21, జూన్ 2022, మంగళవారం

యమునాతటి - తటిల్లత - 76

యమునాతటిని నిలిచినది - ఒక తటిల్లత, ముగ్ధ రాధిక ; || 

వేచి చూచును, కృష్ణుని రాకకయి - తన, ఎదురుచూపులు ; 

నది కెరటాల పయి - పరిచెను తెల్లని వెన్నెలలు ; || 

చిరుగాలులార, మా సుదతికివ్వరా, 

సంగీత మధురిమల సొగసుల లయలు ; 

క్రిష్ణుని మురళిని చొరవగ దూరే ; 

నేర్పరితనములు మీవే కదా ; || 

వేణుగానామృత లహరిక - రాధిక కోసము ప్రసాదము ; 

చిరుగాలులార -  

నీలమోహనుని గానమాధురిని  - తనకివ్వండి ఆసాంతం ;

సత్వరమే - తనకివ్వండి ఆసాంతం ; ||

======================== ;

yamunaataTini nilicinadi - oka taTillata ; mugdha rAdhika ; || 

wEci cuucunu, kRshNuni rAkakayi - tana, edurucuupulu ; 

nadi keraTAla payi - paricenu tellani wennelalu ; || 

cirugaalulaara, maa sudatikiwwaraa, 

samgeeta madhurimala sogasula layalu ; 

krishNuni muraLini corawaga duurE ; 

nErparitanamulu miiwE kadaa ; || 

wENugaanaamRta laharika ; 

rAdhika kOsamu prasaadamu ; 

cirugaalulaara -  

neelamOhanuni gaanamaadhurini ; 

tanakiwwamDi AsAmtam ;

satwaramE - tanakiwwamDi AsAmtam ; ||

;

song - 76 ;- శుభకృత్ సుమ గీత మాలిక ; రచయి3 = కుసుమ ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి