రేయి భాగ్యమె భాగ్యము - ఎంచగలమా, కొలువగలమా ; ||
చుక్కలను పిలిచేను రేయి - చాకచక్యముగా -
చక్కని చుక్క పందిరి వేస్తూన్నది ;
జగతి రమ్యత రూపు ఆయెను ; ||
రాసక్రీడల వేళ ఆయెను ; ఓయిలాలా -
ఈ రేయి, నిండు హొయలుల నిధిగ మారెను ;
హొయలు నిధులుగ మారిపోయెను, హోయిలాలా ; ||
మోహ గీతావళిగ విరిసేను - రాగ మోహనమాయెను -
విశ్వమంతా - మోహనమ్మై రాగమాయెను ;
రేయి కూడ చెలియ ఆయెను - నిన్ను చేరి -
క్రిష్ణస్వామీ, నా బంగారు స్వామీ ; ||
హాయి మాయగ అలుముకొనగా - నీదు సన్నిధిలోన క్రిష్ణా -
రేయి నీకు రాగసఖియై, నేడు రాధమ్మ నిటుల బులిపించసాగెను ;
||రేయి భాగ్యమె సౌభాగ్యము ; ||
&
రేయి భాగ్యమె భాగ్యము-97 ; రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 97 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి