రాగాల చినుకులలొ, తడిసేను రాధమ్మ ;
తనిసేను, తరిసేను - తనకు తానే అయ్యి,
అయ్యారె, తన్మయి ..... , ||
తనలో తానయ్యి, తన లోలోన తానే -
క్రిష్ణతత్వమ్మయి,
పెను మాయ ఇది ఏమొ - పెనవేసుకొనిపోవు ;
సిరి హాయి, అయ్యారె, తన్మయి ; ||
ఎంచితే సుమవనిని పూ పరిమళమ్ముల ;
తన శ్వాస లిపి ఎల్ల - మధు కావ్య గ్రంధాలు ;
అయ్యారె, తన్మయి ; ||
శ్రీతల్పమే అయి, త్రుళ్ళింతల అవని -
శేషశాయికి పాన్పు వేరేల? - అన్నది ;
భూదేవి హక్కు అది - మున్నె తన అర్ధాంగి ;
గోవిందుని పత్ని హఠమెల్ల రాధకు -
నవ్వు పుట్టించేను, ఏమాయెనో ఏమొ,
అయ్యారె, తన్మయి ; ||
============== ,
ayyAre, tanmayi ;- song 84 ;-
raagaala cinukulalo, taDisEnu rAdhamma ;
tanisEnu, tarisEnu - tanaku taanE ayyi,
ayyAre, tanmayi ..... , ||
tanalO tAnayyi, tana lOlOna taanE -
krishNatatwammayi,
penu maaya idi Emo - penawEsukonipOwu ;
siri haayi, ayyAre, tanmayi ; ||
emcitE sumawanini puu parimaLammula ;
tana Swaasa lipi ella - madhu kaawya gramdhaalu ;
ayyAre, tanmayi ; ||
SreetalpamE ayi, truLLimtala awani -
SEshaSAyiki paan pu wErEla? - annadi ;
BUdEwi hakku adi - munne tana ardhaamgi ;
gOwimduni patni haThamella raadhaku -
nawwu puTTimcEnu, EmaayenO Emo,
ayyAre, tanmayi ; ||
&
అయ్యారె, తన్మయి ;- song = 84 ;- రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి