12, ఫిబ్రవరి 2023, ఆదివారం

తీపి జోలపాటలు - 107

 జోలమ్మ, జోలా - జోల జోలా!

ఉఌళ్ళ ఉఌళ్ళ ఉఌళ్ళ హాయీ,

లొల్లాయి లొల్లాయి లల్లరీ హాయి ; || 

తరుణులెల్లరు కలిసి,

జోల పాటల గమక రాగమ్ములందు -

ఉయ్యాలకింపైన తూగు కలిగేను ;

ఊయెలకు ఇంపైన ఊగు కలిగేను ; || 

చిరుగాలి గంధములు - గ్రంధములు అయ్యేను ; 

కావ్య, ఇతిహాస - గ్రంధములు అయ్యేను ; ||

మా బాలక్రిష్ణయ్య,

ఉంగ ఉంగాలు, చొంగల్లు, నురుగులు -  

ఉయ్యాల తొట్టెలో - సుధలు నిండేను ;  

పసిడి ఉయ్యాల తొట్టెలో - సుధలు నిండేను ;  || 

పట్టు పరుపులపైన పారిజాతాలు ; 

మెత్తని బంగారు ఉత్తరీయాలు ; 

పరిచి ఉంచిన డోల కనువిందు చేసేను ; 

చిన్నిక్రిష్ణమ్మకు, ఏల కునుకు వచ్చుట లేదు!? ; ||  

తరుణ తామరరేకు దళములను తెచ్చాము ;

ఒత్తుగా నింపాము - తామరసనయనుడా, 

జోల పాటల - జగతి - తూగుతున్నాది ;

వటపత్రశాయీ, సిరి పద్మనయనుడా!

చిలిపి అల్లరి మాని, ఒత్తిగిలవయ్యా ;

మా జోల పాటలకు - 

లయ తాళ గమకములను కూర్చి -

మాధురీ - సుక్షేత్రసీమలుగ మార్చేయుమోయీ! ; ||

=============================== , 

teepi jOlapATalu - 107 ;- 

jOlamma, jOlaa - jOla jOlaa!

uఌLLa uఌLLa uఌLLa haayee,

lollaayi lollaayi lallaree haayi ; || 

taruNulellaru kalisi,

jOla pATala gamaka raagammulamdu -

uyyaalakimpaina tuugu kaligEnu ;

Uyelaku impaina uugu kaligEnu ; || 

cirugaali gamdhamulu - gramdhamulu ayyEnu ; 

kaawya, itihaasa - gramdhamulu ayyEnu ; ||

maa baalakrishNayya,

umga umgaalu, comgallu, nurugulu -  

uyyaala toTTelO - sudhalu nimDEnu ;  

pasiDi uyyaala toTTelO - sudhalu nimDEnu ;  || 

paTTu parupulapaina paarijaataalu ; 

mettani bamgaaru uttareeyaalu ; 

parici umcina DOla kanuwimdu cEsEnu ; 

cinnikrishNammaku, Ela -

               kunuku waccuTa lEdu!? ; ||  

taruNa taamararEku daLamulanu teccaamu ;

ottugaa nimpaamu - taamarasanayanuDA, 

jOla pATala - jagati - tuugutunnaadi ;

waTapatraSAyI, siri padmanayanuDA!

cilipi allari maani, ottigilawayyaa ;

maa jOla pATalaku - 

laya tALa gamakamulanu kuurci -

maadhurI - 

sukshEtraseemaluga maarcEyumOyI! ; ||

ఌ ౡ ఌ ౡ ఌ ౡ - ఌ  ౡ - ఌ  ౡ - ఌ  ౡ  = 

& ; శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 107 ;-

 తీపి జోలపాటలు - 107 ; 

11, ఫిబ్రవరి 2023, శనివారం

కాస్త ఆగవమ్మ రాధికా 106

తళ తళ తళ - తళ తళ తళల -

చుక్కలన్ని నీ వెంట వస్తున్నవి ; 

ఆగవమ్మ  రాధికా, కాస్త ఆగవమ్మ రాధికా ; ||

ఝణ ఝణ ఝణ - ఝణ ఝన ;

ఝణన ఝణన వడ్డాణం మువ్వల ధ్వని ; 

నీ నవ్వులను అనుసరించు, చకోరాక్షి, జవరాలా!

కిణ కిణ కిణ - కిణ కిణ కిణ ;

కంకణాల మధుర ధ్వని - 

నీ చూపు తూపులందు తూగేను ; ||

గల గల గల - ఘల్ ఘల్ ఘల్ ; 

నీదు, పద మంజీరముల చేరు ;;

కిల కిల కిల - చలనములు ; 

నీదు పలుకులందు చేరుటకు తహతహలు ; || 

ఆగవమ్మ రాధికా, కాస్త ఆగవమ్మ రాధికా ;

క్రిష్ణ గాధల వస్త్రములకు - 

మెరుపు చాందినీ రిమఝిమలు -

నీవే కద, అందులకే - కాస్త ఆగవమ్మ రాధికా ; ||

===========================  ,

 kAsta Agawamma rAdhikA - 106 ;-

taLa taLa taLa - taLa taLa taLala -

cukkalanni nI wemTa wastunnawi ; 

Agawamma  rAdhikA,

 kAsta Agawamma rAdhikA ; ||

JaNa JaNa JaNa - JaNa Jana ;

JaNana JaNana waDDANam muwwala dhwani ; 

nee nawwulanu anusarimcu, 

cakOrAkshi, jawarAlA!

kiNa kiNa kiNa - kiNa kiNa kiNa ;

kamkaNAla madhura dhwani - 

nee cuupu tuupulamdu tUgEnu ; ||

gala gala gala - ghal ghal ghal ; 

nIdu, pada mamjeeramula cEru ;;

kila kila kila - calanamulu ; 

nIdu palukulamdu cEruTaku tahatahalu ; || 

Agawamma rAdhikA, kAsta Agawamma rAdhikA ;

krishNa gaadhala wastramulaku - 

merupu caamdinI rimajhimalu -

nIwE kada, amdulakE - kAsta Agawamma rAdhikA ; || 

 ;

 శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 106 ;

వనిత ఓర చూపుల ఘనత - 105

వనిత ఓర చూపుల ఘనత - 105 ;

పంతపు చూపుల బాణాలిచ్చి ; 

మన్మధ శరాళి, బలమును పొందెను ; 

తృటిలో ఇటుల, మారె ప్రపంచము, 

ఎటుల, ఎటులెటుల - 

ఈలాటి వింతలు తోచుట ఇటుల? ; ||  

బులిబులిగా మము, ఇటు కవ్వించి ; 

జిలిబిలి కవితల కావ్యాలెన్నో ; 

ముల్లోకములకు దండిగ ఇచ్చిన - 

నీ ఓర చూపులకు, మా అల్లరి క్రిష్ణునితో పాటు - 

మా జోహార్లును కోటిశతములు - 

గైకొనుమా రాధారమణీ,

లలితాంగి, కోమలీ ;  

మరకత ఛాయల మేను వాని - ఇష్టసఖీ!

కృష్ణుని ప్రియ మణీ ; ||

=================== ,

wanita Ora cuupula ghanata - 105 ;

pamtapu cuupula bANAlicci ; 

manmadha SaraaLi, balamunu pomdenu ; 

tRTilO iTula, mAre prapamcamu, 

eTula, eTuleTula - 

eelATi wimtalu tOcuTa iTula? ; ||  

bulibuligaa mamu, iTu kawwimci ; 

jilibili kawitala kaawyaalennO ; 

mullOkamulaku damDiga iccina - 

nee Ora cuupulaku, maa allari krishNunitO pATu - 

maa jOhaarlunu kOTiSatamulu - 

gaikonumaa raadhaaramaNI,

lalitaamgi, kOmalI ;  

marakata CAyala mEnu waani - ishTasaKI!

kRshNuni priya maNii ; ||

;

వనిత ఓర చూపుల ఘనత - 105 ; - శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 105 ;

రాధామురళి కృష్ణుని కేళి - 104

అనుకున్నానా!!?

ఎపుడైనా, ఇటుల అనుకున్నానా, 

గడసరి కృష్ణుడు ఇటుల -

మురిపించి - మైమరపించి ;

మరుపున మురళిని ఉంచునని ; 

ఈ "రాధామురళి"ని ఉంచునని ; || 

తోటకు పరిమళ భాషను నేర్పెను ; 

తరువు, లతలకు - విరివిగ ఇచ్చెను ;

మకరంద లేపన, సుమ భూషణములు ;  || 

మధు పరాగము లెన్నో ఇచ్చీ, 

సుధా సంద్రముల పయనించుమనె ;

నగవులు చిందే స్వామి లీలలను -

ప్రీతిని అర్చన చేయు రాధకు -

విస్తృతమ్ముగా తెలియవని .... , 

తెలియని స్వామి - తాను కాడులే - 

రాధకు - యావత్తు -

గాధలు, ఇతివృత్తమ్ములు -

బోధించును - తానే -

 గీత కృష్ణుడు - సంగీత క్రిష్ణుడు ;  ||

============================== ;

 rAdhAmuraLi, kRshNuni kELi  ;- song  - 104 ;- 

anukunnaanaa!!?

epuDainaa, iTula anukunnaanaa, 

gaDasari kRshNuDu iTula -

muripimci - maimarapimci ;

marupuna muraLini umcunani ; 

ee "raadhaamuraLi"ni umcunani ; ||

tOTaku parimaLa BAshanu nErpenu ; 

taruwu, latalaku - wiriwiga iccenu ;

makaramda lEpana, suma BUshaNamulu ;  || 

madhu paraagamu lennO iccii, 

sudhaa samdramula payanimcumane ;

nagawulu cimdE swAmi leelalanu -

priitini arcana cEyu raadhaku -

wistRtammugaa teliyawani .... , 

teliyani swaami - taanu kADulE -

rAdhaku - yAwattu -

gaadhalu, itiwRttammulu -

bOdhimcunu - taanE -

geeta kRshNuDu - samgeeta krishNuDu ;

 & - శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 104 ;

7, ఫిబ్రవరి 2023, మంగళవారం

అభిసారిక రాధిక - 103

శుక శారికలకు అవకాశం, భళీ అవకాశం ;

దొరికెను ఇపుడే, భలేభలే అవకాశం ; 

అభిసారిక రాధిక - వేచి వేచి, వేసారిపోవడం ; ||

చిలిపి కృష్ణుని కోసం రాధిక -

వేచి వేచి వేసారిపోవుచుండగా -

మైనా, గోరువంకలు, పిట్టలు -

ఎగతాళి చేయుచూ మేలమాడుతూ, నవ్వుతున్నవి ;

సారె సారెకూ - రాధిక ఎదురుచూపులు -

మోహన వేణు గానలోలుని కోసము ; ||

నీలమోహనుడు ఉండలేడులే - 

`ముగ్ధ రాధిక భావన` లేక ;

పల్లవి లేని చరణము వోలె -

కృష్ణుడు ఏడను తాను ఉండలేడులే,

తెలుసుకోండి విహంగములారా!

చాలు చాలు మీ హంగామాలు ;

చాలించండి, గీరల హంగులు ;

రాధాఋష్ణుల పదమంజీరముల -

మంజుల ధ్వనులలొ -

మృదు గీతములై, లీనము కండి ;

సంగీత గాధల - లీలాకృష్ణుని -

వినుతి గాధల లీనమవండి ; ||

======================== ,

aBisArika rAdhika ;- song - 103 ;-

Suka SArikalaku awakASam, BaLI awakASam ;

dorikenu ipuDE, BalEBalE awakASam ; 

aBisArika rAdhika - 

wEci wEci, wEsAripOwaDam ;

cilipi kRshNuni kOsam - 

wEci wEci wEsAripOwucumDagaa -

mainaa, gOruwamkalu, piTTalu -

egatALi cEyucU mElamADutuu, nawwutunnawi ;

sAre saarekuu - raadhika edurucuupulu -

mOhana wENu gaanalOluni kOsamu ; ||

neelamOhanuDu umDalEDulE - 

'mugdha raadhika - BAwana' lEka ;

pallawi lEni caraNamu wOle -

kRshNuDu EDanu taanu umDalEDulE,

telusukOMDi wihamgamulArA!

caalu caalu mee hamgaamaalu ;

caalimcamDi, geerala hamgulu ;

raadhARshNula padamamjIramula -

mamjula dhwanulalo -

mRdu geetamulai, leenamu kamDi ;

samgeeta gaadhala - leelAkRshNuni -

winuti gaadhala leenamawamDi ; || ;

Song krishna radha 103 

అభిసారిక రాధిక ;- 103 ;- శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; ఫిబ్రవరి 2023 ; 




అసురులు = మద్యాన్ని ముట్టుకోని వారు

1. ఇందూ* = రావణుడు తన ఆత్మశక్తిని నిక్షేపించి ఉంచిన సముద్ర  = -> 

*హిందూమహాసాగరము ; ప్రాంతం పేరు ;

2. సురులు = మద్యాన్ని తాగేవారు &

అసురులు = మద్యాన్ని తాకని వారు ;;   

=============================== , 

1. imduu* = raawaNuDu tana aatmaSaktini nikshEpimci umcina samudra  = 

* -> himduumahaasaagaramu ; praamtam pEru ;

2. surulu = madyaanni taagEwaaru &

asurulu = madyaanni taakani waaru ;  

*********************************** ,

Links ;- 1]   రావణబ్రహ్మ ద్రావిడ బ్రాహ్మణసంఘం ;

words world ;- అసురులు = మద్యాన్ని ముట్టుకోని వారు ; intoxicating drink" ;

31, జనవరి 2023, మంగళవారం

రాధిక మేలిమి పూజలు - 102

మేలిమి పూజలు రాధికవి ;- 

పూర్వ పుణ్యములు అపూర్వము ; 

పునఃసమీక్షలు అపురూపములు ; ||  

ధనము, ధాన్యము - ధ్యానమెలే ; 

స్వామియె మానస తేజములే ; 

తేజో లోకపు ఏలికకు ; 

మేలిమి పూజలు రాధవిలే ; 

ఈ రాధికవే ; || 

తన్మయ అవస్థ తానే అయీ ; 

తురీయ వాహిని తానాలాడే ; 

గరిమ నిధిగ భాసిల్లేను ; 

కువలయ వదన, మోహన రాధిక ; ||

భజన శ్రావ్యత కురిపించి ;; మనోరంజనిగ - 

జన్మ గుబాళించుట సుకృతమే -

భక్తి మరంద మనోరంజనిగ -

తన జన్మ గుబాళించుట -

తన పూర్వ సుకృతమే అని ; 

మరి మరి తలచే రాధికవి ; 

మేలిమి పూజలు నిశ్శంసయముగ ; ||

============================ ,

raadhika mElimi puujalu - 102 ;- 

puurwa puNyamulu apuurwamu ; 

puna@hsameekshalu apuruupamulu ; ||  

dhanamu, dhaanyamu - dhyaanamelE ; 

swaamiye maanasa tEjamulE ; 

tEjO lOkapu Elikaku ; 

mElimi pUjalu rAdhawilE ; 

ee raadhikawE ; || 

tanmaya awastha tAnE ayee ; 

tureeya wAhini tAnAlADE ; 

garima nidhiga BAsillEnu ; 

kuwalaya wadana, mOhana raadhika ; ||

bhajana Sraawyata kuripimci ; manOramjaniga - 

janma gubALimcuTa sukRtamE -

bhakti maramda manOramjaniga -

tana janma gubALimcuTa -

tana puurwa sukRtamE ani ; 

mari mari talacE rAdhikawi ; 

mElimi pUjalu niSSamsayamuga ; ||

102 God songs  ; 




[ ఫిబ్రవరి, బుధవారం, 1-2-2023 ] ;