20, ఏప్రిల్ 2025, ఆదివారం

శతావరి- కల్ప తరు - 2

నారాణా జ్జాతా నారాయణీ

              నారాయణుని వలన పుట్టినది ;

శతమూలీ బహు సుతా భీరు రింద్రీ వరీ వరీ|

ఋశ్యప్రోక్తా భీరుపత్రీ నారాయణ్య శ్శతారీ, - అహేః|| 100  -

SlO.  Satamuulee bahu sutaa BIru rindree waree waree|

         RSyaprOktaa BIrupatrI naaraayaNya SSatAvarI, - ahE@h||   = amarakOSam ;; 

[ అమరకోశం ;; శ్లోకం100 ;- వనౌషధి వర్గం - ద్వితీయ కాండం ]

SlOkam - 100 ;🎋amarakOSam = 289 ;

వివరణ ;-  1. శతం బహూని మూలాన్యస్యా శ్శతమూలీ = 

అనేకములైన వేళ్ళు కలిగినది ; 

2] మూలాయస్యాః బహుసుతా = same భావార్ధం;

& న భీరు@ అభీరుః = స్థిరమైన ఆకులు కలది - కనుక వెఱపు లేనిది ;; 

3] ఉత్పలాభ పత్రత్వాత్ ఇందీవరీ = నల్ల కలువ వంటి పూలు కలది ;; 

4] భువం మూలై ర్వృణోతీత్త్ వరీ = 

వేళ్ళ చేత భూమిని కప్పునది ; 

5] ఋశ్య్యైః ప్తోక్తా - - పా. ఋష్య ప్రోక్తా 

= 👅*వ్యాఘ్ర శత్రువు - ఈ తరువు - 

కనుక మృగములు దీనిని ఆశ్రయించును ; 

6] అభీరుణీ దృఢత్వేన భయరహితేన 

                  పత్రాణ్యస్యాః అభీరు పత్రీ - 

సీ. దృఢమైనది - కనుక వాయువు చేత భయం లేని ఆకులు కలది ;;

7] నారాణా జ్జాతా నారాయణీ = 

                  నారాయణుని వలన పుట్టినది ;;

8]  శతమూలైర్భువం ఆవృణోతీతి - శతావరీ =

సీ. వృఙ్ వరుణే = అనేకములైన వేళ్ళ చేత భూమిని ఆవరించునది ; 

9] న హినో తీత్య హేరుః ;

సీ. హి గతౌ వృద్ధౌచ = పోవనిది - 

పా. అహీరుః ;; 

ఈ పది పేర్లు కలిగినది - పిల్ల పిచ్చర వేళ్ళు - చల్లగడ్డ ;;

`Asparagus racemosus `  - 

@@@@@@ ;

నారాయణ మొక్క ;- శతావరి - నూరు వరములతో సమాన ఉపయోగం కలది - 

ఆధునిక పోకడలు - ప్రకృతి విధ్వంసం - వలన - 

రక్షిత జాబితాలోనికి చేరింది శతావరి - నారాయణి చెట్టు.

హర్యానా రాష్ట్రంలో - శతావర్ వాటిక హెర్బల్ పార్క్" ను -  

నెలకొల్పారు. 120 ఎకరములలో నిర్మించిన ఈ park కి -

శతావరి మూలిక -  పేరును పెట్టారు - అంటే 

దీని ప్రాముఖ్యత అర్ధం ఔతున్నది కదా! 

& చల్ల, చల్ల గడ్డలు - ఎర్రవాళ్ళుడు తీగ = 

ఇతర names - 1] తమిళం ; tanneer vittan kilangu ; 

                        தண்ணீர்விட்டான் கிழங்கு ; 

2] హిందీ ;- హిందీ ;-  అధర్‌వేల్ - బోఝిధన్ - ఝిర్నా - 

           మూస్లీ - నర్‌కంట్ - సదాబొరీ = 

                अधरवेल / बोझिदान/ झिरना / मूसली / नरकंट/ सदाबोरी/ 

శతావరి - తియ్యగా [sweet, less bitter] , కొంచెం చేదుగా మిశ్రమ రుచి కలిగి ఉన్నది.

2] వాజీకరణ ప్రక్రియ ; బిడ్డలకు తల్లి పాలు మిక్కుటం అగుటకు 

used in ఆయుర్వేదం ;- herb belongs to the family Liliaceae 

and grows throughout Nepal, Sri Lanka, India, and the Himalayas. 

Sanskrit names Shataveerya (It is highly potent), Bahusutha 

(It nourishes many children by promoting lactation), and Atirasa. 

The roots of this herb are rich in medicinal properties 

and are regularly used in the preparation of ayurvedic medicines.

Shatavar Vatika Herbal Park, Hisar, Haryana ;  

==================, 

 nArAyaNAjjAtA naarAyaNI = naaraayaNuni walana puTTinadi ;- 

SlO.  Satamuulee bahu sutaa BIru rindree waree waree|

         RSyaprOktaa BIrupatrI naaraayaNya SSatArI, - ahE@h||   = amarakOSam ;; 

1. Satam bahuuni muulaanyasyaa SSatamuulee = 

anEkamulaina wELLu kaliginadi ; 2] muulaayasyA@h bahusutaa = `same` ;

& na BIru@ aBIru@h = sthiramaina aakulu kaladi - kanuka we~rapu lEnidi ;; 

3] utpalABa patratwAt imdiiwaree = nalla kaluwa wamTi pUlu kaladi ;; 4] bhuwam muulai rwRNOteett warii = wELLa cEta BUmini kappunadi ; 5] RSyyai@h ptOktA - - paa. RShya prOktaa 

= *wyAGra Satruwu - ee taruwu - kanuka mRgamulu deenini ASrayimcunu ; 

6] aBIruNI dRDhatwEna bhayarahitEna patraaNyasyA@h aBIru patree - see. dRDhamainadi - kanuka waayuwu cEta bhayam lEni aakulu kaladi ;;

7] nArAyaNAjjAtA naarAyaNI = naaraayaNuni walana puTTinadi ;;

8]  Satamuulairbhuwam aawRNOtIti - SatAwarI =

sii. wR~m waruNE = anEkamulaina wELLa cEta BUmini aawarimcunadi ; 

9] na hinO teetya hEru@h ;

see. hi gatau wRddhauca = pOwanidi - 

paa. aheeru@h ;; & ee padi pErlu kaliginadi - pilla piccara wELLu - callagaDDa ;; 

🥖పిల్ల పిచ్చర వేళ్ళు - చల్లగడ్డ ;- `Asparagaus racemosus ` 

శతావరి- కల్ప తరు - 22 ] -  link= Shatavar Vatika Herbal Park, Hisar, Haryana ;

 https://www.youtube.com/watch?v=r0B07pIwpz8 ; 

shathavari plant 








&

prev post = 1, ఏప్రిల్ 2025, మంగళవారం =  దిరిసెన పట్ట - కల్ప తరు - 1  ; 

1, ఏప్రిల్ 2025, మంగళవారం

దిరిసెన పట్ట - కల్ప తరు - 1

💦🥥 పంచ శైరీషికము ;- దిరిసెన పట్ట ;- వేరు, పూవు, ఆకు, కాయ ;; 

🏵️🏵️  ;  పంచ వల్కలములు ;- మఱ్ఱి, జువ్వి, రావి, మేడి, ఆమ్ల వేతసము ;; 

🌷🌺; పిప్పలీ ద్వయ ;- 1] పిప్పలి ; 2] గజ పిప్పలి ;

🌷🌺; బ్రహ్మ సప్తకము ;- 1. అత్రి, 2. అంగిరస, 3. మరీచి, 

           4. క్రతువు, 5. పులస్త్యుడు, 6. పులహుడు ;;  7.  వశిష్ఠుడు ;; 

 ===============. 

🏵️🏵️pamca Saireeshikamu ;- dirisena paTTa ;- wEru, puuwu, aaku, kaaya ;; 

🏵️🏵️  ;  pamca walkalamulu ;- ma~r~ri, juwwi, raawi, mEDi, Amm la wEtasamu ;; 

🌷🌺 ; pippalee dwaya ;- 1] pippali ; 2] gaja pippali ;;  

🌷🌺; brahma saptakamu ;- 1. atri, 2. amgirasa, 3. mareeci, 4. kratuwu, 

                    5. pulastyuDu, 6. pulahuDu ;;  7.  waSishThuDu ; 

widyaardhi kalpa taruwu ;- paariBAshika padaalu ;;

 విద్యార్ధి కల్ప తరువు ;- పేజీలు = 60 ;- పారిభాషిక పదాలు ;- 

కల్ప తరు = Link ;

12, మార్చి 2025, బుధవారం

గోదా దేవి - రాధిక ;- 182

 సుమరాణి రమణి రాధిక -

   ఊహలు...... - ఊసులెన్నొ చేరేను -

       క్రిష్ణయ్య సన్నిధిని ; ||

కదలి కదలి కదలి 

   "కడలి ఒడి"ని చేరేను - 

    వాహినీ జలనిధి ;

తరచి తరచి తరచి -

   ఊసులెన్నొ చేరేను -

    కన్నయ్య సన్నిధిని ......  

సుమరాణి రమణి రాధికా -

   ఊహల ఊసులెన్నొ చేరేను -

       కన్నయ్య సన్నిధిని ; ||

మబ్బు మబ్బు కదలికలు,

  చేరువలు, చేరికలు ……,

    మెరుపు బృంద సృజనలెగసె ; ||

తెలి కిరణం - తెలివిడి లో-

    హరివిల్లులు మొలిచెనులే,

      సప్తవర్ణ హరివిలులు విరిసెనులే ;

పూవుబోణి రాధికా

  భావనల అందములు -

      కృష్ణ మురళి గానసీమ -

చేరుతున్న సందడి ఇది ;

ఆహా, ఆహాహా!

 గోదా దేవికి - స్వీకృత 

   స్వర్ణ కలశ సుధలు ఇవి ; ||

[గోదా దేవి -  రాధిక -  ]

============================= , 

sumarANi ramaNi raadhika -

   Uhalu, uusulenno cErEnu -

       krishNayya sannidhini ; ||

kadali kadali kadali 

   kaDali oDini cErEnu - 

    waahinee jalanidhi ;

taraci taraci taraci -

   uusulenno cErEnu -

    kannayya sannidhini ......  

sumarANi ramaNi raadhikaa -

   Uhala uusulenno cErEnu -

       kannayya sannidhini ; ||

mabbu mabbu kadalikalu,

  cEruwalu, cErikalu ……,

    merupu bRmda sRjanalegase ; ||

teli kiraNam - teliwiDi lO-

    hariwillulu molicenulE,

      saptawarNa hariwilulu wirisenulE ;

puuwubONi raadhikaa

  BAwanala amdamulu -

      kRshNa muraLi gaanaseema -

cErutunna samdaDi idi ;

AhA, AhAhA!

 gOdaa dEwiki - sweekRta 

   swarNa kalaSa sudhalu iwi ; || 

&

గోదా దేవి -  రాధిక ;- 182 ; 

krishna geetha 182 song 


4, ఫిబ్రవరి 2024, ఆదివారం

వసంత హేల - 181

వ్రేపల్లెలొ వసంతముల ఆట సాగుచున్నది ;

అనంతముల దాకా - 

మృదు వసంతాల హేలలులే ; ||

జానపదులు గుమిగూడిరి ;

దధి భాండం క్రీడలకు -

కొత్త ఊపు వచ్చినది ; ||

రేపల్లెలోన ప్రతి అడుగు నాట్యమాయె -

రేపల్లియ ప్రతి పదమూ - పాట ఆయె ;

పల్లీయుల మోదములలొ -

మేదిని హృది పుష్పాంజలి ;

ఉట్టికుండ ఆటలు మొదలైనవి -

ఏడీ మన కృష్ణుడు?,

ఏదీ, ఎచట - మా రాధిక?

అదిగదిగో - వచ్చేరు,

ఇక గడియ గడియకూ -

చైతన్య హేల, సంబరములు ; ||

========================== ,

wrEpallelo wasamtamula ATa sAgucunnadi ;

anamtamula daakaa - mRdu wasamtaala hElalulE ; ||

jaanapadulu gumigUDiri ;

dadhi BAmDam krIDalaku -

kotta uupu waccinadi ; ||

rEpallelOna prati aDugu nATyamAye -

rEpalliya prati padamuu - pATa aaye ;

palleeyula mOdamulalo -

mEdini hRdi pushpaamjali ;

uTTikumDa ATalu modalainawi -

EDI mana kRshNuDu?,

Edee, ecaTa - maa rAdhika?

adigadigO - waccEru,

ika gaDiya gaDiyakuu -

caitanya hEla, sambaramulu ; ||

&     &    శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -181  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు  ;  

radha krishna - 180 start 


3, ఫిబ్రవరి 2024, శనివారం

చెంగల్వ మొగ్గలు - 180

బృందావనికే సాధ్యం, ;

ఈ ముద్దూముచ్చటల

సాంప్రదాయ చమత్కృతులు ; ||

విరితోట అవుతున్నది -

క్రిష్ణ మురళి రవళిగా,

రాధాక్రిష్ణ మురళి రవళిగా ; ||

కన్నయ్య మెడలోని -

చెంగల్వల మొగ్గలలో,

విప్పారిన మొగ్గలలో -

ముగ్ధ రాధ లేతసిగ్గు -

మొగ్గలేయుచున్నది ||

ప్రణయ జంటలకు వలువలు ;

పుప్పొడుల జల్లుల -

దుస్తుల బహూకృతులు ; ||

================== ,

bRmdaawanikE saadhyam, ;

ee mudduumuccaTala

saampradaaya camatkRtulu ; ||

wiritOTa awutunnadi -

krishNa muraLi rawaLigA,

raadhaakrishNa muraLi rawaLigA ; ||

kannayya meDalOni -

cemgalwala moggalalO,

wippaarina moggalalO -

mugdha raadha lEtasiggu -

moggalEyucunnadi ||

praNaya jamTalaku waluwalu ;

puppoDula jallula -

dustula bahuukRtulu ; || 

=======================  ,

  &    శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -180  =  చెంగల్వ మొగ్గలు  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు  ;  

మధురాగిణి - 179

మదనదేవుడు వచ్చెను ,
యమున రేవు వద్దకు ;
పత్ని రతి - కోరికను తీర్చగా ; ||
మధురాగిణి, స్వచ్ఛ స్ఫటిక -
ప్రణయమెటుల ఉండుననీ -
రతీదేవి సందేహం -
తీర్చుటకే - మన్మధుడు -
యమున కడకు అరుదెంచెను ; ||
అరుదైనది ఈ దృశ్యం -
అపురూపం ఈ దృశ్యం -
సుతిమెత్తని మల్లియలకు -
సురభిళములు అదనముగా -
సమకూరిన లగ్నమిదియె -
తటిల్లతల సుకుమారం -
రాధ సరళి కారణమ్ము ; ||
========================= ;
madanadEwuDu waccenu ,
yamuna rEwu waddaku ;
patni rati - kOrikanu teercagaa ; ||
madhuraagiNi, swacCa sphaTika
praNayameTula umDunanee -
ratiidEwi samdEham -
teercuTakE manmadhuDu -
yamuna kaDaku arudemcenu ; ||
arudainadi - ee dRSyam -
apuruupam ee dRSyam -
sutimettani malliyalaku -
surabhiLamulu adanamugaa -
samakuurina lagnamidiye -
taTillatala sukumaaram -
raadha saraLi kaaraNammu ; ||
**************************************,
 &    శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -179  =   శోభకృత్ రాధాకృష్ణ గీతాలు  ; 

సరళీ స్వర ప్రకృతి - 178

నిఖిల మానవాళి -
మనో ప్రణయ భావ రమ్య -
ప్రతిబింబిత సౌహార్ద్ర బింబ -
ప్రకృతి విరళ సరళి ఈమె ;
||రాధిక - ఇది రాధిక - మన రాధిక ; ||
సారస్వత సమ్మోహిని ;
విస్ఫారిత నీలి నళిని -
ప్రేమార్ధం సాకారిణి -
నిర్వచన క్రమ పదాళి -
రంగేళీ సుస్థాపిత -
||రాధిక - ఇది రాధిక - మన రాధిక||
శ్రీకృష్ణ వేణు గానాంజలి,
పారిజాత సుమదళ ప్రభ -
సౌరభముల శుభవల్లరి ;
మురళిరవళి గమకార్పిత -
మృదు అల్లిక -
||రాధిక - ఇది రాధిక - మన రాధిక ||
=========================== ,
nikhila maanawALi -
manO praNaya BAwa ramya -
pratibimbita sauhaardra bimba -
prakRti wiraLa saraLi eeme ;
||rAdhika - idi rAdhika - mana rAdhika ; ||
saaraswata sammOhini ;
wisphaarita neeli naLini -
prEmaardham saakaariNi -
nirwacana krama padaaLi -
ramgELI susthaapita -
||rAhika - idi rAdhika - mana rAdhika||
SrIkRshNa wENu gAnAmjali,
pArijaata sumadaLa prabha -
sauraBhamula SuBawallari ;
muraLirawaLi gamakaarpita -
mRdu allika -
||rAdhika - idi raadhika - mana rAdhika ||
=======================  ,
  &    శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -178  =   శోభకృత్ రాధాకృష్ణ గీతాలు  ;