స్వాగతం, వసంతమా! సుస్వాగతం ఆమనీ! : ||
ఈ కడిమి తరువు - పచ్చని శాఖలు - గుబురుగా ఉన్నవి ;
ఆకు పచ్చని ఆకులు, గుబులెత్తిస్తు ఉన్నవి ; ||
కొమ్మలకు నేడు, దోబూచి నేర్పును - బాలకృష్ణమ్మ ;
మన గోపాలకృష్ణమ్మ -
క్రిష్ణయ్య ఎక్కెను - తరుశాఖలు ;
క్రిష్ణ పదస్పర్శతో పులకించు పాదపము ;
తవ చరణ - అంటూను - శిష్యరికము గైకొనును ;
కదంబ వృక్షమ్ము - శిష్య అయ్యేను ; ||
గుబురు ఆకుల నడుమ - క్రిష్ణ పద పద్మములు ;
పత్ర తోరణమాల లల్లదే, సంబరం ;;
ఎందులకు ఈ ముదము, ఈ మోదము !?
ఎందులకు ఈ అలవి మాలిన సంతసం, ఈ తరువు శోభిల్లు ; ||
చెట్టు క్రీనీడల మడుగులో సందడులును ;
స్నానాలు, పానాలు జవ్వనులవి ;
జల అద్దములకు - లక్ష రెట్లుగ సొగసు లద్దుచున్నారు ; ||
ఆకుపచ్చని కొమ్మలందున - అల్లదే - నీలమణి ఉన్నది ;
పగడాల పెదవుల మురళి ఇంపొందించు -
తరళ రాగమ్ముల - తారళ్య సొబగులు ;
ఎన్నెన్ని పుణ్యాలు చేసెనో, ఈ వనము,
క్రిష్ణ గాధల మధుర కాంతులను -
తన పురి నిండ నింపుకుని, ఇదిగిదిగో .... ,
ఉరికురికి సాగేను, వయ్యారి నెమలి ;
కమ్మని దృశ్యాల - నా హృదయసీమలు కూడ -
విప్పిన పింఛమ్ము అయ్యేను -
హాయి - హాయి హాయిగా - బదులిస్తు ఆమని వెలిసింది ;
స్వాగతం, వసంతమా! సుస్వాగతం ఆమనీ! : ||
================================== ;
swaagatam, wasamtamA! suswaagatam aamanI! : ||
ee kaDimi taruwu - paccani SAKalu - guburugaa unnawi ;
aaku paccani Akulu, gubulettistu unnawi ; ||
kommalaku nEDu, dObUci nErpunu - baalakRshNamma ;
mana gOpaalakRshNamma -
krishNayya ekkenu - taruSAKalu ;
krishNa padasparSatO pulakimcu paadapamu ;
tawa caraNa - amTUnu - Sishyarikamu gaikonunu ;
kadamba wRkshammu - Sishya ayyEnu ; ||
guburu aakula naDuma - krishNa pada padmamulu ;
patra tOraNamAla lalladE, sambaram ;;
emdulaku ee mudamu, I mOdamu !?
emdulaku ee alawi maalina samtasam, ee taruwu SOBillu ; ||
ceTTu krInIDala maDugulO samdaDulunu ;
snaanaalu, paanaalu jawwanulawi ;
jala addamulaku - laksha reTluga sogasu ladducunnaaru ; ||
aakupaccani kommalamduna - alladE - neelamaNi unnadi ;
pagaDAla pedawula muraLi impomdimcu -
taraLa raagammula - taaraLya sobagulu ;
ennenni puNyaalu cEsenO, ee wanamu,
krishNa gaadhala madhura kaamtulanu -
tana puri nimDa nimpukuni, idigidigO .... ,
urikuriki saagEnu, wayyaari nemali ;
kammani dRSyaala - naa hRdayaseemalu kUDa -
wippina pimCammu ayyEnu -
haayi - haayi haayigaa - badulistu aamani welisimdi ;
swaagatam, wasamtamA! suswaagatam aamanI! : ||
రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 99 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి