11, జూన్ 2022, శనివారం

యమునాతీరే, భళి హైలెస్సా

లెస్స లెస్సగా హైలెస్సా ;

భళిరే, బాలురు , హైలెస్సా ; ||

యమున ఒడ్డుకు చేరారు ; 

వ్రేపల్లియలోని ప్రజలంతా ; 

పల్లె పల్లెల బృందారకులు ; 

బృందగానములు అనిన ముచ్చట ; 

ముచ్చటగా బహు ముచ్చట లాడుచు ; 

బృంద గానముల శిక్షణ పొందిరి ; 

మేలుతరమ్మౌ బృందగీతికా క్రీడలు ; 

సృజనల వృష్టిలు సౌజన్యముగా ; 

అటనిట ఇటనట - నట గోవిందుని విలాసములే ;

నయన మనోహర గోచరమ్ములు ; || 

వకుళ మాలికలు అల్లారు ;

ప్రజలు, వకుళ మాలికలు అల్లారు ; ; 

ఒడలు నిండుగా ధరియించేరు ; 

తులసీ  ఆకుల పరిమళ దండలను ;

తులసీ పూసల చేరులను ;

ఒడలు నిండుగా ధరియించేరు ; ||

యమునాతీరే విలసిత కళలే ;

రంగు రంగుల హరివిల్లే,

ఇది, రంగు రంగుల హరివిల్లే ;

శ్రీకృష్ణుని నాట్య విలాసాలు -

ఉండగ అంతటహైలెస్సా!  - 

భళిరే భళిరే హైలెస్సా! 

================= ,

lessa lessagaa hailessA ; 

bhaLirE, baaluru, hailessA ; ||

yamuna oDDuku cErAru ; 

wrEpalliyalOni prajalamtaa ; 

palle pallela bRmdaarakulu ; 

bRmdagaanamulu anina muccaTa ; 

muccaTagaa bahu muccaTa lADucu ; 

bRmda gaanamula SikshaNa pomdiri ; 

mElutarammau bRmdageetikaa krIDalu ; 

sRjanala wRshTilu saujanyamugaa ; 

aTaniTa iTanaTa - naTa gOwimduni wilaasamulE ;

nayana manOhara gOcarammulu ; || 

wakuLa mAlikalu allaaru ;

prajalu, wakuLa mAlikalu allaaru ; ; 

oDalu nimDugaa dhariyimcEru ; 

tulasee  aakula parimaLa damDalanu ;

tulasee puusala cErulanu ;

oDalu nimDugaa dhariyimcEru ; ||

yamunaateerE wilasita kaLalE ;

ramgu ramgula hariwillE,

idi, ramgu ramgula hariwillE ;

SreekRshNuni naaTya wilaasaalu ;

umDaga amtaTa - BaLirE hailessA!

&

శుభకృత్ సుమ గీత మాలిక -  68 ;; రచయి3 = కుసుమ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి