27, జూన్ 2022, సోమవారం

మేధావులకు బోధపడేనా!? - 80

మేధావులకు బోధపడేనా!?

మన మేధస్సులకు బోధపడేనా!? ; || 

చిన్ని పిల్లంగ్రోవిని పట్టే ; 

లేత వ్రేళ్ళు ఇవి కదుటే - 

అంత కొండను ఇట్టె నిలిపెను - 

చిట్టి చిటికెన వేలున, 

ఎటుల? ఎటుల? ఇటుల - 

ఇది ఏమి మాయయో ఏమో గానీ, 

మన మేధస్సులకు బోధపడేటి - 

సంగతి కాదే ఓ లమ్మీ! ; ||

ఆలమందల నడుమ నిరతము ; 

కృషి, శ్రమ చేసే చిన్ని బాలుడు వీడేనా ; 

వానల వెల్లువ, వరదల ముంపుల నుండి ;

ఎల్లరినీ కాచే శక్తి వీనికెక్కడిది!? || 

ఈ నిముషము దాకా - 

గోవుల కాచే గోపాల బాలకుడు - 

నిఖిల లోకముల కాచే విశ్వరూపుడు - ఇదె,

మన మధ్యనె ఉండుట - విస్మయపరిచే గాధలులే ;

విస్తరించిన గాధలులే ; 

మహనీయ మహత్తర గాధలులే  ; || 

=========== ;

mEdhAwulaku bOdhapaDEnA!?

mana mEdhassulaku bOdhapaDEnA!? ; || 

cinni pillamgrOwini paTTE ; 

lEta wrELLu iwi kaduTE - 

amta komDanu iTTe nilipenu - 

ciTTi ciTikena wEluna, 

eTula? eTula? iTula - 

idi Emi maayayO EmO gAnI, 

mana mEdhassulaku bOdhapaDETi - 

samgati kaadE O lammee! ; ||

aalamamdala naDuma niratamu ; 

kRshi, Srama cEsE cinni baaluDu weeDEnaa ; 

waanala welluwa, waradala mumpula numDi ;

ellarinii kaacE Sakti weenikekkaDidi!? || 

ee nimushamu daakaa - 

gOwula kaacE gOpAla baalakuDu - 

nikhila lOkamula kAcE wiSwaruupuDu - ide,

mana madhyane umDuTa - wismayaparicE gAdhalulE ;

wistarimcina gaadhalulE ; 

mahaniiya mahattara gaadhalulE  ; || 

&  శుభకృత్ సుమ గీత మాలిక - 80 ; రచయి3 = కుసుమ ; 



song - 80 - mEdhAwulu ;

22, జూన్ 2022, బుధవారం

భళిరే హైలెస్సా ..... - 79

లెస్స లెస్సగా హైలెస్సా ; 

భళిరె, బాలురే, హైలెస్సా ; ||

యమున ఒడ్డుకు చేరారు ; 

వ్రేపల్లియలోని ప్రజలంతా ; 

పల్లె పల్లెల బృందారకులు ; 

బృందగానములు అనిన ముచ్చట ; 

ముచ్చటగా బహు ముచ్చట లాడుచు ; 

బృంద గానముల శిక్షణ పొందిరి ; 

మేలుతరమ్మౌ బృందగీతికా క్రీడలు ; 

సృజనల వృష్టిలు సౌజన్యముగా ; 

అటనిట ఇటనట - 

నట గోవిందుని విలాసమ్ములే ;

నయన మనోహర గోచరమ్ములు ; ||

వకుళ మాలికలు అల్లారు ;

ప్రజలు, వకుళ మాలికలు అల్లారు ; ; 

ఒడలు నిండుగా ధరియించేరు ; 

తులసీ  ఆకుల పరిమళ దండలను ;

తులసీ పూసల చేరులను ;

ఒడలు నిండుగా ధరియించేరు ; ||

యమునాతీరే విలసిత కళలే ;

రంగు రంగుల హరివిల్లే,

ఇది, రంగు రంగుల హరివిల్లే ;

శ్రీకృష్ణుని నాట్య విలాసాలు ;

ఉండగ అంతట - భళిరే హైలెస్సా! 

================= ,

lessa lessagaa hailessA ; 

bhaLire, baalurE, hailessA ; ||

yamuna oDDuku cErAru ; 

wrEpalliyalOni prajalamtaa ; 

palle pallela bRmdaarakulu ; 

bRmdagaanamulu anina muccaTa ; 

muccaTagaa bahu muccaTa lADucu ; 

bRmda gaanamula SikshaNa pomdiri ; 

mElutarammau bRmdageetikaa krIDalu ; 

sRjanalu saujanyamugaa ;

aTaniTa iTanaTa - 

naTa gOwimduni wilaasammulE ;

nayana manOhara gOcarammulu ; || 

wakuLa mAlikalu allaaru ;

prajalu, wakuLa mAlikalu allaaru ; ; 

oDalu nimDugaa dhariyimcEru ; 

tulasee  aakula parimaLa damDalanu ;

tulasee puusala cErulanu ;

oDalu nimDugaa dhariyimcEru ; ||

yamunaateerE wilasita kaLalE ;

ramgu ramgula hariwillE,

idi, ramgu ramgula hariwillE ;

SreekRshNuni naaTya wilaasaalu ;

umDaga amtaTa - BaLirE hailessA! ;

& song - 79 ; శుభకృత్ సుమ గీత మాలిక ; రచయి3 = కుసుమ ;

%%%%%%%%%%%%%%%%%%%%% ;

May 2022 = print song = ఏలేలో - హైలెస్సా ; - శుభకృత్ సుమ గీత మాలిక -  69 ;; రచయి3 = కుసుమ ; - ఆతృతలేలనె, ఓ గోపీ, ; బృందగీతికల నాలపించగా ; ||

భళిరే హైలెస్సా- 79 & లెస్స లెస్సగా హలెస్సా = 68 


అంజనం వేద్దాము - 78

రవ్వ చేయుట తమ నైజం ; 

మువ్వలు ఎటుల మరచినవి!? ; 

కవ్వము ఆడుట మరచేనా!? 

పెరుగు, మజ్జిగలు కదలుట లేదు ;

దవ్వుల ఆకుల అలికిడి ఏదీ!? 

నివ్వరి పైరుల చలనములేవీ!? 

యమునలొ, నీటిని గలగలలేవీ!? 

రాధ ఇక్కడ వేచిఉన్నది, 

మురళీ కృష్ణుని జాడలు ఏవీ!? 

అంజనమేసి చూడండీ, 

ప్రాంజలి ఘటించి, ప్రార్ధిస్తుంటిని, 

చెలులారా! *అంజనమ్మును వేయండి ; 

=========================== ,

amjanam wEddaamu - 78 ;-

rawwa cEyuTa tama naijam ; 

muwwalu eTula maracinawi!? ; 

kawwamu ADuTa maracEnA!? 

perugu, majjigalu kadaluTa lEdu ;

dawwula aakula alikiDi EdI!? 

niwwari pairula calanamulEwI!? 

yamunalo, nITini galagalalEwI!? 

raadha ikkaDa wEciunnadi, 

muraLI kRshNuni jaaDalu EwI!? 

amjanamEsi cUDamDI, 

praamjali GaTimci, praardhistumTini, 

celulaaraa! *amjanammunu wEyamDi ;

; - song - 78 ; శుభకృత్ సుమ గీత మాలిక ; రచయి3 = కుసుమ ;

అలకల కిట్టప్ప - 77

జిల్లాయీలు అంటూ ఇట్లా - బుల్లీ బుచ్చీ యావత్తూ ; 

మకురు పట్టు పట్టేను, మంకుపట్టు పట్టేను ; 

చిట్టి గొడవలకు మారుపేరు కద, 

బాలకిట్టుడు, మన బాలకిట్టుడు ; ||

వెన్నముద్దలకు కొసరులు చాలా - అడుగుతు ఉంటాడు ; 

అగ్నిమాంద్యము అజీర్తి చేయును - అంటూ యశోద చెప్పబోతె, 

మరి అలుగుతుంటడే ; || 

గోముగ చేసే గొడవ హడావిడి ; 

ముద్దుముద్దుగా ఉంటాయి, 

అమ్మ చేతితో గోరుముద్దలు ; 

నవనీతచోరునికి ఇష్టములే ; 

అందులకే ఈ చిలిపి చేష్ఠలు, 

ఆటలు పాటలు - మనకు కమ్మని కబురు గాధలే ; || 

=================, 

alakala kiTTappa - 77 ;

jillaayeelu amTU iTlA - bullee buccee yaawattuu ; 

makuru paTTu paTTEnu - mamkupaTTu paTTEnu ; 

ciTTi goDawalaku maarupEru kada, 

baalakiTTuDu, mana baalakiTTuDu ; ||

wennamuddalaku kosarulu caalaa - aDugutu umTADu ; 

agnimaamdyamu ajeerti cEyunu - amTU yaSOda ceppabOte, 

mari alugutumTaDE ; || 

gOmuga cEsE goDawa haDAwiDi ; 

muddumuddugaa umTAyi, 

amma cEtitO gOrumuddalu ; 

nawaneetacOruniki ishTamulE ; 

amdulakE I cilipi cEshThalu, 

ATalu pATalu - manaku kammani kaburu gaadhalE ; ||  

;

song - 77 ; శుభకృత్ సుమ గీత మాలిక ; రచయి3 = కుసుమ ; ;

song 77 - alakala kiTTappa 


21, జూన్ 2022, మంగళవారం

యమునాతటి - తటిల్లత - 76

యమునాతటిని నిలిచినది - ఒక తటిల్లత, ముగ్ధ రాధిక ; || 

వేచి చూచును, కృష్ణుని రాకకయి - తన, ఎదురుచూపులు ; 

నది కెరటాల పయి - పరిచెను తెల్లని వెన్నెలలు ; || 

చిరుగాలులార, మా సుదతికివ్వరా, 

సంగీత మధురిమల సొగసుల లయలు ; 

క్రిష్ణుని మురళిని చొరవగ దూరే ; 

నేర్పరితనములు మీవే కదా ; || 

వేణుగానామృత లహరిక - రాధిక కోసము ప్రసాదము ; 

చిరుగాలులార -  

నీలమోహనుని గానమాధురిని  - తనకివ్వండి ఆసాంతం ;

సత్వరమే - తనకివ్వండి ఆసాంతం ; ||

======================== ;

yamunaataTini nilicinadi - oka taTillata ; mugdha rAdhika ; || 

wEci cuucunu, kRshNuni rAkakayi - tana, edurucuupulu ; 

nadi keraTAla payi - paricenu tellani wennelalu ; || 

cirugaalulaara, maa sudatikiwwaraa, 

samgeeta madhurimala sogasula layalu ; 

krishNuni muraLini corawaga duurE ; 

nErparitanamulu miiwE kadaa ; || 

wENugaanaamRta laharika ; 

rAdhika kOsamu prasaadamu ; 

cirugaalulaara -  

neelamOhanuni gaanamaadhurini ; 

tanakiwwamDi AsAmtam ;

satwaramE - tanakiwwamDi AsAmtam ; ||

;

song - 76 ;- శుభకృత్ సుమ గీత మాలిక ; రచయి3 = కుసుమ ; 

20, జూన్ 2022, సోమవారం

మంచి ఘడియలు - 75

భాసిల్లును నిరంతరం - 

అతులితమౌ రాగదీప్తి ;

అనురాగ మణుల దీప్తి ; ||

కాంతిపుంజములెల్లెడలా - లేచి రండి, జనులారా!

ఆనందం మన సొమ్ములు - దక్కుతున్న  ఘడియలు,

మంచి ఘడియలు -

ఈ, క్షణముల ఆకృతిని - స్తుతి కృతులుగ మలుచు తరిని -

విడువబోము నిముషమైన - కదలి రండి, కదలి రండి ; ||

శుక పికాళి - తరు సుమాళి - ఆకసమున -

తారకల మిణుకు తళుకు జతి గతులు - అనుసరించుచుండును, 

లాసతాండవం క్రీడల మేటి ఐన - నిపుణుడు శ్రీకృష్ణుని ; || 

=========================,

bhaasillunu niramtaram - 

atulitamau raagadeepti ;

anuraaga maNula deepti ; ||

kaamtipumjamulelleDalaa - lEci ramDi, janulaaraa!

aanamdam mana sommulu - dakkutunna ghaDiyalu ;

mamci ghaDiyalu ;

ee, kshaNamula aakRtini - stuti kRtuluga - malucu tarini -

wiDuwabOmu nimushamaina - kadali ramDi, kadali ramDi ; ||

Suka pikaaLi - taru sumaaLi - Akasamuna -

taarakala miNuku taLuku jati gatulu - anusarimcucumDunu, 

laasataamDawam krIDala mETi aina - nipuNuDu SreekRshNuni ; || 

&

మంచి ఘడియలు  ; song - 75 ;- శుభకృత్ సుమ గీత మాలిక ; రచయి3 = కుసుమ ; 

వెన్న ముంత - ఉట్టి జాడ - 74

కొండీలు చెబుతాడు - క్రిష్ణయ్య - "ఏమెరుగని అమాయకుడు -

ఇంత చిన్నపిల్లాడని" - యశోదమ్మ నమ్మదే ; ||

ఇల్లిల్లు గాలించి, చప్పున కనిపెడతాడు ;

వెన్న ముంత, ఉట్టి జాడ - తన, పని అంటే ఒక్కటే ;

నవనీత చోరత్వం ; భామలను, బామ్మలను -

అందరినీ మాయ చేయు - కిటుకేదో తెలిసినోడు ;

క్రిష్ణయ్య - ఔరా - తన ఫణితి జోరు ; ||

పిసాళి, తేటి తేనియల - నవ్వులన్ని గ్రుమ్మరించి,

అదే ఇంట నందనమును - వెలయించే చిలిపి, వీడు,

తొండీలు, కొండేలు - పితూరీలు యావత్తూ - 

అందరినీ అలరించే - "హరి"విల్లుల బింబములే ; || 

==================== ,

wenna mumta uTTi jADa - 74 ;-

komDiilu cebutaaDu - krishNayya - "Emerugani amAyakuDu -

imta cinnapillADani" - yaSOdamma nammadE ; ||

illillu gaalimci, cappuna kanipeDatADu ;

wenna mumta, uTTi jADa - tana, pani amTE okkaTE ;

nawaneeta cOratwam ; BAmalanu, bAmmalanu -

amdarinee maaya cEyu - kiTukEdO telisinODu ;

krishNayya - auraa - tana phaNiti jOru ; ||

pisALi, tETi tEniyala - nawwulanni grummarimci,

adE imTa namdanamunu - welayimcE cilipi, weeDu,

tomDIlu, komDElu - pituureelu yAwattuu - 

amdarinee alarimcE - "hari"willula bimbamulE ; ||

;

వెన్న ముంత ఉట్టి జాడ - 74 ;- శుభకృత్ సుమ గీత మాలిక - 74 ; రచయి3 = కుసుమ ; 

శుభశోభిత హాసములు - 73

 శుభ శోభితములు - సుమవల్లి రాధికా - 

దరహాస సుమములు -  శుభ శోభితములు ; ||

త్రుళ్ళింది మేఘము - ఈ అవనిపైకి ;

ఆవృతము అయ్యేను - మొయిలులో మెరుపులు ;

విద్యున్ - మాలికా పీఠమున - అధివసించేను కద, 

రాధిక చిరునగవు - మన, రాధిక చిరునగవు ; ||

ఢమఢమల ఉరుములు, విజయభేరీలు ;

శ్రీకృష్ణలీలలు - అఖిలాభిధామమున ;

సందీప్తి గానము - సుషుప్తికిదె చైతన్య తేజము ; || 

===================, 

SuBa SOBita hAsamulu ;- song - 73 ;-

SuBa SOBitamulu  - sumawalli rAdhikA - 

darahaasa sumamulu - SuBa SOBitamulu ; ||

truLLimdi mEGamu - I awanipaiki ;

aawRtamu ayyEnu - moyilulO merupulu ;

widyun mAlikA peeThamuna - adhiwasimcEnu kada, 

raadhika cirunagawu ; - mana, raadhika cirunagawu ; ||

DhamaDhamala urumulu, wijayaBEreelu ;

SrIkRshNaleelalu - aKilAbhidhaamamuna ;

samdeepti gaanamu - sushuptikide caitanya tEjamu ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక - 73 ; రచయి3 = కుసుమ ; 

19, జూన్ 2022, ఆదివారం

పున్నాగల కాడలు - సన్నాయి మేళము - 72

వేణుధరుని విలాసములు - తేజరిల్లు సద్భావం వర్ణ కళలు ;

సంవృతార్ణవ చైతన్య సంపదలు - జగములందు జయప్రదం ; || & -

నెలవంక పంపున - వచ్చింది వెన్నెల - చేరువనే యమునా ఝరి ;

అబ్బలాలొ, హుషారుగా, - ఎగసేను కెరటాలు ; ||నెలవంక పంపున||

నవమోహన కృష్ణుడు అల్లదిగో వచ్చేను - 

తన, ముంగురుల తూగాడుతు, చల్లగాలి, ఎగిరి దూకు ;

పిల్లగాలి అల్లరి ఆపతరము కానిది - పున్నాగల కాడలందు చటుక్కున దూరినది ;

సన్నాయిగ మారుతూ ... , పువు కాడలందు, 

మురళీ స్వరమాలలను అల్లసాగె పిల్లగాలి ; 

||నెలవంక పంపున|| 

పిల్లగాలి సైతము సంగీతం పీఠమౌతున్నది, చూడండి ;

త్రిభువనమ్ముల రాగలతలు - పుష్పించసాగె బాణీలు ,

నవ సంగీతం బాణీలను ; ||

వేణుధరుని విలాసములు - తేజరిల్లు సద్భావం వర్ణ కళలు ;

సంవృతార్ణవ చైతన్య సంపదలు - జగములందు జయప్రదం ; ||

=================== ,

punnAgala kADalu - sannAyi mELamu - 72 ;- 

wENudharuni wilAsamulu - tEjarillu sadbhAwam warNa kaLalu ;

samwRtArNawa caitanya sampadalu - jagamulamdu jayapradam ; || & -

nelawamka pampuna - waccimdi wennela - cEruwanE yamunaa jhari ;

abbalaalo, hushaarugaa, - egasEnu keraTAlu ; ||nelawamka pampuna||

nawamOhana kRshNuDu alladigO waccEnu - 

tana, mumgurula tUgADutu, callagAli, egiri dUku ;

pillagAli allari aapataramu kaanidi - 

punnAgala kADalamdu caTukkuna dUrinadi ;

sannAyiga mArutU ... , puwu kADalamdu, 

muraLee swaramAlalanu allasAge - pillagAli ; ||nelawamka pampuna|| 

pillagAli saitamu samgeetam peeThamautunnadi, cUDamDi ;

tribhuwanammula rAgalatalu - pushpimcasAge bANIlu ,

nawa samgeetam bANIlanu ; ||

wENudharuni wilaasamulu - tEjarillu sadbhAwam warNa kaLalu ;

samwRtArNawa caitanya sampadalu - jagamulamdu jayapradam ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక - 72 ; రచయి3 = కుసుమ ; 

రాధ మృదుభాషణము - 71

సుధా మధురము, మృదుభాషణము ;

రాధ మృదుభాషణము ; ||

శీతల సౌరభ పారిజాతము, 

తరళ సుమదళం, లావణ్యం ;

రాధ మృదుభాషణము ;

సుధా మధురము ; ||

పన్నీరాయెను, ప్రతి అణువు ;

ప్రకృతిలోని ప్రతి అణువు ;

కమ్మని తావుల పన్నీరాయెను ; 

మువ్వల సవ్వడి కప్పుర ఘుమఘుమ ;

ఉల్లసిల్లును రాధిక డెందము ;

నీ రాధిక డెందము ;

భావుక జనకా, శ్రీక్రిష్ణా, 

నీ నాట్య, గీతికలు 

నవమి పున్నమి వెన్నెల నెలవులయా! ; ||

======================== ;

sudhaa madhuramu, mRdubhaashaNamu ;

raadha mRdubhaashaNamu ; ||

SItala saurabha paarijaatamu, 

taraLa sumadaLam, laawaNyam ;

rAdha mRdubhaashaNamu ;

sudhaa madhuramu ; ||

panneeraayenu, prati aNuwu ;

prakRtilOni prati aNuwu ;

kammani taawula panneeraayenu ; 

muwwala sawwaDi kappura ghumaghuma ;

ullasillunu raadhika Demdamu ;

nee raadhika Demdamu ;

bhaawuka janakA, SrIkrishNaa, 

nee naaTya, geetikalu 

nawami punnami wennela nelawulayA! ; || 

;

శుభకృత్ సుమ గీత మాలిక - 71 ; రచయి3 = కుసుమ ; 

11, జూన్ 2022, శనివారం

మురళీ మృదు సంగీతం, జగతి పావనం - 70

వెన్న లాంటి మనసు కదా, కన్నయ్యది ; 

సకల జనుల హృదయ పద్మ పీఠమ్ముల ; 

అధివసించ గలిగినాడు, అందుకనే ; || 

ఇందువదనుడు కృష్ణుడు - ఎందు దాగెను ... , 

అనుచు, సైకత తీరమ్ముల వెంట -

అందందున, అంతటా, అన్వేషణ సాగుతోంది ;

అనుపల్లవి ;- 

ఆహా, ఈ హడావుడిలు - ఆహాహా, మోహనం ;

లతల పూల తేనియల మధుర మోహనం ;

మురళీ మృదు సంగీతం, జగతి పావనం ; ||

కనులముందు జార్చినది, హేమంత యువతి హిమ యవనిక; 

తమ కనులముందు జార్చినది, హేమంత యువతి హిమ యవనిక

డిల్లా పడి గోపికలు, డీలా పడె రాధిక ; ||

నీలమోహనాంగుడు ఎక్కడ!? - ఎక్కడ, ఎక్కడ, ఎక్కడెక్కడ!?

ఏ పొదరింటిలోన నక్కినాడొ!? ; గోపీ జనమందరికీ ; 

అవధి లేని తొందరలు, ఆపలేని గవేషణలు ; || 

ఇందు అందు, అందు ఇందు - ముందు వెనుక వెనుక ముందు - 

ఎందెందున దాగినాడొ, నవనీత చోరుడు, 

ఇందరితో పరుగులు, పెట్టించే తుంటరి ; || 

వెన్నదొంగ వెనువెంటనె మోగించెను వేణువును ; 

జన వాహిని వెన్ను తట్టి రాగజగతి మహిమ చూపె ; 

ఆహా, ఈ హడావుడిలు - ఆహాహా, మోహనం ;

లతల పూల తేనియల మధుర మోహనం ;

మురళీ మృదు సంగీతం, జగతి పావనం ; || 

================== ,

wenna lAmTi manasu kadaa, kannayyadi ; 

sakala janula hRdaya padma peeThammula ; 

adhiwasimca galiginADu, amdukanE ; || 

imduwadanuDu kRshNuDu - emdu daagenu ... , 

anucu, saikata teerammula wemTa -

amdamduna, amtaTA, anwEshaNa saagutOmdi ;

anupallawi ;- 

AhA, ee haDAwuDilu - aahaahaa, mOhanam ;

latala puula tEniyala madhura mOhanam ;

muraLI mRdu samgeetam, jagati paawanam ; ||

kanulamumdu jaarcinadi, hEmamta yuwati hima yawanika ; 

tama kanulamumdu jaarcinadi, hEmamta yuwati hima yawanika ; 

DillA paDi gOpikalu, DeelA paDe rAdhika ; ||

nIlamOhanAmguDu ekkaDa!? - 

ekkaDa, ekkaDa, ekkaDekkaDa!? 

E podarimTilOna nakkinADo!? ; gOpI janamamdarikI ; 

awadhi lEni tomdaralu, aapalEni gawEshaNalu ; || 

imdu amdu, amdu imdu - mumdu wenuka wenuka mumdu - 

emdemduna daaginADo, nawaneeta cOruDu, 

imdaritO parugulu, peTTimcE tumTari ; || 

wennadomga wenuwemTane mOgimcenu wENuwunu ; 

jana wAhini wennu taTTi raagajagati mahima cuupe ;

AhA, ee haDAwuDilu - aahaahaa, mOhanam ;

latala puula tEniyala madhura mOhanam ;

muraLI mRdu samgeetam, jagati paawanam ; || 

&

శుభకృత్ సుమ గీత మాలిక - 70 ; రచయి3 = కుసుమ ;   & మురళీ మృదు సంగీతం, జగతి పావనం ;-  

seventy 70 - డెభ్బై 70 = seventy 70 ;

ఏలేలో - హైలెస్సా

 ఆతృతలేలనె, ఓ గోపీ,

బృందగీతికల నాలపించగా ; ||

పింఛము మెరుపులు కురిపిస్తూ,

జతగా చేరెను మయూరమ్ములు ; 

పూల అమ్ముల లయల హొయలుల, 

తాళములాయెను నెమలి ఆటలు -

ఆ చక్కని సుందర - ఆట పాటలు ;||

కాళిందీ నది చిరు చిరు తరగలు -

కవితల మాధురి - జావళి చిందులు ;

కలిపెను బృందావనమున* -

ప్రతి పొదరింట - చిత్ర సౌరభిళ -

తరళ సుమమ్ముల - విరళ దళమ్ములు ;

ఈ విలసిత  భాగ్యములెన్నో, 

ఇంతటి సౌభాగ్యమ్ములు ఎన్నెన్నో ; || 

వలయ వలయముల పునరావృతమౌ - 

భజన సందడుల - భక్తి ఉరవడులు ; 

రాధా కృష్ణ ద్వయము ఆటలు ; 

అందరి అడుగులు కలిసినవి ; 

ఆవృత పదములు ఏలేలో ; 

పునరావృతమ్ముగా, హైలెస్సా ; || 

బృంద* = తులసి ] ;

========================= ;

ElElO - hailessA ; = `song 69 ;-` 

aatRtalElane, O gOpI,

bRmdageetikala naalapimcagaa ; ||

pimCamu merupulu kuripistuu,

jatagaa cErenu mayuurammulu ; 

puula ammula layala hoyalula, 

tALamulaayenu nemali ATalu -

aa cakkani sumdara - ATa pATalu ;||

kALimdii nadi ciru ciru taragalu -

kawitala maadhuri - jaawaLi cimdulu ;

kalipenu bRmdaawanamuna*-

prati podarimTa - citra sauraBiLa -

taraLa sumammula - wiraLa daLammulu ;

ee wilasita  bhaagyamulennO, 

imtaTi saubhaagyammulu ennennO ; || 

walaya walayamula punaraawRtamau - 

bhajana samdaDula - bhakti urawaDulu ; 

raadhaa kRshNa dwayamu ATalu ; 

amdari aDugulu kalisinawi ; 

aawRta padamulu ElElO ; 

punaraawRtammugaa, hailessA ; ||

&

[bRmda* = tulasi ] ;

శుభకృత్ సుమ గీత మాలిక -  69 ;; రచయి3 = కుసుమ ; ; 

యమునాతీరే, భళి హైలెస్సా

లెస్స లెస్సగా హైలెస్సా ;

భళిరే, బాలురు , హైలెస్సా ; ||

యమున ఒడ్డుకు చేరారు ; 

వ్రేపల్లియలోని ప్రజలంతా ; 

పల్లె పల్లెల బృందారకులు ; 

బృందగానములు అనిన ముచ్చట ; 

ముచ్చటగా బహు ముచ్చట లాడుచు ; 

బృంద గానముల శిక్షణ పొందిరి ; 

మేలుతరమ్మౌ బృందగీతికా క్రీడలు ; 

సృజనల వృష్టిలు సౌజన్యముగా ; 

అటనిట ఇటనట - నట గోవిందుని విలాసములే ;

నయన మనోహర గోచరమ్ములు ; || 

వకుళ మాలికలు అల్లారు ;

ప్రజలు, వకుళ మాలికలు అల్లారు ; ; 

ఒడలు నిండుగా ధరియించేరు ; 

తులసీ  ఆకుల పరిమళ దండలను ;

తులసీ పూసల చేరులను ;

ఒడలు నిండుగా ధరియించేరు ; ||

యమునాతీరే విలసిత కళలే ;

రంగు రంగుల హరివిల్లే,

ఇది, రంగు రంగుల హరివిల్లే ;

శ్రీకృష్ణుని నాట్య విలాసాలు -

ఉండగ అంతటహైలెస్సా!  - 

భళిరే భళిరే హైలెస్సా! 

================= ,

lessa lessagaa hailessA ; 

bhaLirE, baaluru, hailessA ; ||

yamuna oDDuku cErAru ; 

wrEpalliyalOni prajalamtaa ; 

palle pallela bRmdaarakulu ; 

bRmdagaanamulu anina muccaTa ; 

muccaTagaa bahu muccaTa lADucu ; 

bRmda gaanamula SikshaNa pomdiri ; 

mElutarammau bRmdageetikaa krIDalu ; 

sRjanala wRshTilu saujanyamugaa ; 

aTaniTa iTanaTa - naTa gOwimduni wilaasamulE ;

nayana manOhara gOcarammulu ; || 

wakuLa mAlikalu allaaru ;

prajalu, wakuLa mAlikalu allaaru ; ; 

oDalu nimDugaa dhariyimcEru ; 

tulasee  aakula parimaLa damDalanu ;

tulasee puusala cErulanu ;

oDalu nimDugaa dhariyimcEru ; ||

yamunaateerE wilasita kaLalE ;

ramgu ramgula hariwillE,

idi, ramgu ramgula hariwillE ;

SreekRshNuni naaTya wilaasaalu ;

umDaga amtaTa - BaLirE hailessA!

&

శుభకృత్ సుమ గీత మాలిక -  68 ;; రచయి3 = కుసుమ ;

10, జూన్ 2022, శుక్రవారం

రాధామణి మనోన్మణి

గోపతేజోమణి - తనకు సాటి ఎవ్వరంట!!? ;

రాధామణి మనోన్మణి ఎవ్వరంట!? - 

ఇంకెవ్వరంట -

అల్లరి కృష్ణయ్య, మన మోహన కృష్ణయ్య ; || 

మైత్రీవనమ్మున తారాడు సంచారి ; || 

మ్రోడులకు ప్రభలల్లు మయూరియే తాను ; 

మొండి దుష్టులకు గండు వీరుడే తాను ; 

గండరగండడు ఈతడే - అందాల యోధుడు ; ||

======================== ;

gOpatEjOmaNi - tanaku sATi ewwaramTa!!? ;

raadhaamaNi manOnmaNi ewwaramTa!? - 

imkewwaramTa -

allari kRshNayya, mana mOhana kRshNayya ; || 

maitrIwanammuna tArADu samcaari ; || 

mrODulaku prabhalallu mayuuriyE taanu ; 

momDi dushTulaku gamDu wIruDE tAnu ; 

gamDaragamDaDu iataDE - amdAla yOdhuDu ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక -  67 ;; రచయి3 = కుసుమ ;

1, జూన్ 2022, బుధవారం

స్ఫటిక ప్రేమ

సౌందర్యారాధనము - 

అందరికీ ఆమోదం, 

బహుళ విరళ సమ్మతము ;

వసుధ - ఏరి కోరి, మరీ మరీ -

కేరింతల క్రిష్ణయ్యను -

భువి పైకి, రప్పించెను ; ||

అందమంటె - ఆహ్లాదము ;

స్ఫటిక ప్రేమయే కదా - 

అందుకె మనమంద్రము - అందాము ;

అందులకే ఈ ఎంపిక బాగున్నది - 

వసుంధరకు కృతజ్ఞతలు ; ||

=============== ,

saumdaryaaraadhanamu - 

amdarikee aamOdam, 

bahuLa wiraLa sammatamu ;

wasudha - Eri kOri, maree maree -

kErimtala krishNayyanu -

bhuwi paiki, rappimcenu ; ||

amdamamTe - aahlaadamu ;

sphaTika prEmayE kadA - 

amduke manamamdramu - amdaamu ;

amdulakE ee empika baagunnadi - 

wasumdharaku kRtajnatalu ; ||

&  

స్ఫటిక ప్రేమ = song 66 ;;

శుభకృత్ సుమ గీత మాలిక -  66 ;; రచయి3 = కుసుమ ;; June ;

మధురా నగరియె ప్రతి ప్రాంతం

దామం దామం, సుమదామం ; 

నీ నవ్వుల పూవుల నీయవయా, 

క్రిష్ణ, నీ నవ్వుల పూవుల నీయవయా ; || 

గానం గానం, మధురానుభవం ;

మధురా నగరియె ప్రతి ప్రాంతం ; || 

రాగం రాగం, అనురాగమయం ;

తమసున తమకము - చంద్రోదయము ; || 

ధ్యానం ధ్యానం సంకల్పం ; 

అనుగ్రహము సంపూర్ణం ; 

స్వామి -

ప్రేమసమీరం - హరితాశ్రమము ; || 

============ ,

daamam daamam, sumadaamam ; 

nee nawwula puuwula neeyawayA, 

krishNa, nee nawwula puuwula neeyawayA ; || 

gaanam gaanam, madhuraanubhawam ;

madhuraa nagariye prati praamtam ; || 

raagam raagam, anuraagamayam ;

tamasuna tamakamu - camdrOdayamu ; || 

dhyaanam dhyaanam samkalpam ; 

anugrahamu sampuurNam ; 

swaami -

prEmasameeram - haritASramamu ; || 

&

శుభకృత్ సుమ గీత మాలిక -  65 ;; రచయి3 = కుసుమ ;; June 2022 ;

మధురా నగరియె ప్రతి ప్రాంతం ;- song 65 ;