26, అక్టోబర్ 2022, బుధవారం

పల్లెలోన ఘాటు ఘాటు-96

పల్లె అంతా ఘాటు ఘాటు - 
రేపల్లె అంతా ఘాటు ఘాటు -  
ధూపాలు, పొగలు - క్షారమ్ముల వేడి సెగలు ; 
ఎందుకనీ, ఎందుకనీ!?? ; ||
 
వెన్న మెక్కి, త్రేనుస్తూ, 
నవ్వేను క్రిష్ణుడు - శ్రీబాలక్రిష్ణుడు ; || 
మాత యశోదమ్మ - పరుగెడుతూ వచ్చింది - 
దేవకి, రేవతి - గోపెమ్మలు -
పల్లెలోని ప్రౌఢ వనితలందరునూ -
వచ్చినారు పరుగున, పరుగు పరుగున ; 

గాజుల గలగలలతోటి - గాలి కొత్త వాద్యమాయె ;
పడతుల నవ్వుల తోటి -  పురుషుల జత నవ్వులు ;
అంబరమిపుడు - స్వర్ణ గ్రంధమాయె ;
ఔనుకదా, ఈ దృశ్యావళి - నిండైన కనుల విందు ; 
దిష్టి సోకకుండా - ఎండు మిరప, మిరియాలు -
కళ్ళుప్పు, నిప్పు నీళ్ళు - దిగదుడిచినారు వనితలు ;
క్రిష్ణయ్యకు - దిష్టి తీసినారు - నారీమణులందరు ;
అందుకనే .... ,
వ్రేపల్లియ నలుమూలల -  అంతటా ఘాటు ఘాటు - 
&
రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 96  ;
=============================, 
pallelOna ghaaTu ghaaTu - 96 ;-

palle amtaa ghaaTu ghaaTu - 
rEpalle amtaa ghaaTu ghaaTu -  
dhuupaalu, pogalu - kshaarammula wEDi segalu ; 
emdukanee, emdukanI!?? ; || 

wenna mekki, trEnustuu, 
nawwEnu krishNuDu - SrIbAlakrishNuDu ; || 

maata yaSOdamma - parugeDutuu waccimdi - 
dEwaki, rEwati - gOpemmalu -
pallelOni prauDha wanitalamdarunuu -
waccinaaru paruguna, parugu paruguna ; || 

gaajula galagalalatOTi -
gaali kotta waadyamaaye ;
paDatula nawwula tOTi -  purushula jata nawwulu ; 
ambaramipuDu - swarNa gramdhamaaye ;
aunukadaa, ee dRSyaawaLi - nimDaina kanula wimdu ; 
dishTi sOkakumDA - emDu mirapa, miriyaalu -
kaLLuppu, nippu nILLu - digaduDicinaaru wanitalu ;
krishNayyaku - dishTi teesinaaru, naareemaNulamdaru ;
amdukanE .... ,
wrEpalliya nalumuulala -  amtaTA ghaaTu ghaaTu -
&
పల్లెలోన ఘాటు ఘాటు - 96 ; రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 96  ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి