అందరి మనసులు కళకళా ;
అంతా, ఆనందాలు తళతళా ; ||
మొక్కులు, చెల్లింపు - బహు హుషారు ;
గోవర్ధన గిరికి వెంటనే వెళదాము ;
మొక్కుబడులు చెల్లిద్దాం ;
క్రిష్ణయ్య ఆదేశం - శిరసావహించుదాము ; ||
గిరి అర్చన - అంటేను, ప్రకృతికి పూజలే ;
కళకళల ప్రకృతి - మన ఎల్లరికీ తల్లి ఒడి ;
తెలుసుకోండి ఈ మాట ;
తెలుపండి జనులకు - మెరిసే ఈ బంగారు మాట ; ||
ఆకు వక్క, తాంబూలం ;
చందనము - పూలు, పత్రి, జలకుండలు-
మోసుకొని, కొండ పైకి - వెళదాము ;
చిట్టి పిల్లనగ్రోవి - రవళి వింటూ -
పండుగను చేద్దాము ; ||
=========================== ,
amdari manasulu kaLakaLA ;
amtaa, aanamdaalu taLataLA ; ||
mokkulu, cellimpu - bahu hushaaru ;
gOwardhana giriki ; wemTanE weLadAmu ;
mokkubaDulu celliddaam ;
krishNayya AdESam - Sirasaawahimcudaamu ; ||
giri arcana - amTEnu, prakRtiki puujalE ;
kaLakaLala prakRti - mana ellarikee talli oDi ;
telusukOMDi ee mATa ;
telupamDi janulaku - merisE I bamgaaru mATa ; ||
aaku wakka, taambuulam ;
camdanamu - puulu, patri, jalakumDalu -
mOsukoni, komDa paiki - weLadAmu ;
ciTTi pillanagrOwi - rawaLi wimTuu - pamDuganu cEddaamu ; ||
&
గిరి అర్చన = ప్రకృతికి పూజలే - 91 ;-
రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక - 91 ;
చీచీచీచీ చీచీచీచీ అని రేపోమాపో ఠపావేస్తారా? లేకపోతే ఇదేమిటీ?
రిప్లయితొలగించండిభలే గుర్తు పట్టారు, కొత్త laptop మీద కుస్తీ - new system నేర్చుకునే తిప్పలు - ఇవాళ [= 4, సెప్టెంబర్ 2022, గురువారం ] - update చేసి, new song ప్రింట్ చేసాను - Thank u very much శ్యామలీయం గారూ - [Date మాత్రం ఇక్కడ మారడం లేదు, ఎట్లా చేయాలో ఏమిటో ... మరి ~~~~~ :( ; 😇
తొలగించండి