27, జూన్ 2022, సోమవారం

మేధావులకు బోధపడేనా!? - 80

మేధావులకు బోధపడేనా!?

మన మేధస్సులకు బోధపడేనా!? ; || 

చిన్ని పిల్లంగ్రోవిని పట్టే ; 

లేత వ్రేళ్ళు ఇవి కదుటే - 

అంత కొండను ఇట్టె నిలిపెను - 

చిట్టి చిటికెన వేలున, 

ఎటుల? ఎటుల? ఇటుల - 

ఇది ఏమి మాయయో ఏమో గానీ, 

మన మేధస్సులకు బోధపడేటి - 

సంగతి కాదే ఓ లమ్మీ! ; ||

ఆలమందల నడుమ నిరతము ; 

కృషి, శ్రమ చేసే చిన్ని బాలుడు వీడేనా ; 

వానల వెల్లువ, వరదల ముంపుల నుండి ;

ఎల్లరినీ కాచే శక్తి వీనికెక్కడిది!? || 

ఈ నిముషము దాకా - 

గోవుల కాచే గోపాల బాలకుడు - 

నిఖిల లోకముల కాచే విశ్వరూపుడు - ఇదె,

మన మధ్యనె ఉండుట - విస్మయపరిచే గాధలులే ;

విస్తరించిన గాధలులే ; 

మహనీయ మహత్తర గాధలులే  ; || 

=========== ;

mEdhAwulaku bOdhapaDEnA!?

mana mEdhassulaku bOdhapaDEnA!? ; || 

cinni pillamgrOwini paTTE ; 

lEta wrELLu iwi kaduTE - 

amta komDanu iTTe nilipenu - 

ciTTi ciTikena wEluna, 

eTula? eTula? iTula - 

idi Emi maayayO EmO gAnI, 

mana mEdhassulaku bOdhapaDETi - 

samgati kaadE O lammee! ; ||

aalamamdala naDuma niratamu ; 

kRshi, Srama cEsE cinni baaluDu weeDEnaa ; 

waanala welluwa, waradala mumpula numDi ;

ellarinii kaacE Sakti weenikekkaDidi!? || 

ee nimushamu daakaa - 

gOwula kaacE gOpAla baalakuDu - 

nikhila lOkamula kAcE wiSwaruupuDu - ide,

mana madhyane umDuTa - wismayaparicE gAdhalulE ;

wistarimcina gaadhalulE ; 

mahaniiya mahattara gaadhalulE  ; || 

&  శుభకృత్ సుమ గీత మాలిక - 80 ; రచయి3 = కుసుమ ; 



song - 80 - mEdhAwulu ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి