి పాటలందు చేరు ; 

కమ్మ కమ్మని శృతి లయల - తీపి తాయిలములు ; || 

;

బాలక్రిష్ణ కేరింతలు - జగమెల్ల అలుముకున్న ; 

వెన్న వెన్నెలమ్మలు - తడుముకోకుండ ; 

తడవ తడవకు ; 

విశ్వమ్ముకు మేళవింపు - నిండు పున్నమి ఆలాపనలు ; ||

==========================, , 

janani ninnu laalimci ; taniwiteera bujjagistu ; 

jO jO jOla - jOla paaDEnide krishNa! 

laalipATa laalanala ; 

wanaruga odigi umDu amma teepi prEma ; || 

;

jOlapATa lanniTini - gudi guccina taaralatO ; 

hala halala kaLakaLala ; 

nimgi amta milamilala - hElaapuri aayEnu ; || 

;

uLLuLLa haayi haayi - laali pATalamdu cEru ; 

kamma kammani SRti layala - teepi taayilamulu ; || 

;

baalakrishNa kErimtalu - jagamella alumukunna ; 

wenna wennelammalu - taDumukOkumDa ; 

taDawa taDawaku ; 

wiSwammuku mELawimpu - nimDu punnami Alaapanalu ; ||

&

ఉఌౡ హాయి - లాలి పాట ఉఌౡ హాయి - లాలి పాట ; 

శుభకృత్ సుమ గీత మాలిక ;- 15  ; song - 15 ;

విష్ణుచిత్తుల ఉద్యానం - ప్రబంధం

విష్ణుచిత్తుల ఉద్యానం ;

అణువు అణువునా ఆనందం ;

ఎటుల జరుగునిది, నిత్య వేడుక ;

భక్తి భావమా! ముందిది చెప్పు ; ||

;

ప్రణవం ప్రణయం, మధురం మధురం ;

గోదా గోవింద -

అనురాగ ప్రయాణమె - అనుశ్రుత ప్రబంధం ;

ఎటుల జరుగునిది, నిత్య వేడుక ;

భక్తి భావమా! ముందిది చెప్పు ; ||

;

రాధా బింబం - గోదా హాసం, దరహాసం ;

సుభగ సుగంధం, సుమధురం ;

క్రిష్ణ అనునయం, అభి వేదం ;

హసంతి రాధిక సుగంధ మల్లిక ;

మురళీరవళీ పరిమళ చంద్రిక ;

గోదాదేవికి పాశుర గీతిక ;

నిత్య నవీన వచన వేదిక ;

ఎటుల జరుగునిది నిత్య వేడుక ;

భక్తి భావమా! ముందిది చెప్పు ; ||

=======================,

wishNucittula udyaanam ;

aNuwu aNuwunaa aanamdam ;

eTula jarugunidi, nitya wEDuka ;

bhakti BAwamA! mumdidi ceppu ; ||

;

praNawam praNayam, madhuram madhuram ;

gOdaa gOwimda -

anuraaga prayAName - anuSruta prabamdham ;

eTula jarugunidi, nitya wEDuka ;

bhakti BAwamA! mumdidi ceppu ; ||

;

raadhaa bimbam - gOdaa haasam, darahaasam ;

subhaga sugamdham, sumadhuram ;

krishNa anunayam, abhi wEdam ;

hasamti raadhika - sugamdha mallika ;

muraLIrawaLii parimaLa camdrika ;

gOdaadEwiki paaSura geetika ;

nitya naweena wacana wEdika ;

eTula jarugunidi, nitya wEDuka ;

bhakti BAwamA! mumdidi ceppu ; || 

&

శుభకృత్ సుమ గీత మాలిక ;- 14 ; song - 14 ; 

అలలపై జాబిల్లి రాతకోతలు

రాతకోత చాలించు చందమామా -

విశ్రాంతి సుంత తీసుకో, చందమామా ; ||

;

యమున నీటి అలల పైన చందమామా,

చాందినీ - కావ్యాలు రాసినావు చందమామా ;

రాసి రాసి అలసినావు చందమామా ;

సుంత విశ్రాంతి తీసుకో, చందమామా ;

బడలిక తీరే లాగున - సుంత -

విశ్రాంతి తీసుకో, చందమామా ; ||

;

రాధ నేడు రాదంట, యనునా తటికి ;

క్రిష్ణునికి తెగ గుబులు, చందమామా ;

ప్రణయ జంట రాక లేక చందమామా ;

రేవు చిన్నబోయింది చందమామా ;

అందుకనే వ్రాతకోత చాలించు చందమామా -

విశ్రాంతిగ సేదదీరు, చందమామా ; ||

=================;

raadha nEDu raadanTa, yanunaa taTiki ;

krishNuniki tega gubulu, camdamAmA ;

;

yamuna nITi alala paina camdamAmA,

caamdinee - kaawyaalu raasinaawu camdamAmA ;

raasi raasi alasinaawu camdamAmA ;

sumta wiSraamti teesukO, camdamAmA ; ||

;

praNaya jamTa raaka lEka camdamAmA ;

rEwu cinnabOyimdi camdamAmA ;

amdukanE wraatakOta caalimcu camdamAmA ;

wiSraamti tiga sEdadeeru camdamAmA ; ||

శుభకృత్ సుమ గీత మాలిక ;- 14  ; song -  14 ; 

భూతలము - కృష్ణ మహలు

చందమామ తెలుపుచుండె కృతజ్ఞతలు ;

కృష్ణ మహలు* భూతలము - ఐన విపుల సృజన వీక్షించి -

చందమామ తెలుపుచుండె కృతజ్ఞతలు, జోహారులు ; ||

ముహూర్తవేళ ఆయెను - 

మహి ఇపుడు - నాట్య రంగమయే - శుభవేళ ఆయెను ;

క్రిష్ణ నాట్య రంగమయే - శుభవేళ ఆయెను ; ||

Qn ;- వెల ఎంత ప్రవేశముకు? 

Answer ;- శరత్ పూర్ణ వెన్నెలంత!

మెరయు చంద్ర వెన్నెల ; || 

అంతలోనె మయూరములు వచ్చి వాలి- పురి విప్పెను ;

బర్హిపింఛమ్ములందు - చాందినీల ఒడిసిపట్టె ;

లిప్తపాటులోననే - తామసమున - తమకమున -

తమ - బర్హిపింఛమ్ములందు - ఒడిసిపట్టె చాందినీలు ; ||  

అచ్చమైన చంద్రికలు - బహు బాగుగ విస్తరించె ;

ఆహా, నెరివెన్నెల - ఆహా తెలి వెన్నెల - 

సిరి వెన్నెల సోకులన్ని - పుచ్చుకుంది వసుంధర ;

పుణికిపుచ్చుకుంది వసుంధర ; ||

ధర వెన్నెల ఇనుమిక్కిలి ఇనుమడించ -

శశాంకుడు - కృతజ్ఞతలు - నమస్సులు -

జోహారులు, జోతలు - పౌర్ణిమగా విస్తరిస్తు -

విస్తారముగా తెలిపెడి - దృశ్యాలకు -

విస్తుబోవుచున్నారు అందరూ ;  ||

&

కృష్ణ మహలు* = మహల్ = building  ;

===================== ,

camdamaama telupucumDe kRtajnatalu ;

kRshNa mahalu* bhuutalamu - aina wipula sRjana wIkshimci -

camdamAma telupucumDe kRtajnatalu, jOhArulu;||

muhuurtawELa Ayenu - 

mahi ipuDu - nATya ramgamayE - SuBawELa Ayenu ;

krishNa nATya ramgamayE - SuBawELa Ayenu ; ||

`Qn` ;- wela emta prawESamuku? 

`Answer` ;- Sarat puurNa wennelamta!

merayu camdra wennela ; || 

amtalOne mayuuramulu wacci waali- puri wippenu ;

barhipimCammulamdu - caamdineela oDisipaTTe ;

liptapATulOnanE - taamasamuna - tamakamuna -

tama - barhipimCammulamdu - oDisipaTTe caamdineelu ; ||  

accamaina camdrikalu - bahu baaguga wistarimce ;

aahaa, neriwennela - AhA teli wennela - 

siri wennela sOkulanni - puccukumdi wasumdhara ;

puNikipuccukumdi wasumdhara ; ||

dhara wennela inumikkili inumaDimca -

SaSAmkuDu - kRtajnatalu - namassulu -

jOhArulu, jOtalu - paurNimagaa wistaristu -

wistaaramugaa telipeDi - dRSyaalaku -

wistubOwucunnaaru amdaruu ;  ||

&

kRshNa mahalu* = mahal = `building`

27, ఏప్రిల్ 2022, బుధవారం

సాహిరి సహోదరీ

సాహిరి, సాహిరి సహోదరీ ;

శరత్ పౌర్ణమీ, నిండు పున్నమీ ; ||

నీలి మబ్బు కుటీరాన ; 

రాధమ్మ దరహాసం - 

చలచల్లని తెలి వెన్నెల ; 

ఈ సరికొత్త కాంతి - 

నీ సోదరి - నిండు పున్నమీ, 

సాహిరి, సాహిరి సహోదరీ ; || 

చల్లింది చాందినీ,  ; || 

సిరి ప్రభలను, ద్యుతులను ; 

వెదజల్లింది రాధ నవ్వు ;

సాహిరి, సాహిరి పున్నమీ సహోదరీ  ; || 

=====================,

saahiri, saahiri sahOdaree ;

Sarat paurNamI, nimDu punnamI ; ||

neeli mabbu kuTIrAna ; 

raadhamma darahaasam - 

calacallani teli wennela ; 

ee sarikotta kaamti - 

nee sOdari - nimDu punnamee, 

saahiri, saahiri sahOdaree ; || 

callimdi caamdinee,  ​; || 

siri prabhalanu, dyutulanu ; 

wedajallimdi raadha nawwu ;

saahiri, saahiri  punnamee sahOdaree ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక ;- 12  ; song -  12 ;

పట వస్త్ర చిత్ర విలాసం - Odissa

 ప్రణయానికి 'పట్ట ' లేని ఆనందం ;

ప్రేమకింత 'పట్ట 'రాని వైభోగం ;

అలౌకిక ఆనందానికి పట్టం కట్టినది,

ఓహో, క్రిష్ణ గోపి నాట్య *విలాసం


వస్త్ర చిత్రకారులు ;

పట వస్త్ర చిత్రకారులు ; 

ఒరియా కళాసృష్టికారులు ;


పట చిత్రణ మహర్దశకు -

పట్టమహిషి - వర్ణ రాణి ;

పటములోన నగవులను -

చిందిస్తూ, క్రిష్ణయ్య -

ఒసగు దీవెనల సంపుటి ;

మనకు - ఒనగూడే సంప్రదాయ -

సంస్కార స్వర్ణ నిధి ; 

&

పట వస్త్ర చిత్ర విలాసం * =  address * ;;

================ ;

paTacitra wilAsam - Odissa  ;-

praNayaaniki 'paTTa ' lEni aanamdam ;

prEmakimta 'paTTa 'raani waiBOgam ;

alaukika aanamdaaniki paTTam kaTTinadi,

OhO, krishNa gOpi nATya *wilaasam ;

;

wastra citrakaarulu ;

paTa wastra citrakaarulu ; 

oriyaa kaLAsRshTikaarulu ;

paTa citraNa mahardaSaku -

paTTamahishi - warNa rANi ;

paTamulOna nagawulanu -

cimdistuu, krishNayya -

osagu deewenala sampuTi ;

manaku - onaguuDE sampradaaya -

sam skaara swarNa nidhi ;  

&

శుభకృత్ సుమ గీత మాలిక ;- 11  ; song -  11 ;

భవ్య మురళి రాధిక

శ్యామ కృష్ణ తరళ పద్మ కరములందు ; 

భవ్య మురళి రాధిక ; || 

చివురు వ్రేళుల కదలికలతో - 

రమ్య రవళి రాధిక ; ||

స్తబ్ధ ప్రకృతి - మేల్మి పసిడి-

చైతన్య రూపిణి రాధిక ; || 

విబుధ వరుల ; నికష ప్రజ్ఞల ; 

కావ్య రూపిణి రాధిక ; || 

కవుల కలము కజ్జలముల ; 

చిందు కవిత రాధిక ;  || 

గాన, నర్తనాది కళల -

మేలుబంతి రాధిక - ముగ్ధరాణి రాధిక ;

చంద్రజ్యోత్స్న - తిరుణాలల మేళా - మన  రాధిక ; ||

= ` 

Syaama kRshNa taraLa -

padma karamulamdu ; 

bhawya muraLi rAdhika ; || 

ciwuru wrELula kadalikalatO ; 

ramya rawaLi rAdhika ; ||

stabdha prakRti - mElmi pasiDi ; 

caitanya ruupiNi ; 

caitanya ruupiNi rAdhika ; || 

wibudha warula nikasha praj~nala ; 

kaawya ruupiNi rAdhika ; || 

kawula kalamu kajjalamula ; 

cimdu kawita rAdhika ;  || 

gaana, nartanaadi kaLala -

mElubamti rAdhika - 

mugdharaaNi rAdhika ;

camdrajyOtsna - tiruNaalala -

mELaa mana rAdhika ;  ||

;

శుభకృత్ సుమ గీత మాలిక ;- 10  ; song -  10 ;

26, ఏప్రిల్ 2022, మంగళవారం

చలాకీ మెరుపు

రాధ ఏది, ఎక్కడ!? - మేలిముసుగు మాటున,

ఆ మేలిమి ముసుగెక్కడనో!? - తెలిమల్లెల పొదలలోన,

మరి, మల్లెపొదలు ఎక్కడనో? - అందచందాల అల బృందావనిలోన,

బృందావని మునివాకిట, నిలుచున్నది ఎవ్వరనీ? - 

రాధికకై ఎదురుచూచు మురళీధర మాధవుడు ;

వేచిచూచు క్రిష్ణయ్యకు రాధ పొలుపు తెలియునా!?

నింగి నుండి తటాలున, భువికి వాలె మెరుపొక్కటి,

విద్యుల్లత తెలిపేను, రాధమ్మ ఆనవాలు ;

రాధ జాడ తెలిపి - మెరుపు ;

శ్రీకృష్ణుని లాస లహరి ఉత్తేజమ్ముల ;

స్వీకరించె బహుమతిగా ; 

====================, 

raadha Edi, ekkaDa!? - 

mElimusugu maaTuna,

aa mElimi musugekkaDanO!? - 

telimallela podalalOna,

mari, mallepodalu ekkaDanO? - 

amdacamdaala ala bRmdaawanilOna,

bRmdaawani muniwaakiTa, nilucunnadi ewwaranee? - 

raadhikakai edurucuucu muraLIdhara maadhawuDu ;

wEcicuucu krishNayyaku raadha polupu teliyunaa!?

nimgi numDi taTAluna, bhuwiki waale merupokkaTi,

widyullata telipEnu, raadhamma aanawaalu ;

raadha jADa telipi - merupu ;

SreekRshNuni laasa lahari uttEjammula ;

sweekarimce bahumatigaa ;

***************************************, 

శుభకృత్ సుమ గీత మాలిక ;- 8 ; song - 8 ;

శ్రీకృష్ణ సంగీత లహరికలు

శ్రీకృష్ణ సంగీత లహరికలు - శృతి శ్రవణ భాగ్యములు ; 

అనురాగ అంబర వీధిలోన - తారాడుచున్నవి కొంగ్రొత్త మెరుపులు ; 

వేణు గానమ్ములను, అధిరోహణము సేయుచున్నవి , 

ఆ నవ విద్యుత్తు లతలు ; ||  

రాతిరికి, వేకువకు - సాన్నిధ్య మబ్బినది ; 

విడలేని బంధమేదొ ఏర్పడెను చిత్రము ; 

రాతిరికి, వేకువకు - 

విడలేని బంధమేదొ ఏర్పడెను చిత్రము ; || 

నిశీధిలో వెలుగుల జిలుగుల పరివ్యాప్తి అయ్యేను ;

అయ్యారె, తిమిరముల రాతిరి -

కాంతుల పటమయ్యి, వెలిసింది ;

మేలిమి కాంతుల పటము అయ్యి, వెలిసింది ; ||

జత నీవె రాధికా - కొరత రానీయకు ; 

తక్షణమె మురళికి నీ మోవి నందించు మృదువుగా ;

క్రిష్ణయ్య గీతికి - అందించు మధువుగా ; || 

========================, ;

SrIkRshNa samgeeta laharikalu - 

SRti SrawaNa bhaagyamulu ; 

anuraaga ambara weedhilOna ; 

taarADucunnawi komgrotta merupulu ; 

wENu gaanammulanu, adhirOhaNamu sEyucunnawi , 

aa nawa widyuttu latalu ; ||  

raatiriki, wEkuwaku - saannidhya mabbinadi ; 

wiDalEni bamdhamEdo ErpaDenu citramu ; 

raatiriki, wEkuwaku - 

wiDalEni bamdhamEdo ; ErpaDenu citramu ; || 

niSIdhilO welugula jilugula pariwyaapti ayyEnu ;

ayyaare, timiramula raatiri -

kaamtula paTamayyi, welisimdi ;

mElimi kaamtula paTamu ayyi, welisimdi ; || 

jata neewe raadhikaa - korata raaneeyaku ; 

takshaName muraLiki nee mOwi namdimcu mRduwugaa ;

krishNayya geetiki - amdimcu madhuwugaa ; || 

& ;

శుభకృత్ సుమ గీత మాలిక ;- 8  - song - 8 ;

రాధిక మొలక నవ్వుల తావి

కన్నయ్య ఎడదలో - మెదిలేటి విరి తావి ; 

సఖియ రాధాదేవి, మొలక నవ్వుల మధువు ; || 

క్రిష్ణయ్య మది నెపుడు వీడని - 

మల్లియల జాల్వారు కమ్మని వాసనలు ; ||

మోహన మురళికి అందేను రాగాలు ; 

మనుగడను మలిచేటి, సొదలేవొ బులిపించు 

మురిపించు ఊహలు, వేరెవరివో కాదు, 

నళినాక్షి, క్రిష్ణసఖి రాధవే! ; || 

========================,  

kannayya eDadalO - medilETi wiri taawi ;

sakhiya raadhaadEwi, molaka nawwula madhuwu ; || 

krishNayya madi nepuDu weeDani - 

malliyala jaalwaaru kammani waasanalu ; ||

mOhana muraLiki amdEnu raagaalu ; 

manugaDanu malicETi, sodalEwo bulipimcu 

muripimcu uuhalu, wErewariwO kaadu, 

naLinaakshi, krishNasakhi raadhawE! ; || 

హరివిల్లుకు కొత్త రంగు దొరికినది

హరివిల్లుకు కొత్త రంగు దొరికింది ; 

అరుణాధరముల రాధ - దరహాసమే అది ; ||

మన్మధుని విల్లునకు - బహు తీపి అందినది ; 

గడలను వంచేసి - కన్నయ్య తీసేను చెరకు రసములను ; 

పుష్పబాణుని జనకుడు తాను, 

అలవోక ఆ విద్య, అందు సందేహమా!!? ; ||

రాధమ్మ దోసిటిని నిండుగా - ఇక్షురసములు తొణికె ; 

వంగి చూపించగా నింగి - భళి భళీ ; 

ఇంద్ర ధనువుప్పొంగె - తన, నవ వన్నియలను గని ; || 

======================== ,

hariwilluku kotta ramgu dorikimdi ; 

aruNAdharamula raadha - darahaasamE adi ; ||

manmadhuni willunaku - bahu teepi amdinadi ; 

gaDalanu wamcEsi - kannayya teesEnu ceraku rasamulanu ; 

pushpabANuni janakuDu taanu, 

alawOka aa widya, amdu samdEhamA!!? ; ||

raadhamma dOsiTini nimDugA - ikshurasamulu toNike ; 

wamgi cUpimcagA nimgi - bhaLi bhaLee ; 

imdradhanu wuppomge - tana, nawa wanniyalanu gani ;

23, ఏప్రిల్ 2022, శనివారం

లోగిలిలో ప్రకాశము

రామ రామ అంటేను - రామరాజ్యమే దక్కును ;

కృష్ణ క్రిష్ణ అంటేను ద్వారకా దర్శనము ; ||

మకిలి అంత తుడిచేసి - మంచి ముగ్గులేసెదము ;

మనసు తలుపు తెరిచినపుడు - లోగిలిలో ప్రకాశము ; ||

పసిడి కాంతి వ్యాప్తి చెంద - అపరంజి లేపనము ;

అంతర్ - లోచనము కేంద్రబిందు - భక్తిభావ దీపము ;

============================,

raama raama amTEnu - raamaraajyamE dakkunu ;

kRshNa krishNa amTEnu dwaarakaa darSanamu ; ||

makili amta tuDicEsi - mamci muggulEsedamu ;

manasu talupu tericinapuDu - lOgililO prakASamu ; ||

pasiDi kaamti wyaapti cemda - aparamji lEpanamu ;

amtar - lOcanamu kEmdrabimdu - bhaktibhaawa deepamu ; ||

 &

 శుభకృత్ సుమ గీత మాలిక - 5 ;

ప్రతి భంగిమ - హొయలు

తకధిమి తోమ్ - తోమ్ తోమ్ తోమ్ ;

అణువు అణువునా నిండెను ;

కన్నయ్య అడుగు అడుగులోన - 

లయ గీత నాట్య కళలేలే; || 

ప్రతి అడుగు నాట్యమే ;

శ్రీకృష్ణస్వామి - అడుగడుగున నాట్యమే ;

ప్రతి భంగిమ - హొయలులే ; 

కృష్ణస్వామి - ప్రతి భంగిమ - హొయలులే ; || 

శ్రీకాంతుని సన్నిధిలో ;

ప్రతి దృశ్యము - మనోహరము ;

సవరించును - సృష్టిలోని - కించిత్తు లోపములను ;

కన్నయ్య అడుగడుగున పద్మశ్రేణి ;

అందులకే, తానాయెను - శ్రీలక్ష్మీవల్లభుడు ; ||

===================== ,

takadhimi tOmm - tOmm tOmm tOmm ;

aNuwu aNuwunA nimDenu ;

kannayya aDugu aDugulOna - 

laya geeta nATya kaLalElE; || 

prati aDugu nATyamE ;

SreekRshNaswaami - aDugaDuguna nATyamE ;

prati bhamgima - hoyalulE ; 

kRshNaswaami - prati bhamgima - hoyalulE ; || 

Sreekaamtuni sannidhilO ;

prati dRSyamu - manOharamu ;

sawarimcunu - sRshTilOni - kimcittu lOpamulanu ;

kannayya aDugaDuguna padmaSrENi ;

amdulakE, taanaayenu - SreelakshmeewallaBuDu ; ||

&

 శుభకృత్ సుమ గీత మాలిక - 4 ;

మధురమైన అక్కర - కలిగె నేడు

మధురమైన అక్కర - కలిగె నేడు - ప్రియతమా ;

నెయ్యమున వెన్నదొంగ - బుంగమూతి చూడుమా ;

ఇంత చక్కనైన ఘటన - నయన పూర్ణచంద్రిక ;

మన - నయన పూర్ణచంద్రిక ; || 

చందమామ - దిగి వచ్చెను ; 

పెదవి పైని నవనీతం - కలశంలో చేరెను -

కన్నయ్య - పెదవి పైని నవనీతం -

కలశంలో చేరెను ; || 

పున్నమీ జాబిల్లికి - గడుసుదనము హెచ్చెను ;

క్రిష్ణాధరముల తీపియు -

నవనీతం మాధుర్యం - జుర్రుకొనుచు ఉండెను ;

నిండు జాబిల్లి ఇపుడు - పెదవి, వెన్న తీపిదనము -

జమిలిగా ...., జుర్రుకొనుచు ఉండెను ; || 

====================== ,

madhuramaina akkara - kalige nEDu - priyatamaa ;

neyyamuna wennadomga - bumgamuuti cUDumA ;

imta cakkanaina ghaTana - nayana puurNacamdrika ;

mana - nayana puurNacamdrika ; || 

camdamaama - digi waccenu ; 

pedawi paini nawaneetam - kalaSamlO cErenu -

kannayya - pedawi paini nawaneetam -

kalaSamlO cErenu ; || 

punnamee jaabilliki - gaDusudanamu heccenu ;

krishNAdharamula teepiyu -

nawaneetam maadhuryam - jurrukonucu umDenu ;

nimDu jaabilli ipuDu - pedawi, wenna teepidanamu -

jamiligaa ...., jurrukonucu umDenu ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక - 3 ;

చెలిమి చెలమ - తేట ఊట

చెలిమి చెలిమి చెలిమి ;

చెలిమి  చెలమ - తేట ఊట ;

క్రిష్ణ జ్ఞాన అంశములతో ; 

సుధారసము లుప్పొంగును ; || 

సదా చెలిమి చేస్తున్నవి - 

ఊసులన్ని ఊహలతో ; 

క్రిష్ణ గాన మధు శాలల ; 

సుధారసము లుప్పొంగును ; ||  

క్రిష్ణయ్యా! నాదు -

కంటి చూపు తోటి చెలిమి ;

నువు ఉన్న దృశ్యాలు ;

నీవిపుడు రాకుంటే -

కన్నీళ్ళతొ తన చెలిమి -

క్రిష్ణయ్యా, నాదు వీక్షణాలకు -

కన్నీళ్ళ తోటి కుదురు చెలిమి ; ||

నీ గాధల వినికిడులు ;

వీనులకు కలిమి చెలిమి ; || 

వేణురవళి - గాలి కూడి ;

నాదు - మేనెల్లా చేయు చెలిమి ;

మది, దేహములను చుట్టి -

నిలువెల్లా చేయు చెలిమి ; ||  

================= ,

celimi celimi celimi ;

celimi  celama - tETa UTa ;

krishNa jnaana amSamulatO ; 

sudhaarasamu luppomgunu ; || 

sadaa celimi cEstunnawi - 

uusulanni uuhalatO ; 

krishNa gaana madhu Saalala ; 

sudhaarasamu luppomgunu ; ||  

krishNayyA! naadu -

kamTi cuupu tOTi celimi ;

nuwu unna dRSyaalu ;

neewipuDu rAkumTE -

kannILLato tana celimi -

krishNayyaa, naadu weekshaNAlaku -

kannILLa tOTi kuduru celimi ; ||

nee gaadhala winikiDulu ;

weenulaku kalimi celimi ; || 

wENurawaLi - gaali kUDi ;

naadu - mEnellaa cEyu celimi ;

madi, dEhamulanu cuTTi -

niluwellaa cEyu celimi ; ||

&

 song = Lable - శుభకృత్ సుమ గీత మాలిక -  2 ;

ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, ఎట దాగెను, క్రిష్ణయ్య

చందనము - లేపనములు - ఎండిపోవుచున్నవి ;

హరి చందనము, లేపనాలు - 

పొరలు పొరలు ఔతున్నవి - విడిలి జారిపడుతున్నవి ;

ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, - ఎట దాగెనొ, క్రిష్ణయ్య!? ; ||


విరితావులు గాలిలోన - కలిసిపోతు ఉన్నవి ;

పువుల దండ రేకులన్ని - వడలి వత్తలౌతున్నవి ;

ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, ఎట  దాగెను, క్రిష్ణయ్య,!? ; ||


ఇటు, వక్క పలుకు తాంబూలం - వడలిపోవుచుండగా ; - 

ఇటుల, పోకచెక్క, తాంబూలము - వాడిపోవుచుండగా .... ; - 

ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, ఎట  దాగెను, క్రిష్ణయ్య,!? ; ||


యమునాతటి - కెరటాలు - కాళిందీ కల్లోలము - గోచరించుచున్నది ;

ఔరా, మన కన్నయ్య - ఫణి పడగల నెక్కాడు, నాట్య మాడుచున్నాడు ;

అందుకనే, ఈ జాప్యం - తెలిసె మాకు, గోవిందా! నిఖిల లోకరక్షకా!  

============================ ,

camdanamu - lEpanamulu - emDipOwucunnawi ;

hari camdana lEpanamulu - poralu poralu autunnawi ;

wiDili jaaripaDutunnawi -

 eTu dAgeno, krishNayya!? ; eTa dAgenu, krishNayya!? ; ||

ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, ఎట  దాగెను, క్రిష్ణయ్య,!? ; || 

wiritaawulu gaalilOna - kalisipOtu unnawi ;

puwula damDa rEkulanni - waDali wattalautunnawi ;

 eTu dAgeno, krishNayya!? ; eTa dAgenu, krishNayya!? ; ||

iTu, wakka paluku taambuulam - waDalipOwucumDagA ; - 

iTula, pOkacekka, taambuulamu - waaDipOwucumDagA .... ; - 

 eTu dAgeno, krishNayya!? ; eTa dAgenu, krishNayya!? ; ||

yamunaataTi - keraTAlu - kaaLimdee kallOlamu -

gOcarimcucunnadi - auraa, mana kannayya -

phaNi paDagala nekkADu - nATya mADucunnADu ;

amdukanE, ee jaapyam - 

telisenu maaku gOwimdaa! - nikhila lOkarakshakA!

;

శుభకృత్ సుమ గీత మాలిక - 1 ;

3, ఏప్రిల్ 2022, ఆదివారం

Many HINDI Actors in Kishire Kumar SONG -

Guni jano re bhakt jano 2
Hari nam se nata re jodo ;; Bhayi maya se munh modo re ;;
Jagat narayan ki jay jay bolo bolo ;; Nagad narayan ko ; Chhodo re jagat narayan ki ;;
2. Are rajdhan are gajdhan
Gajdhan rajdhan 2 ;; Rajdhan gajdhan 2 ; 
Lal ratan dhan khan re 2 ; Aayo re jab santoshdhan
Baba sab dhan dhul saman re ; Bolo re sab dhan dhul saman re ;
Dhan to hai dhan to hai diwar ; Ret ki dhan se priti ; Todo re jagat narayan ki ;;
3. Jai govindam jai gopalam 2 ; Duniya karati rup ki ;
Bhakti kaisi mayarup re ; Are ham to usake ; Bhakt hain bhakto ;
Jisane banaya rup re ; Sundar nari pritam pyari 2 ;
Chhavi dikhalaye ; Jay govindam jay gopalam ;;
Sundar nari pritam pyari 2 ; Chhavi dikhalaye ; Jay govindam jay gopalam ;;
Suno suno chal ; Chitram ki katha sunaye ;
Katha sunaye bhakt kishoram ; Katha sunaye bhakt ; Kishoram jay govindam ;;
4. Brhmande he koti sitaram
Prithvi par bhi anek sitaram
Are aashirvadam ashokakumaram
Prithviputram rajakapuram
Shammikapuram shashikapuram
Ramam shyamam dilipakumaram
Purabapashchim manojakumaram
Are premapujari devanandam
Rupapujari aayi es jauharam
Are nilamakamalam rajakumaram
Yade yadam suniladattam
Are ittefaqam rajeshakhannam
Jay jani rajendranatham
Uchhalamakudam jay mahamudam
5. Are prithvi kare hain tin indrr 2 ;; Are jay jitendra jay ; Dharmendra jay jay ;
Jay ho jay rajendra jay govindam ; Jagat narayan ko ;
Chhod ke santo nagad ; Narayan ke hain sab yaram ; Nagad narayan ke ;
& REF ;- In sabake pichhe are ; Pad gaya inkam taiksam ; 
Are bam bam nache ; Kishora kumaram bam bam nache ;; 
& Film ;- Ansuu aur muskaan = 1970 ;
Guni jano bhakt jano -- Film - Ansoo aur muskan- Singer -Kishor kumar ;