11, జూన్ 2022, శనివారం

ఏలేలో - హైలెస్సా

 ఆతృతలేలనె, ఓ గోపీ,

బృందగీతికల నాలపించగా ; ||

పింఛము మెరుపులు కురిపిస్తూ,

జతగా చేరెను మయూరమ్ములు ; 

పూల అమ్ముల లయల హొయలుల, 

తాళములాయెను నెమలి ఆటలు -

ఆ చక్కని సుందర - ఆట పాటలు ;||

కాళిందీ నది చిరు చిరు తరగలు -

కవితల మాధురి - జావళి చిందులు ;

కలిపెను బృందావనమున* -

ప్రతి పొదరింట - చిత్ర సౌరభిళ -

తరళ సుమమ్ముల - విరళ దళమ్ములు ;

ఈ విలసిత  భాగ్యములెన్నో, 

ఇంతటి సౌభాగ్యమ్ములు ఎన్నెన్నో ; || 

వలయ వలయముల పునరావృతమౌ - 

భజన సందడుల - భక్తి ఉరవడులు ; 

రాధా కృష్ణ ద్వయము ఆటలు ; 

అందరి అడుగులు కలిసినవి ; 

ఆవృత పదములు ఏలేలో ; 

పునరావృతమ్ముగా, హైలెస్సా ; || 

బృంద* = తులసి ] ;

========================= ;

ElElO - hailessA ; = `song 69 ;-` 

aatRtalElane, O gOpI,

bRmdageetikala naalapimcagaa ; ||

pimCamu merupulu kuripistuu,

jatagaa cErenu mayuurammulu ; 

puula ammula layala hoyalula, 

tALamulaayenu nemali ATalu -

aa cakkani sumdara - ATa pATalu ;||

kALimdii nadi ciru ciru taragalu -

kawitala maadhuri - jaawaLi cimdulu ;

kalipenu bRmdaawanamuna*-

prati podarimTa - citra sauraBiLa -

taraLa sumammula - wiraLa daLammulu ;

ee wilasita  bhaagyamulennO, 

imtaTi saubhaagyammulu ennennO ; || 

walaya walayamula punaraawRtamau - 

bhajana samdaDula - bhakti urawaDulu ; 

raadhaa kRshNa dwayamu ATalu ; 

amdari aDugulu kalisinawi ; 

aawRta padamulu ElElO ; 

punaraawRtammugaa, hailessA ; ||

&

[bRmda* = tulasi ] ;

శుభకృత్ సుమ గీత మాలిక -  69 ;; రచయి3 = కుసుమ ; ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి