కొంటెతనమేలనే, ఓ కొండగాలి,
సంగీత మధు స్వరార్ణవములను కోరి,
మురళిలోన దూరి, కితకితలు పెట్టకు ; ||
గారాల రాగాల చిలికేను వేణువు ;
చిన్నిదమ్మా, ఈ చిట్టి పిల్లనగ్రోవి ;
అలసట చెందును, అలసత్వమేలనే ;
చిలిపి చిరుగాలి, చాలు చాలు,
మురళిలోన దూరి, కితకితలు పెట్టకు ;
సుంత విశ్రాంతిని ఈయమ్మ, చిరుగాలి ;
అలసేను ఈ మురళి,
అలయును క్రిష్ణయ్య చిరు వేళ్ళు,
చిన్నారి మా ముద్దు కృష్ణుని -
లేలేత చివురుల చిటి వ్రేళ్ళమ్మా ;
చాలమ్మ చాలును, నీ దుడుకుతనములు,
శీతలతలముల ఓ శీతగాలి ; ||
==================== ,
komDagaali komTetanamu ;- song - 83 ;-
komDagaali komTetanamu ;- song - 83 ;-
komTetanamElanE, O komDagaali,
samgeeta madhu swaraarNawamulanu kOri,
muraLilOna duuri, kitakitalu peTTaku ; ||
gaaraala raagaala cilikEnu wENuwu ;
cinnidammaa, ee ciTTi pillanagrOwi ;
alasaTa cemdunu, alasatwamElanE,
cilipi cirugaali, caalu caalu,
muraLilOna duuri, kitakitalu peTTaku ;
sumta wiSraamtini eeyamma, cirugaali ;
alasEnu ee muraLi,
alayunu krishNayya ciru wELLu,
cinnaari maa muddu kRshNuni -
lElEta ciwurula ciTi wrELLammaa ;
caalamma caalunu, nI duDukutanamulu,
SItalatalamula O SItagaali ; ||
&
కొండగాలి కొంటెతనము - song - 83 ; రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి