4, అక్టోబర్ 2022, మంగళవారం

రాముని చరితము - బోధగురువు

రాముని చరితమె బోధగురువుగా రాముని కృపయే ప్రేరణగా ;-
రామా రామా రామా యని ;- song ;-
రామా రామా రామా యని శ్రీరామచంద్రుని నామమును
ప్రేమగ నిత్యము పలికెడు వాడే రాముని సన్నిధి చేరునయా

రామ రామ యని ప్రేమగ పలుకగ రాముడు మనసున నిలువవలె
కామవికారము లణగెడు దాక రాముడు మనసున నిలువడుగా
రాముడు మనసున నిలచెడు దాక కామవికారము లణగవుగా
రాముని సత్కృప కలిగిన నాడే యీముడి చక్కగ విడివడుగా

రామ రామ యని చింతన చేయగ రాముని తత్త్వము తెలియవలె
భూమిని సద్గురు బోధకలుగక రాముని తత్వము తెలియదుగా
సామాన్యుల కిల సద్గురుబోధలు చాలదుర్లభం బనదగుగా
రామునిచరితమె సద్గురువగుచును భూమిజనులకు కలదు కదా

రామ రామ యని స్మరణము చేయుట కేమియు సరి కావిల ననుచు
రామున కన్యము తలపక నిత్యము రామస్మరణము చేయుచును
రాముని చరితమె బోధగురువుగా రాముని కృపయే ప్రేరణగా
రామున కంకిత మొనరించవలె ప్రేమమీఱ తన జీవితము  ; 
& song from -  శ్యామలీయం - Blog ;LINK here
&
ఇతిహాస - songs, itoms ;

3 కామెంట్‌లు:

  1. బ్లాగరు గారూ,

    మీరిక్కడ నా శ్యామలీయం బ్లాగులో 1, అక్టోబర్ 2022, శనివారం నాడు ప్రచురితమైన రామా రామా రామా యని అన్న రామకీర్తనను ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించుకున్నారు.

    మీబ్లాగులో మీరు ఇతరుల నుండి గ్రహించిన ఆసక్తికరమైన విషయాలను పొందుపరచుకోవటంలో తప్పు ఏమీ లేదు. కాని మీరు మీటపాలో మీరు స్వీకరించిన విషయాలకు మూలాలను తప్పకుండా పేర్కొనాలి. అలా చేయకపోవటం తప్పు అని కాక విజ్ఞులు గ్రంథచౌర్యం అనే‌ నేరంగా తప్పక ఆక్షేపిస్తారు. వీలు కుదిరిన ప్రతిసందర్భంలోనూ మీబ్లాగులోనే కాక మూలరచన ఉన్నచోటనో లేదా నేరుగా మూలరచయితకో సమాచారం తప్పక ఇవ్వాలి. నిజానికి ముందుగా అనుమతి కోరి, ఆపిమ్మటనే మీరు మీటపాలో ఇతరుల రచనలనుండి సమాచారాన్ని పొందుపరచుకోవలసి ఉంటుంది .అది పద్దతి.

    ఈరామకీర్తనలకు నాకు కర్తృత్వాపేక్షకూడా ఏమీ లేదు. అంతా రామార్పణంగా రామానుగ్రహపూర్వకంగా వెలువడుతున్న సాహిత్యం ఇది. అంతమాత్రాన ఎవరికి తోచినట్లు వారు హస్తలాఘవం ప్రదర్శించటం సముచితం కాదు.

    దయచేసి ఇప్పటికైనా పొరపాటును దిద్దుకోవలసింది. ఇకముందు తగు జాగ్రత వహించగలరు.

    రిప్లయితొలగించండి
  2. sir, ఇది - మీ రచన - గానే నేను share చేసాను - నాకు అంతగా internet technology తెలియదు, అందువలన ఏదో పొరపాటు - జరిగింది - నాకు మీ పాట నచ్చింది, అందుకనే share చేసాను - mari, ippudu remove cheyanaa ........ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంతచిన్న విషయానికీ internet technology కీ ఏమిసంబంధం? ఫలాని బ్లాగు నుండి సేకరించిన పాట అని చెబితే సరిపోతుంది కదా? మీరు ఇప్పుడు తొలగించటం అవసరం లేదు. ఇకముందు మూలరచయితకు తగిన క్రెడిట్ ఇవ్వాలని మరచిపోకండి చాలు.

      అన్నట్లు రామకీర్తన నచ్చినందుకు సంతోషం.

      తొలగించండి