శ్రీకృష్ణస్వామి దరహాస సన్నిధిని ;
శంక లేకుండా చేరవే, మనసా!
పృధ్వివల్లభుని శుభ సన్నిధి -
అది, ఘన పెన్నిధి ;
స్వామి, చల్లని దరహాససన్నిధిని ;
శంక లేకుండా చేరవే, మనసా! ; ||
తొలి అర్చనా సుమము - అది ఒక్కటే -
శ్రీ అభయవరదునికి - అర్పించగలిగేటి -
భక్తిసంతులిత ప్రేమసుమమే చెలియా! ; ||
తల్లి ఒడి మెత్తన - పునీతం భావన ;
రాధామనోహరుని సాన్నిధ్య వైభవం -
యుగయుగాలకునూ హృదయంగమం ;
అత్యంత హృదయంగమం ; ||
=================== ;
SreekRshNaswaami darahaasa sannidhini ;
Samka lEkumDA cErawE, manasA!
pRdhwiwallabhuni SuBa sannidhi -
adi, ghana pennidhini ;
swaami callani darahAsa sannidhini ;
Samka lEkumDA cErawE, manasA! ; ||
toli arcanaa sumamu - adi okkaTE -
SrI abhayawaraduniki - arpimcagaligETi -
bhaktisamtulita prEmasumamE celiyA! ; ||
talli oDi mettana - puniitam bhaawana ;
raadhaamanOharuni saannidhya waibhawam -
yugayugaalakunuu hRdayamgamam ;
atyamta hRdayamgamam ; ||
&
కృష్ణ దరహాస సన్నిధి - 94 ;
రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 94 ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి