17, అక్టోబర్ 2022, సోమవారం

దీపావళి ధ్యానములు - 95

పచ్చనాకు పార్శ్వమున - బొండుమల్లె నవ్వుతోంది ;

కోటి తారకలు ఇటకే దిగివచ్చెను - ఆహాహా!

రండి రండి మిత్రులార! ప్రతి క్షణమిట - 

దివ్వెల శుభ దీపావళి - దీపావళి ధ్యానములే ; ||  ; 

ఆప్త మిత్రములు కాంతులు, రేరాజు వెన్నెల ; 

మరల మరల, 

సొంపొందెను - వెలుతురుల మతాబాలు ; || 

మసక పడదు ఏ రేయి - 

వెలుగు తునుక, ప్రతి రాత్రి ; 

అర్ణవముల శోభలీను - ప్రభా కాంతులీను -

ప్రతి తిధియూ పున్నమి అయి - 

దర్శించగ కడు వేడుక ; 

"మా పల్లె - రేపల్లియ - వల్లె!" అనుచు, 

నిఖిల జగతి - ప్రకృతి హేలావళి - 

తలలూచుచు, ఒప్పుకొనెను ; || 

సంబరముల హోలీ - ఆడవోయి వనపాలీ -

నాట్య రాస వృతముల - 

వృత్తాంతములవధి లేకుండా - 

లవలేశమైన అవధి లేకుండునట్లు - 

రాసక్రీడ లాడవోయి, వనమాలీ! ||

రండి రండి మిత్రులార! ప్రతి క్షణమిట - 

దీపావళి ధ్యానములే - దివ్వెల శుభ దీపావళి ; ||

================================ ;

dIpAwaLi dhyAnamulu - 95 ;

paccanaaku paarSwamuna - bomDumalle nawwutOmdi ;

kOTi taarakalu iTakE digiwaccenu - AhAhA!

ramDi ramDi mitrulAra! prati kshaNamiTa - 

diwwela SuBa dIpAwaLi - deepaawaLi dhyaanamulE ; || 

aapta mitramulu kaamtulu, rEraaju wennela ; 

marala marala, 

sompomdenu - weluturula mataabaalu ; || 

masaka paDadu E rEyi - welugu tunuka, prati raatri ; 

arNawamula SOBalInu - praBA kaamtuleenu -

prati tidhiyuu - punnami ayi - darSimcaga kaDu wEDuka ; 

maa palle - rEpalliya - walle anucu, nikhila jagati ;  

prakRti hElaawaLi - talaluucucu, oppukonenu ; || 

sambaramula hOlI - ADawOyi wanapAlI -

nATya raasa wRtamula - wRttaamtamu + 

lawadhi lEkumDA - lawalESamaina awadhi lEkumDunaTlu -

raasakrIDa lADawOyi, wanamAlI!

&

దీపావళి ధ్యానములు  - 95 ;- రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 95 ; 

;

95 song - krishna -


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి