11, జూన్ 2022, శనివారం

మురళీ మృదు సంగీతం, జగతి పావనం - 70

వెన్న లాంటి మనసు కదా, కన్నయ్యది ; 

సకల జనుల హృదయ పద్మ పీఠమ్ముల ; 

అధివసించ గలిగినాడు, అందుకనే ; || 

ఇందువదనుడు కృష్ణుడు - ఎందు దాగెను ... , 

అనుచు, సైకత తీరమ్ముల వెంట -

అందందున, అంతటా, అన్వేషణ సాగుతోంది ;

అనుపల్లవి ;- 

ఆహా, ఈ హడావుడిలు - ఆహాహా, మోహనం ;

లతల పూల తేనియల మధుర మోహనం ;

మురళీ మృదు సంగీతం, జగతి పావనం ; ||

కనులముందు జార్చినది, హేమంత యువతి హిమ యవనిక; 

తమ కనులముందు జార్చినది, హేమంత యువతి హిమ యవనిక

డిల్లా పడి గోపికలు, డీలా పడె రాధిక ; ||

నీలమోహనాంగుడు ఎక్కడ!? - ఎక్కడ, ఎక్కడ, ఎక్కడెక్కడ!?

ఏ పొదరింటిలోన నక్కినాడొ!? ; గోపీ జనమందరికీ ; 

అవధి లేని తొందరలు, ఆపలేని గవేషణలు ; || 

ఇందు అందు, అందు ఇందు - ముందు వెనుక వెనుక ముందు - 

ఎందెందున దాగినాడొ, నవనీత చోరుడు, 

ఇందరితో పరుగులు, పెట్టించే తుంటరి ; || 

వెన్నదొంగ వెనువెంటనె మోగించెను వేణువును ; 

జన వాహిని వెన్ను తట్టి రాగజగతి మహిమ చూపె ; 

ఆహా, ఈ హడావుడిలు - ఆహాహా, మోహనం ;

లతల పూల తేనియల మధుర మోహనం ;

మురళీ మృదు సంగీతం, జగతి పావనం ; || 

================== ,

wenna lAmTi manasu kadaa, kannayyadi ; 

sakala janula hRdaya padma peeThammula ; 

adhiwasimca galiginADu, amdukanE ; || 

imduwadanuDu kRshNuDu - emdu daagenu ... , 

anucu, saikata teerammula wemTa -

amdamduna, amtaTA, anwEshaNa saagutOmdi ;

anupallawi ;- 

AhA, ee haDAwuDilu - aahaahaa, mOhanam ;

latala puula tEniyala madhura mOhanam ;

muraLI mRdu samgeetam, jagati paawanam ; ||

kanulamumdu jaarcinadi, hEmamta yuwati hima yawanika ; 

tama kanulamumdu jaarcinadi, hEmamta yuwati hima yawanika ; 

DillA paDi gOpikalu, DeelA paDe rAdhika ; ||

nIlamOhanAmguDu ekkaDa!? - 

ekkaDa, ekkaDa, ekkaDekkaDa!? 

E podarimTilOna nakkinADo!? ; gOpI janamamdarikI ; 

awadhi lEni tomdaralu, aapalEni gawEshaNalu ; || 

imdu amdu, amdu imdu - mumdu wenuka wenuka mumdu - 

emdemduna daaginADo, nawaneeta cOruDu, 

imdaritO parugulu, peTTimcE tumTari ; || 

wennadomga wenuwemTane mOgimcenu wENuwunu ; 

jana wAhini wennu taTTi raagajagati mahima cuupe ;

AhA, ee haDAwuDilu - aahaahaa, mOhanam ;

latala puula tEniyala madhura mOhanam ;

muraLI mRdu samgeetam, jagati paawanam ; || 

&

శుభకృత్ సుమ గీత మాలిక - 70 ; రచయి3 = కుసుమ ;   & మురళీ మృదు సంగీతం, జగతి పావనం ;-  

seventy 70 - డెభ్బై 70 = seventy 70 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి