24, జులై 2022, ఆదివారం

మృదు హృదయిని రాధిక - 85

నవనీతామృత మృదు హృదయిని, రాధిక ; 

అబ్ధి తరంగము లెగయుచున్నవి ; 

క్షీరాబ్ధి తరంగము లెగయుచున్నవి ; || 

దేవకినందనుడట అతడు ; 

నగరిని చేరి, తనను మరిచెనేమో తనను ;

విధి విలాసమా, ఇది ఏమి!? ; || 

అదిగదిగొ, అల్లదిగో, 

పిల్లంగ్రోవీ నుండి చల్లని పాటలు ; 

కృష్ణ గోవిందుడెపుడూ, భక్తసులభుండే ; 

ఎప్పుడూ తాను భక్తసులభుడే ; 

గాలిదూతల ద్వారా మనకై పంపుచుండును, 

మురళీరవళుల అమూల్య సుధలను ; 

తెలిసింది కద ఊసు, మిత్రులారా, 

కేకి, ధేనువులార, యమునా ఝరిలోని -

జలతరంగాల్లార, ఓ నేస్తమ్ముల్లారా ; || 

=================== ,

mRdu hRdayini, raadhika - song - 85 ;

nawaneetaamRta mRdu hRdayini, raadhika ; 

abdhi taramgamu legayucunnawi ; 

ksheeraabdhi taramgamu legayucunnawi ; || 

dEwakinamdanuDaTa ataDu ; 

nagarini cEri, tananu maricenEmO tananu ;

widhi wilAsamaa, idi Emi!? ; || 

adigadigo, alladigO, 

pillamgrOwee numDi callani pATalu ; 

kRshNa gOwimduDepuDU, bhaktasulabhumDE ; 

eppuDU taanu bhaktasulabhuDE ; 

gaaliduutala dwaaraa manakai pampucumDunu, 

muraLeerawaLula amuulya sudhalanu ; 

telisindi kada uusu, mitrulaarA, 

kEki, dhEnuwulaara, yamunaa jharilOni -

jalataramgaallAra, O nEstammullaarA ; ||

&

song - 85 ; రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక  ; ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి