26, అక్టోబర్ 2022, బుధవారం

మోదములకు కుందనం -98

నీదు రాక, సత్వరం - మోదములకు కుందనం ;

మందగమనమేలనోయి - రావోయీ, క్రిష్ణయ్యా ;

ముగ్ధ రాధ వేచి ఉండె - రావోయీ, క్రిష్ణయ్యా ; || 

కలల వన్నె హరివిల్లుల, మోయుచు  - 

వేచి ఉండె గగనము, 

నీల మోహనా, ఘనశ్యామా - రావోయీ, క్రిష్ణయ్యా ; || 

అలల నురుగుబుడగలందు, వెన్నెలను మోయుచూ ; 

కదలనట్టి బొమ్మ వోలె - అట్టే ఉండె, ఆ యమున ; 

నీదు రాక, ఏరువాక - రావోయీ, క్రిష్ణయ్యా ; ||

తనను రాగ రాగిణిగా - మార్చు ముహూర్తం కొరకు -

మోవిపైన నీవు నిలుపు - వేణువిపుడు వేచిఉండె ;  

నీ ఆగమనం పాలపుంత ;  రావోయీ, క్రిష్ణయ్యా ; || 

&

మోదములకు కుందనం -98 ; రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 98 ; ; 

=============================== ;

needu raaka, satwaram - mOdamulaku kumdanam ;

mamdagamanamElanOyi - raawOyI, krishNayyaa ;

mugdha raadha wEci umDe - raawOyI, krishNayyaa ; || 

kalala wanne hariwillula - mOyucu wEci umDe gaganamu, 

nIla mOhanA, GanaSyAmA - raawOyI, krishNayyaa ; || 

alala nurugula buDagalamdu - wennelanu mOyucuu ; 

kadalanaTTi bomma wOle - aTTE umDe, aa yamuna ; 

needu raaka, EruwAka - raawOyI, krishNayyaa ; ||

tananu raaga rAgiNigA - maarcu muhuurtam koraku -

mOwipaina neewu nilupu - wENuwipuDu wEciumDe ;  

nee aagamanam paalapumta ;  raawOyI, krishNayyaa ; ||

&

మోదములకు కుందనం -98 ; 

రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 98 ; ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి