మోహిని అవతారమేల? చాలు చాలు ;
మహిత రాధ చేరువనే ఉన్నది కద -
మహిని - మహిత రాధ -
నీదు చేరువనే ఉనది కద - మోహన క్రిష్ణా! ; ||
అంబరమును సైతము - తాకగల పాదద్వయి,
క్రిష్ణా! నీదు, శ్రీపాదపద్మములకు -
ఇవిగివిగో, మృదురవళినీయు మంజీరములు ;
ఆడవోయి, క్రిష్ణా! ఆటలాడవోయి, క్రిష్ణా ; ||
నిన్నటి కోదండమును, మొన్నటి సుదర్శనమును ;
పక్కన పెట్టేయవయ్య,
కాస్త, పక్కన పెట్టేసి, కన్నా -
గీతములను ఒసగుమయా ; ||
విశ్వాల శ్వాస నీ ఊసులు -
విశ్రాంతిగ, సంగీతము నొసగుమోయి ;
నిఖిల లోకమ్ములకు సంగీతము నొసగుమయ్య ;
ఇదిగిదిగో, ఇదె వేణువు తెచ్చినాము ;
నీదు పల్లవాంగుళుల అందుకొనుము ;
నీదు లేతపెదవులపయి చేర్చుమోయి వేణువును ; ||
నాట్య, రాగ, గాన - నాట్య నృత్యహేలలందు -
మాదు హృదయ సీమలన్ని పరిఢవిల్లు ప్రశాంతం,
పృధ్వి శాంతరస తేజం, మోదపూర్ణ సుధల కలశం ;
మ్రోగించుమోయి పిల్లనగ్రోవి, క్రిష్ణా!
మ్రోగించుము, మధుమురళిని, వంశీక్రిష్ణా!
..... మా వంశీక్రిష్ణా! ; ||
=============================== ,
mOhini awataaramEla? caalu caalu ;
mahita raadha cEruwanE unnadi kada -
mahini - mahita raadha -
needu cEruwanE unadi kada - mOhana krishNA! ; ||
ambaramunu saitamu - taakagala paadadwayi,
krishNA! needu SrIpaadapadmamulaku -
iwigiwigO, mRdurawaLinIyu mamjeeramulu ;
ADawOyi, krishNA! ATalADawOyi, krishNA ; ||
ninnaTi kOdamDamunu, monnaTi sudarSanamunu ;
pakkana peTTEyawayya,
kaasta, pakkana peTTEsi, kannA ;
geetamulanu osagumayaa ; ||
wiSwaala Swaasa nee uusulu -
wiSraamtiga, samgItamu nosagumOyi ;
niKila lOkammulaku samgeetamu nosagumayya ;
idigidigO, ide wENuwu teccinaamu ;
needu pallawaamguLula amdukonumu ;
needu lEta pedawulapayi, cErcumOyi wENuwunu ; ||
nATya, raaga, gaana - nATya nRtyahElalamdu -
maadu hRdaya seemalanni pariDhawillu praSAMtam,
pRdhwi SAmtarasa tEjam - mOdapUrNa sudhala kalaSam ;
mrOgimcumOyi pillanagrOwi, krishNaa!
mrOgimcumu, madhumuraLini, wamSIkrishNaa!
..... maa wamSIkrishNaa! ; ||
& ;
పాట- 93 ;- విశ్వాల శ్వాస, క్రిష్ణుని ఊసులు ;
రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక - 93 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి