18, ఫిబ్రవరి 2023, శనివారం

గరుడగమనం, కుదుపులు -114

పక్షిరాజు మూపున తాపీగా కూర్చుని, 

వేణవూదుచుండెను క్రిష్ణమూరితి ; 

గండభేరుండమా! 

కుదుపులేమి లేకుండ - హడావుడి పడకుండ ;

నెమ్మదిగా సాగవోయి,

నీ గమనము వేగపడితె -

నీ మూపున కూర్చుని ఉన్నాడు -

వేణుగానలోలుడు ;

నువ్వు గాని తొట్రు పడితే -

మురళి కాస్త ఉలికిపడును -

రసగానము కలతపడును ;

లోకములను - ఆనందవాహినిలో - 

ఓలలాడించే సంగీతధార -, 

గండిపడితె ఊరుకోము -

అందుకనే, విహగపతీ, గరుడా!

నింపాదిగా సాగుమోయి ;

గరుడవాహనస్వామి -

కరుణారస రాగరాగిణుల -

మూర్ఛనల, శృతి లయల -

ఎల్లరి హృదయోల్లాసము ; ||  

=========================,

pakshiraaju mUpuna taapeegaa kuurcuni, 

wENawUducumDenu krishNamUriti ; 

gamDaBErumDamA! 

kudupulEmi lEkumDa - haDAwuDi paDakumDa ;

nemmadigaa saagawOyi,

nee gamanamu wEgapaDite -

nee muupuna kuurcuni unnADu -

wENugaanalOluDu ;

nuwwu gaani toTru paDitE -

muraLi kaasta  ulikipaDunu -

rasagaanamu kalatapaDunu ;

lOkamulanu - AnamdawaahinilO - 

OlalADimcE samgeetadhaara -, 

gamDipaDite UrukOmu -

amdukanE, wihagapatI, garuDA!

nimpaadigaa saagumOyi ;

garuDawaahanaswaami -

karuNArasa raagaraagiNula -

muurCanala, SRti layala -

ellari hRdayOllaasamu ; || 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; గరుడగమనం, కుదుపులు -114 ;;

మది సంగీతమందిరము -113

నీ పదపద్మముల మంజీర ధ్వని ;

మా హృదయాలను -

సంగీత మందిరముగ - సేయగా ; 

ఘల్లుఘల్లు - అడుగులతో - 

రావయ్యా క్రిష్ణయ్యా! ; || 

నీ, పదనఖముల కాంతులు ; 

తిమిరమునకు బహు హడలు ;

మిత్తి మెత్తినట్టి - 

పాద పద్మముల అచ్చులను ;

కవి కన్నుల అద్దుకొనగ -

రావయ్యా క్రిష్ణయ్యా ; || 

చతుర ప్రభలు, ప్రకాశముల ; 

లోకములకు ఒసగుచుండ -

అడుగులోన అడుగేస్తూ -

రావయ్యా క్రిష్ణయ్యా ; ||

======================= ,

nee padapadmamula mamjeera dhwani ;

maa, hRdayaalanu -

samgeeta mamdiramuga - sEyagaa ; 

ghallughallu - aDugulatO - 

raawayyaa krishNayyaa! ;

nee, padanakhamula kaamtulu ; 

timiramunaku bahu haDalu ;

mitti mettinaTTi - 

paada padmamula acculanu ;

kawi kannula addukonaga -

raawayyaa krishNayyaa ; || 

catura prabhalu, prakASamula ; 

lOkamulaku osagucumDa -

aDugulOna aDugEstU -

raawayyaa krishNayyaa ; ||

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  god krishna songs -  మది సంగీతమందిరము -113 ;

గాలితెమ్మెర భాగ్య ఘనత -112

 బృందావన వీచికా ; 

గోవర్ధన లహరికా ; 

మీదు  భాగ్యమే భాగ్యము ; ||  

క్రిష్ణమూర్తి వేణురవళి - 

మీదు వాహనమైనది, 

ఆహా, మీదు సౌభాగ్య గరిమను వర్ణించ -

కోటి జిహ్వలు, కావలయునులే, 

మలయ సమీరమా - 

శోభా శ్వాసికా, ఆశ్వాసికా! ; || 

మురళి గాన సమ్మోహన - 

లీలలను గ్రోలెడి ; 

రాధా వదన బింబ -

తన్మయ రసలాహిరి ; 

వీక్షించు భాగ్య గరిమను వర్ణించగా -

కోటి జిహ్వలు కావలయునులే, 

మలయ సమీరమా - 

గిరివాటికా శుభ లహరికా ;

నీదు భాగ్యమే భాగ్యము ;; ||

======================= 

 bRmdaawana weecikaa ; 

gOwardhana laharikaa ; 

meedu  BAgyamE BAgyamu ; ||  

krishNamuurti wENurawaLi - 

meedu waahanamainadi, 

AhA, mIdu sauBAgya garimanu warNimca -

kOTi jihwalu, kaawalayunulE, 

malaya sameeramaa - 

SOBaa SwaasikA, ASWAsikA! ; || 

muraLi gaana sammOhana - 

liilalanu grOleDi ; 

raadhaa wadana bimba -

tanmaya rasalaahiri ; 

wIkshimcu BAgya garimanu warNimcagA -

kOTi jihwalu kaawalayunulE, 

malaya sameeramaa - 

giriwATikA SuBa laharikA ;

nIdu BAgyamE BAgyamu ;; ||

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  god krishna songs -
prnt = గాలితెమ్మెర భాగ్య ఘనత- 112 ;- 

15, ఫిబ్రవరి 2023, బుధవారం

నెలపొడుపు దీపకాంతి - 111

 నెలపొడుపు కనుదోయిని - 

దివ్వెలుగా మలచెను ; 

కరుణాసాగరుడు - 

క్రిష్ణుడు వచ్చేదెపుడో!? ; ||

కడలి నీరు నల్లన - 

క్రిష్ణుడేమొ నల్లన ; 

చిలిపి క్రిష్ణు జాడలను ; 

కనుగొనేటి వీక్షణములు - రాధవి ;

తీక్ష్ణ నిరీక్షణా వీక్షణములు రాధవి ; ||

కలత పడే నెలతతోటి ; 

ఏలనయ్య? కృష్ణయ్యా! మేలమాడుట - 

తాను, కినుక నోము పట్టితేను, 

పస్తు ఉండవలిసేది ఎవరంట!? ఎవ్వరంట -

గమనంలో ఉంచుకోవయ్య, క్రిష్ణయ్యా! 

కాస్త - గుర్తు ఉంచుకోవయ్యా మా ముద్దుల స్వామీ! ; ||

===================== ,

nelapoDupu deepakaamti ;- 

nelapoDupu kanudOyini - 

diwwelugaa malacenu ; 

karuNAsaagaruDu - 

krishNuDu waccEdepuDO!? ; ||

kaDali neeru nallana - 

krishNuDEmo nallana ;  

cilipi krishNu jADalanu ; 

kanugonETi weekshaNamulu - raadhawi ;

tIkshNa nirIkshaNA wIkshaNamulu rAdhawi ; ||

kalata paDE nelatatOTi ; 

Elanayya? kRshNayyA! mElamADuTa - 

taanu, kinuka nOmu paTTitEnu, 

pastu umDawalisEdi ewaramTa!? ewwaramTa -

gamanamlO umcukOwayya, krishNayyaa! 

kAsta, gurtu umcukOwayya mA muddula swAmI! ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  god krishna songs - నెలపొడుపు దీపకాంతి - 111 ;

నందనందన, ఆనందమైత్రి - 110

గోవర్ధన గిరిధారీ, మురళీ గానవిలోలా! 

లాసనాట్య ప్రజ్ఞాశాలీ! గోవిందా! ;

భక్తుల మనసుల - ప్రపుల్లపరచు -

పద్మనాభ, పద్మాలయనాధా! ; || 

నందనందనా - ఆనంద మిత్రమా! ||

యశోద జననీ వత్సల, 

సకల జనుల వాత్సల్య పెన్నిధీ,

నందకిశోరా, సకల జన మానస సరోవరమ్ముల ;

పరిమళించు సహస్ర దళ నీలి పద్మమా! || 

నందగోపాలా! బృందావన సంచార మయూరీ!

తొలి కిరణముల వేకువ నీవే - 

మాకు - తొలి కిరణముల వేకువ నీవే - 

నులి వెచ్చని -

సౌభాగ్య కిరణ శుభ కాంతివి నీవే స్వామీ! ; ||

భక్తుల మనసుల - ప్రపుల్లపరచు -

పద్మనాభ, పద్మాలయనాధా -

గోవర్ధన గిరిధారీ, మురళీ గానవిలోలా! 

లాసనాట్య ప్రజ్ఞాశాలీ! గోవిందా! ;  ||

================================ ,

namdanamdana, Anamdamaitri ;-

gOwardhana giridhArI, muraLI gAnawilOlA! 

laasanATya prajnaaSAlI! gOwimdA! ;

bhaktula manasula - prapullaparacu -

padmanABa, padmAlayanAdhA! ; || 

namdanamdanaa - aanamda mitramA! ||

yaSOda jananI watsala, 

akala janula waatsalya pennidhee,

namdakiSOrA, sakala jana mAnasa sarOwarammula ;

parimaLimcu sahasra daLa neeli padmamA! || 

namdagOpAlA! bRmdaawana samcaara mayuuree!

toli kiraNamula wEkuwa nIwE -

mAku - toli kiraNamula wEkuwa nIwE -

nuli weccani -

sauBAgya kiraNa SuBa kaamtiwi neewE swAmI! 

||bhaktula manasula - prapullaparacu -

padmanABa, padmAlayanAdhA -

gOwardhana giridhArI, muraLI gAnawilOlA! 

laasanATya prajnaaSAlI! gOwimdA! ||

 God krishna songs - 110 - kusuma  




 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  god krishna songs - నందనందన, ఆనందమైత్రి - 110 ; 

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

నిశీధి రేయి విశాలనేత్రి - 109

 విశాలనేత్రి నిశీధి రేయిని,

వేచిఉన్నది క్రిష్ణా! ; ||

నీలి జలమ్ముల యమునా వాహిని ;

నీలాల కన్నుల రాధిక, 

వేచి వేచి వేచి వేసారుతు ఉన్నది -

నీలమోహనాంగా - నీ కోసమె కృష్ణా! ; ||

బేల రాధిక, కన్నుదోయి - 

సంపూర్ణ బాష్ప సరోవరమాయెను ;

మేలమాడకుము, ఈ తీరుగ నీవు - 

నీలమోహనస్వామీ, 

సారెసారెకు - ఇటుల -

ముగ్ధ అభిసారిక రాధికా రమణిని ;

వేధించకుమోయీ, వేగిరమే ఇటు -

          రావోయి రావోయి ; ||

=======================  , 

wiSAlanEtri niSIdhi rEyini,

wEciunnadi krishNA! ; ||

neeli jalammula yamunA wAhini ;

neelaala kannula raadhika, 

wEci wEciwEci wEsArutu unnadi -

neelamOhanaamgaa - nee kOsame kRshNA! ; ||

bEla raadhika, kannudOyi - 

sampuurNa baashpa sarOwaramaayenu ;

mElamADakumu, ee tIruga nIwu - 

nIlamOhanaswAmI, sAresAreku - iTula -

mugdha abhisArika  raadhikaa ramaNini ;

wEdhimcakumOyI, wEgiramE iTu -

          rAwOyi rAwOyi ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;   & 

నిశీధి రేయి విశాలనేత్రి - 109 ; god krishna songs - 109 ;

13, ఫిబ్రవరి 2023, సోమవారం

కవ్వం నాట్య నర్తనం - 108

కనుగొనగా, కన్నారా - కనువిందుల దృశ్యాలు ; 

వెన్నముద్ద గ్రోలగా, ఇదె వచ్చెను కన్నయ్య ;

శ్రీకృష్ణస్వామి శిశు రూపం అందరి నేత్రానందం ; || 

చిలుకుతోంది యశోదమ్మ, పాలు, పెరుగు నవనీతం

ముద్దు బాలక్రిష్ణునికి మోహనంపు ఇంపు చిరుతిండి ; 

వెన్నముద్ద గ్రోలగా, ఇదె వచ్చెను కన్నయ్య ; || 

1]  ధిమి ధిమి ధిమ్  తక తకిట - 

              ధిమ్ ధిమ్ ధిమ్ తకిట తకిట ;

దధి కుంభం లోన కవ్వమిదే ఆడుతున్నది - 

తధికిట తోమ్ -  తకిట  తకిట తద్ధిమి తోమ్ ;

మజ్జిగల తుంపురులు నేల పైన తొణికినవి ;

తొణికేటి తుంపురులతొ నేల నిండెను ;

చుక్కల ఆకాశమాయెనండీ ఈ భూమి ;

2] కుండలోన కవ్వమిదే ఆడుతున్నది - 

తధికిట తోమ్ తోమ్ - తళాంగు తోమ్ ; 

మీగడల పాలు, జతగ వేసేను జతి తాళం ;

తక్రం - జున్నుల కూటమి - 

           టప టప టప - టప టప టప  ; 

3] అంటినవి నీలి ఛాయ మేనునకు క్షీరబిందులు ;

దోగాడే కన్నయ్యకు ఒంటి నిండ తెల్ల పాల చుక్కలు

చుక్కల ఆకాశమాయెనండీ క్రిష్ణయ్య సొగసు రూపు ;

శ్రీకృష్ణస్వామి శిశు రూపం అందరి నేత్రానందం ; || 

 ;  =========================================  ; ,

kawwam nATya nartanam - 108 ;-

kanugonagaa, kannaaraa - kanuwimdula dRSyAlu ; 

wennamudda grOlagaa, ide waccenu kannayya ;

SreekRshNaswaami SiSu ruupam amdari nEtrAnamdam ; || 

yaSOdamma cilukutOmdi, pAlu perugu nawaneetam

muddu bAlakrishNuniki - mOhanampu impu cirutimDi 

wennamudda grOlagaa, ide waccenu kannayya ; || 

1] dhimi dhimi dhiమ్ taka takiTa - 

           dhimm dhimm dhimm taka takiTa ;

dadhi kumbham lOna kawwamidE ADutunnadi - 

tadhikiTa tOmm takiTa takiTa taddhimi tOmm ;

majjigala tumpurulu nEla paina toNikinawi ;

toNikETi tummurulato nEla nimDenu ;

cukkala aakaaSamaayenamDI I BUmi ;

2] kumDalOna kawwamidE ADutunnadi - 

tadhikiTa tOmm tOmm - taLAmgu tOmm ; 

meegaDala paalu, jataga wEsEnu jati tALam ;

takram - junnula kuuTami - 

Tapa TapaTapa - Tapa Tapa Tapa ; 

3] dOgADE kannayyaku omTi nimDa, 

                       tella paala cukkalu ;

amTinawi nIli CAya mEnunaku kshIrabimdulu ;

SrIkRshNaswAmi SiSurUpam amdari nEtrAnamdam ;||

; &   శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 108 ;  god krishna songs - 108 ;- కవ్వం నాట్య నర్తనం ;- 108 ;-