19, జూన్ 2022, ఆదివారం

రాధ మృదుభాషణము - 71

సుధా మధురము, మృదుభాషణము ;

రాధ మృదుభాషణము ; ||

శీతల సౌరభ పారిజాతము, 

తరళ సుమదళం, లావణ్యం ;

రాధ మృదుభాషణము ;

సుధా మధురము ; ||

పన్నీరాయెను, ప్రతి అణువు ;

ప్రకృతిలోని ప్రతి అణువు ;

కమ్మని తావుల పన్నీరాయెను ; 

మువ్వల సవ్వడి కప్పుర ఘుమఘుమ ;

ఉల్లసిల్లును రాధిక డెందము ;

నీ రాధిక డెందము ;

భావుక జనకా, శ్రీక్రిష్ణా, 

నీ నాట్య, గీతికలు 

నవమి పున్నమి వెన్నెల నెలవులయా! ; ||

======================== ;

sudhaa madhuramu, mRdubhaashaNamu ;

raadha mRdubhaashaNamu ; ||

SItala saurabha paarijaatamu, 

taraLa sumadaLam, laawaNyam ;

rAdha mRdubhaashaNamu ;

sudhaa madhuramu ; ||

panneeraayenu, prati aNuwu ;

prakRtilOni prati aNuwu ;

kammani taawula panneeraayenu ; 

muwwala sawwaDi kappura ghumaghuma ;

ullasillunu raadhika Demdamu ;

nee raadhika Demdamu ;

bhaawuka janakA, SrIkrishNaa, 

nee naaTya, geetikalu 

nawami punnami wennela nelawulayA! ; || 

;

శుభకృత్ సుమ గీత మాలిక - 71 ; రచయి3 = కుసుమ ; 

11, జూన్ 2022, శనివారం

మురళీ మృదు సంగీతం, జగతి పావనం - 70

వెన్న లాంటి మనసు కదా, కన్నయ్యది ; 

సకల జనుల హృదయ పద్మ పీఠమ్ముల ; 

అధివసించ గలిగినాడు, అందుకనే ; || 

ఇందువదనుడు కృష్ణుడు - ఎందు దాగెను ... , 

అనుచు, సైకత తీరమ్ముల వెంట -

అందందున, అంతటా, అన్వేషణ సాగుతోంది ;

అనుపల్లవి ;- 

ఆహా, ఈ హడావుడిలు - ఆహాహా, మోహనం ;

లతల పూల తేనియల మధుర మోహనం ;

మురళీ మృదు సంగీతం, జగతి పావనం ; ||

కనులముందు జార్చినది, హేమంత యువతి హిమ యవనిక; 

తమ కనులముందు జార్చినది, హేమంత యువతి హిమ యవనిక

డిల్లా పడి గోపికలు, డీలా పడె రాధిక ; ||

నీలమోహనాంగుడు ఎక్కడ!? - ఎక్కడ, ఎక్కడ, ఎక్కడెక్కడ!?

ఏ పొదరింటిలోన నక్కినాడొ!? ; గోపీ జనమందరికీ ; 

అవధి లేని తొందరలు, ఆపలేని గవేషణలు ; || 

ఇందు అందు, అందు ఇందు - ముందు వెనుక వెనుక ముందు - 

ఎందెందున దాగినాడొ, నవనీత చోరుడు, 

ఇందరితో పరుగులు, పెట్టించే తుంటరి ; || 

వెన్నదొంగ వెనువెంటనె మోగించెను వేణువును ; 

జన వాహిని వెన్ను తట్టి రాగజగతి మహిమ చూపె ; 

ఆహా, ఈ హడావుడిలు - ఆహాహా, మోహనం ;

లతల పూల తేనియల మధుర మోహనం ;

మురళీ మృదు సంగీతం, జగతి పావనం ; || 

================== ,

wenna lAmTi manasu kadaa, kannayyadi ; 

sakala janula hRdaya padma peeThammula ; 

adhiwasimca galiginADu, amdukanE ; || 

imduwadanuDu kRshNuDu - emdu daagenu ... , 

anucu, saikata teerammula wemTa -

amdamduna, amtaTA, anwEshaNa saagutOmdi ;

anupallawi ;- 

AhA, ee haDAwuDilu - aahaahaa, mOhanam ;

latala puula tEniyala madhura mOhanam ;

muraLI mRdu samgeetam, jagati paawanam ; ||

kanulamumdu jaarcinadi, hEmamta yuwati hima yawanika ; 

tama kanulamumdu jaarcinadi, hEmamta yuwati hima yawanika ; 

DillA paDi gOpikalu, DeelA paDe rAdhika ; ||

nIlamOhanAmguDu ekkaDa!? - 

ekkaDa, ekkaDa, ekkaDekkaDa!? 

E podarimTilOna nakkinADo!? ; gOpI janamamdarikI ; 

awadhi lEni tomdaralu, aapalEni gawEshaNalu ; || 

imdu amdu, amdu imdu - mumdu wenuka wenuka mumdu - 

emdemduna daaginADo, nawaneeta cOruDu, 

imdaritO parugulu, peTTimcE tumTari ; || 

wennadomga wenuwemTane mOgimcenu wENuwunu ; 

jana wAhini wennu taTTi raagajagati mahima cuupe ;

AhA, ee haDAwuDilu - aahaahaa, mOhanam ;

latala puula tEniyala madhura mOhanam ;

muraLI mRdu samgeetam, jagati paawanam ; || 

&

శుభకృత్ సుమ గీత మాలిక - 70 ; రచయి3 = కుసుమ ;   & మురళీ మృదు సంగీతం, జగతి పావనం ;-  

seventy 70 - డెభ్బై 70 = seventy 70 ;

ఏలేలో - హైలెస్సా

 ఆతృతలేలనె, ఓ గోపీ,

బృందగీతికల నాలపించగా ; ||

పింఛము మెరుపులు కురిపిస్తూ,

జతగా చేరెను మయూరమ్ములు ; 

పూల అమ్ముల లయల హొయలుల, 

తాళములాయెను నెమలి ఆటలు -

ఆ చక్కని సుందర - ఆట పాటలు ;||

కాళిందీ నది చిరు చిరు తరగలు -

కవితల మాధురి - జావళి చిందులు ;

కలిపెను బృందావనమున* -

ప్రతి పొదరింట - చిత్ర సౌరభిళ -

తరళ సుమమ్ముల - విరళ దళమ్ములు ;

ఈ విలసిత  భాగ్యములెన్నో, 

ఇంతటి సౌభాగ్యమ్ములు ఎన్నెన్నో ; || 

వలయ వలయముల పునరావృతమౌ - 

భజన సందడుల - భక్తి ఉరవడులు ; 

రాధా కృష్ణ ద్వయము ఆటలు ; 

అందరి అడుగులు కలిసినవి ; 

ఆవృత పదములు ఏలేలో ; 

పునరావృతమ్ముగా, హైలెస్సా ; || 

బృంద* = తులసి ] ;

========================= ;

ElElO - hailessA ; = `song 69 ;-` 

aatRtalElane, O gOpI,

bRmdageetikala naalapimcagaa ; ||

pimCamu merupulu kuripistuu,

jatagaa cErenu mayuurammulu ; 

puula ammula layala hoyalula, 

tALamulaayenu nemali ATalu -

aa cakkani sumdara - ATa pATalu ;||

kALimdii nadi ciru ciru taragalu -

kawitala maadhuri - jaawaLi cimdulu ;

kalipenu bRmdaawanamuna*-

prati podarimTa - citra sauraBiLa -

taraLa sumammula - wiraLa daLammulu ;

ee wilasita  bhaagyamulennO, 

imtaTi saubhaagyammulu ennennO ; || 

walaya walayamula punaraawRtamau - 

bhajana samdaDula - bhakti urawaDulu ; 

raadhaa kRshNa dwayamu ATalu ; 

amdari aDugulu kalisinawi ; 

aawRta padamulu ElElO ; 

punaraawRtammugaa, hailessA ; ||

&

[bRmda* = tulasi ] ;

శుభకృత్ సుమ గీత మాలిక -  69 ;; రచయి3 = కుసుమ ; ; 

యమునాతీరే, భళి హైలెస్సా

లెస్స లెస్సగా హైలెస్సా ;

భళిరే, బాలురు , హైలెస్సా ; ||

యమున ఒడ్డుకు చేరారు ; 

వ్రేపల్లియలోని ప్రజలంతా ; 

పల్లె పల్లెల బృందారకులు ; 

బృందగానములు అనిన ముచ్చట ; 

ముచ్చటగా బహు ముచ్చట లాడుచు ; 

బృంద గానముల శిక్షణ పొందిరి ; 

మేలుతరమ్మౌ బృందగీతికా క్రీడలు ; 

సృజనల వృష్టిలు సౌజన్యముగా ; 

అటనిట ఇటనట - నట గోవిందుని విలాసములే ;

నయన మనోహర గోచరమ్ములు ; || 

వకుళ మాలికలు అల్లారు ;

ప్రజలు, వకుళ మాలికలు అల్లారు ; ; 

ఒడలు నిండుగా ధరియించేరు ; 

తులసీ  ఆకుల పరిమళ దండలను ;

తులసీ పూసల చేరులను ;

ఒడలు నిండుగా ధరియించేరు ; ||

యమునాతీరే విలసిత కళలే ;

రంగు రంగుల హరివిల్లే,

ఇది, రంగు రంగుల హరివిల్లే ;

శ్రీకృష్ణుని నాట్య విలాసాలు -

ఉండగ అంతటహైలెస్సా!  - 

భళిరే భళిరే హైలెస్సా! 

================= ,

lessa lessagaa hailessA ; 

bhaLirE, baaluru, hailessA ; ||

yamuna oDDuku cErAru ; 

wrEpalliyalOni prajalamtaa ; 

palle pallela bRmdaarakulu ; 

bRmdagaanamulu anina muccaTa ; 

muccaTagaa bahu muccaTa lADucu ; 

bRmda gaanamula SikshaNa pomdiri ; 

mElutarammau bRmdageetikaa krIDalu ; 

sRjanala wRshTilu saujanyamugaa ; 

aTaniTa iTanaTa - naTa gOwimduni wilaasamulE ;

nayana manOhara gOcarammulu ; || 

wakuLa mAlikalu allaaru ;

prajalu, wakuLa mAlikalu allaaru ; ; 

oDalu nimDugaa dhariyimcEru ; 

tulasee  aakula parimaLa damDalanu ;

tulasee puusala cErulanu ;

oDalu nimDugaa dhariyimcEru ; ||

yamunaateerE wilasita kaLalE ;

ramgu ramgula hariwillE,

idi, ramgu ramgula hariwillE ;

SreekRshNuni naaTya wilaasaalu ;

umDaga amtaTa - BaLirE hailessA!

&

శుభకృత్ సుమ గీత మాలిక -  68 ;; రచయి3 = కుసుమ ;

10, జూన్ 2022, శుక్రవారం

రాధామణి మనోన్మణి

గోపతేజోమణి - తనకు సాటి ఎవ్వరంట!!? ;

రాధామణి మనోన్మణి ఎవ్వరంట!? - 

ఇంకెవ్వరంట -

అల్లరి కృష్ణయ్య, మన మోహన కృష్ణయ్య ; || 

మైత్రీవనమ్మున తారాడు సంచారి ; || 

మ్రోడులకు ప్రభలల్లు మయూరియే తాను ; 

మొండి దుష్టులకు గండు వీరుడే తాను ; 

గండరగండడు ఈతడే - అందాల యోధుడు ; ||

======================== ;

gOpatEjOmaNi - tanaku sATi ewwaramTa!!? ;

raadhaamaNi manOnmaNi ewwaramTa!? - 

imkewwaramTa -

allari kRshNayya, mana mOhana kRshNayya ; || 

maitrIwanammuna tArADu samcaari ; || 

mrODulaku prabhalallu mayuuriyE taanu ; 

momDi dushTulaku gamDu wIruDE tAnu ; 

gamDaragamDaDu iataDE - amdAla yOdhuDu ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక -  67 ;; రచయి3 = కుసుమ ;

1, జూన్ 2022, బుధవారం

స్ఫటిక ప్రేమ

సౌందర్యారాధనము - 

అందరికీ ఆమోదం, 

బహుళ విరళ సమ్మతము ;

వసుధ - ఏరి కోరి, మరీ మరీ -

కేరింతల క్రిష్ణయ్యను -

భువి పైకి, రప్పించెను ; ||

అందమంటె - ఆహ్లాదము ;

స్ఫటిక ప్రేమయే కదా - 

అందుకె మనమంద్రము - అందాము ;

అందులకే ఈ ఎంపిక బాగున్నది - 

వసుంధరకు కృతజ్ఞతలు ; ||

=============== ,

saumdaryaaraadhanamu - 

amdarikee aamOdam, 

bahuLa wiraLa sammatamu ;

wasudha - Eri kOri, maree maree -

kErimtala krishNayyanu -

bhuwi paiki, rappimcenu ; ||

amdamamTe - aahlaadamu ;

sphaTika prEmayE kadA - 

amduke manamamdramu - amdaamu ;

amdulakE ee empika baagunnadi - 

wasumdharaku kRtajnatalu ; ||

&  

స్ఫటిక ప్రేమ = song 66 ;;

శుభకృత్ సుమ గీత మాలిక -  66 ;; రచయి3 = కుసుమ ;; June ;

మధురా నగరియె ప్రతి ప్రాంతం

దామం దామం, సుమదామం ; 

నీ నవ్వుల పూవుల నీయవయా, 

క్రిష్ణ, నీ నవ్వుల పూవుల నీయవయా ; || 

గానం గానం, మధురానుభవం ;

మధురా నగరియె ప్రతి ప్రాంతం ; || 

రాగం రాగం, అనురాగమయం ;

తమసున తమకము - చంద్రోదయము ; || 

ధ్యానం ధ్యానం సంకల్పం ; 

అనుగ్రహము సంపూర్ణం ; 

స్వామి -

ప్రేమసమీరం - హరితాశ్రమము ; || 

============ ,

daamam daamam, sumadaamam ; 

nee nawwula puuwula neeyawayA, 

krishNa, nee nawwula puuwula neeyawayA ; || 

gaanam gaanam, madhuraanubhawam ;

madhuraa nagariye prati praamtam ; || 

raagam raagam, anuraagamayam ;

tamasuna tamakamu - camdrOdayamu ; || 

dhyaanam dhyaanam samkalpam ; 

anugrahamu sampuurNam ; 

swaami -

prEmasameeram - haritASramamu ; || 

&

శుభకృత్ సుమ గీత మాలిక -  65 ;; రచయి3 = కుసుమ ;; June 2022 ;

మధురా నగరియె ప్రతి ప్రాంతం ;- song 65 ;