వేణుధరుని విలాసములు - తేజరిల్లు సద్భావం వర్ణ కళలు ;
సంవృతార్ణవ చైతన్య సంపదలు - జగములందు జయప్రదం ; || & -
నెలవంక పంపున - వచ్చింది వెన్నెల - చేరువనే యమునా ఝరి ;
అబ్బలాలొ, హుషారుగా, - ఎగసేను కెరటాలు ; ||నెలవంక పంపున||
నవమోహన కృష్ణుడు అల్లదిగో వచ్చేను -
తన, ముంగురుల తూగాడుతు, చల్లగాలి, ఎగిరి దూకు ;
పిల్లగాలి అల్లరి ఆపతరము కానిది - పున్నాగల కాడలందు చటుక్కున దూరినది ;
సన్నాయిగ మారుతూ ... , పువు కాడలందు,
మురళీ స్వరమాలలను అల్లసాగె పిల్లగాలి ;
||నెలవంక పంపున||
పిల్లగాలి సైతము సంగీతం పీఠమౌతున్నది, చూడండి ;
త్రిభువనమ్ముల రాగలతలు - పుష్పించసాగె బాణీలు ,
నవ సంగీతం బాణీలను ; ||
వేణుధరుని విలాసములు - తేజరిల్లు సద్భావం వర్ణ కళలు ;
సంవృతార్ణవ చైతన్య సంపదలు - జగములందు జయప్రదం ; ||
=================== ,
punnAgala kADalu - sannAyi mELamu - 72 ;-
wENudharuni wilAsamulu - tEjarillu sadbhAwam warNa kaLalu ;
samwRtArNawa caitanya sampadalu - jagamulamdu jayapradam ; || & -
nelawamka pampuna - waccimdi wennela - cEruwanE yamunaa jhari ;
abbalaalo, hushaarugaa, - egasEnu keraTAlu ; ||nelawamka pampuna||
nawamOhana kRshNuDu alladigO waccEnu -
tana, mumgurula tUgADutu, callagAli, egiri dUku ;
pillagAli allari aapataramu kaanidi -
punnAgala kADalamdu caTukkuna dUrinadi ;
sannAyiga mArutU ... , puwu kADalamdu,
muraLee swaramAlalanu allasAge - pillagAli ; ||nelawamka pampuna||
pillagAli saitamu samgeetam peeThamautunnadi, cUDamDi ;
tribhuwanammula rAgalatalu - pushpimcasAge bANIlu ,
nawa samgeetam bANIlanu ; ||
wENudharuni wilaasamulu - tEjarillu sadbhAwam warNa kaLalu ;
samwRtArNawa caitanya sampadalu - jagamulamdu jayapradam ; ||
&
శుభకృత్ సుమ గీత మాలిక - 72 ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి