20, జూన్ 2022, సోమవారం

వెన్న ముంత - ఉట్టి జాడ - 74

కొండీలు చెబుతాడు - క్రిష్ణయ్య - "ఏమెరుగని అమాయకుడు -

ఇంత చిన్నపిల్లాడని" - యశోదమ్మ నమ్మదే ; ||

ఇల్లిల్లు గాలించి, చప్పున కనిపెడతాడు ;

వెన్న ముంత, ఉట్టి జాడ - తన, పని అంటే ఒక్కటే ;

నవనీత చోరత్వం ; భామలను, బామ్మలను -

అందరినీ మాయ చేయు - కిటుకేదో తెలిసినోడు ;

క్రిష్ణయ్య - ఔరా - తన ఫణితి జోరు ; ||

పిసాళి, తేటి తేనియల - నవ్వులన్ని గ్రుమ్మరించి,

అదే ఇంట నందనమును - వెలయించే చిలిపి, వీడు,

తొండీలు, కొండేలు - పితూరీలు యావత్తూ - 

అందరినీ అలరించే - "హరి"విల్లుల బింబములే ; || 

==================== ,

wenna mumta uTTi jADa - 74 ;-

komDiilu cebutaaDu - krishNayya - "Emerugani amAyakuDu -

imta cinnapillADani" - yaSOdamma nammadE ; ||

illillu gaalimci, cappuna kanipeDatADu ;

wenna mumta, uTTi jADa - tana, pani amTE okkaTE ;

nawaneeta cOratwam ; BAmalanu, bAmmalanu -

amdarinee maaya cEyu - kiTukEdO telisinODu ;

krishNayya - auraa - tana phaNiti jOru ; ||

pisALi, tETi tEniyala - nawwulanni grummarimci,

adE imTa namdanamunu - welayimcE cilipi, weeDu,

tomDIlu, komDElu - pituureelu yAwattuu - 

amdarinee alarimcE - "hari"willula bimbamulE ; ||

;

వెన్న ముంత ఉట్టి జాడ - 74 ;- శుభకృత్ సుమ గీత మాలిక - 74 ; రచయి3 = కుసుమ ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి