19, జూన్ 2022, ఆదివారం

రాధ మృదుభాషణము - 71

సుధా మధురము, మృదుభాషణము ;

రాధ మృదుభాషణము ; ||

శీతల సౌరభ పారిజాతము, 

తరళ సుమదళం, లావణ్యం ;

రాధ మృదుభాషణము ;

సుధా మధురము ; ||

పన్నీరాయెను, ప్రతి అణువు ;

ప్రకృతిలోని ప్రతి అణువు ;

కమ్మని తావుల పన్నీరాయెను ; 

మువ్వల సవ్వడి కప్పుర ఘుమఘుమ ;

ఉల్లసిల్లును రాధిక డెందము ;

నీ రాధిక డెందము ;

భావుక జనకా, శ్రీక్రిష్ణా, 

నీ నాట్య, గీతికలు 

నవమి పున్నమి వెన్నెల నెలవులయా! ; ||

======================== ;

sudhaa madhuramu, mRdubhaashaNamu ;

raadha mRdubhaashaNamu ; ||

SItala saurabha paarijaatamu, 

taraLa sumadaLam, laawaNyam ;

rAdha mRdubhaashaNamu ;

sudhaa madhuramu ; ||

panneeraayenu, prati aNuwu ;

prakRtilOni prati aNuwu ;

kammani taawula panneeraayenu ; 

muwwala sawwaDi kappura ghumaghuma ;

ullasillunu raadhika Demdamu ;

nee raadhika Demdamu ;

bhaawuka janakA, SrIkrishNaa, 

nee naaTya, geetikalu 

nawami punnami wennela nelawulayA! ; || 

;

శుభకృత్ సుమ గీత మాలిక - 71 ; రచయి3 = కుసుమ ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి