24, జులై 2022, ఆదివారం

మృదు హృదయిని రాధిక - 85

నవనీతామృత మృదు హృదయిని, రాధిక ; 

అబ్ధి తరంగము లెగయుచున్నవి ; 

క్షీరాబ్ధి తరంగము లెగయుచున్నవి ; || 

దేవకినందనుడట అతడు ; 

నగరిని చేరి, తనను మరిచెనేమో తనను ;

విధి విలాసమా, ఇది ఏమి!? ; || 

అదిగదిగొ, అల్లదిగో, 

పిల్లంగ్రోవీ నుండి చల్లని పాటలు ; 

కృష్ణ గోవిందుడెపుడూ, భక్తసులభుండే ; 

ఎప్పుడూ తాను భక్తసులభుడే ; 

గాలిదూతల ద్వారా మనకై పంపుచుండును, 

మురళీరవళుల అమూల్య సుధలను ; 

తెలిసింది కద ఊసు, మిత్రులారా, 

కేకి, ధేనువులార, యమునా ఝరిలోని -

జలతరంగాల్లార, ఓ నేస్తమ్ముల్లారా ; || 

=================== ,

mRdu hRdayini, raadhika - song - 85 ;

nawaneetaamRta mRdu hRdayini, raadhika ; 

abdhi taramgamu legayucunnawi ; 

ksheeraabdhi taramgamu legayucunnawi ; || 

dEwakinamdanuDaTa ataDu ; 

nagarini cEri, tananu maricenEmO tananu ;

widhi wilAsamaa, idi Emi!? ; || 

adigadigo, alladigO, 

pillamgrOwee numDi callani pATalu ; 

kRshNa gOwimduDepuDU, bhaktasulabhumDE ; 

eppuDU taanu bhaktasulabhuDE ; 

gaaliduutala dwaaraa manakai pampucumDunu, 

muraLeerawaLula amuulya sudhalanu ; 

telisindi kada uusu, mitrulaarA, 

kEki, dhEnuwulaara, yamunaa jharilOni -

jalataramgaallAra, O nEstammullaarA ; ||

&

song - 85 ; రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక  ; ;

అయ్యారె, తన్మయి - 84

రాగాల చినుకులలొ, తడిసేను రాధమ్మ ; 

తనిసేను, తరిసేను - తనకు తానే అయ్యి, 

అయ్యారె, తన్మయి ..... , ||

తనలో తానయ్యి, తన లోలోన తానే - 

క్రిష్ణతత్వమ్మయి, 

పెను మాయ ఇది ఏమొ - పెనవేసుకొనిపోవు ;

సిరి హాయి, అయ్యారె, తన్మయి ;  || 

ఎంచితే సుమవనిని పూ పరిమళమ్ముల ;

తన శ్వాస లిపి ఎల్ల - మధు కావ్య గ్రంధాలు ;

అయ్యారె, తన్మయి ; ||

శ్రీతల్పమే అయి, త్రుళ్ళింతల అవని -

శేషశాయికి పాన్పు వేరేల? - అన్నది ;

భూదేవి హక్కు అది - మున్నె తన అర్ధాంగి ;

గోవిందుని పత్ని హఠమెల్ల రాధకు -

నవ్వు పుట్టించేను, ఏమాయెనో ఏమొ,

అయ్యారె, తన్మయి ; ||

============== ,

ayyAre, tanmayi ;- song 84 ;- 

raagaala cinukulalo, taDisEnu rAdhamma ; 

tanisEnu, tarisEnu - tanaku taanE ayyi, 

ayyAre, tanmayi  ..... , ||

tanalO tAnayyi, tana lOlOna taanE - 

krishNatatwammayi, 

penu maaya idi Emo - penawEsukonipOwu ;

siri haayi, ayyAre, tanmayi ;  || 

emcitE sumawanini puu parimaLammula ;

tana Swaasa lipi ella - madhu kaawya gramdhaalu ;

ayyAre, tanmayi ; ||

SreetalpamE ayi, truLLimtala awani -

SEshaSAyiki paan pu wErEla? - annadi ;

BUdEwi hakku adi - munne tana ardhaamgi ;

gOwimduni patni haThamella raadhaku -

nawwu puTTimcEnu, EmaayenO Emo,

ayyAre, tanmayi ; ||

అయ్యారె, తన్మయి ;- song = 84 ;- రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక ;

కొండగాలి కొంటెతనము - 83

 కొంటెతనమేలనే, ఓ కొండగాలి, 

సంగీత మధు స్వరార్ణవములను కోరి,

మురళిలోన దూరి, కితకితలు పెట్టకు ; ||   

గారాల రాగాల చిలికేను వేణువు ; 

చిన్నిదమ్మా, ఈ చిట్టి పిల్లనగ్రోవి ; 

అలసట చెందును, అలసత్వమేలనే ;

చిలిపి చిరుగాలి, చాలు చాలు, 

మురళిలోన దూరి, కితకితలు పెట్టకు ; 

సుంత విశ్రాంతిని ఈయమ్మ, చిరుగాలి ; 

అలసేను ఈ మురళి, 

అలయును క్రిష్ణయ్య చిరు వేళ్ళు, 

చిన్నారి మా ముద్దు కృష్ణుని -

లేలేత చివురుల చిటి వ్రేళ్ళమ్మా ;

చాలమ్మ చాలును, నీ దుడుకుతనములు,

శీతలతలముల ఓ శీతగాలి ; || 

====================  ,

komDagaali komTetanamu ;- song - 83 ;-

komDagaali komTetanamu ;- song - 83 ;- 

komTetanamElanE, O komDagaali, 

samgeeta madhu swaraarNawamulanu kOri,

muraLilOna duuri, kitakitalu peTTaku ; ||   

gaaraala raagaala cilikEnu wENuwu ; 

cinnidammaa, ee ciTTi pillanagrOwi ; 

alasaTa cemdunu, alasatwamElanE,

cilipi cirugaali, caalu caalu, 

muraLilOna duuri, kitakitalu peTTaku ; 

sumta wiSraamtini eeyamma, cirugaali ; 

alasEnu ee muraLi, 

alayunu krishNayya ciru wELLu, 

cinnaari maa muddu kRshNuni -

lElEta ciwurula ciTi wrELLammaa ;

caalamma caalunu, nI duDukutanamulu,

SItalatalamula O SItagaali ; ||

కొండగాలి కొంటెతనము - song - 83 ; రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక ;

6, జులై 2022, బుధవారం

నఖద్యుతుల కాంతులు - 82

నీ చిటి గోళ్ళపైన సూర్యకిరణాలు ; 

రచియించుచున్నవి వర్ణ కావ్యాలను ; 

క్రిష్ణ, లక్షోప లక్షలు వర్ణ కావ్యాలను ; || 

యశోదమ్మకు ముద్దుల పట్టి, గారాల బుజ్జి ; 

అమ్మ కొంగును పట్టు పల్లవాంగుళులు ;

నందసతి అమ్మకు,

కొంగు బంగారము నీవేను కృష్ణ ; || 

యమునలో జలములను కదిలించు వేళల -

స్వాతిముత్యాలన్ని ముద్దాడు ముదముగా -

నీ తెల్లని నఖముల సొగసు కాంతులను ; ||  

============================ ,

nee ciTi gOLLapaina suuryakiraNaalu ; 

raciyimcucunnawi warNa kAwyaalanu ; 

krishNa, lakshOpa lakshalu 

warNa kAwyaalanu ; || 

yaSOdammaku muddula paTTi, 

gaaraala bujji ; 

amma komgunu paTTu pallawAmguLulu ;

namdasati ammaku,

komgu bamgaaramu neewEnu kRshNa ; || 

yamunalO jalamulanu kadilimcu wELala -

swAtimutyAlanni muddADu mudamugA ;

nee, tellani nakhamula sogasu kAmtulanu ; || 

;

నఖద్యుతుల కాంతులు ;- song - 82 ;

రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక ;

క్రిష్ణయ్య సంధ్యా వందనాలు - 81

"కన్నయ్య, రావోయి, అని  పిలిచెను నందుడు ;

కుదురుగా కూర్చుండబెట్టేను కొడుకుని ;

దోసిళ్ళ నిండుగా నీళ్ళను పోసేను ;

గురు గర్గ్యమునివర్య - మంత్రములు బోధించ,

క్రిష్ణయ్య ఆచరణ, బుద్ధిగా అనుసరణ ;

పెద్దలకు, ప్రజలకు - బహు ముచ్చట ; ||

తొలి పొద్దు, వందనం - సూర్యనారాయణునికి ;

శ్రీమన్నారాయణమూర్తి చేసేటి దృశ్యాలు ;

కన్నుల పండుగలు - ఎల్ల లోకమ్ములకు ;

ఈ ఎల్ల లోకములకు ; ||

===================== ;

krishNayya samdhyaa wamdanaalu ;- song - 81 ;-

"kannayya, raawOyi, ani  pilicenu namduDu ;

kudurugaa kuurcumDabeTTEnu koDukuni ;

dOsiLLa nimDugaa neeLLanu pOsEnu ;

guru gargyamuniwarya - mamtramulu bOdhimca,

krishNayya aacaraNa, buddhigaa anusaraNa ;

peddalaku, prajalaku - bahu muccaTa ; ||

toli poddu, wamdanam - suuryanaaraayaNuniki ;

SreemannaaraayaNamuurti cEsETi dRSyaalu ;

kannula pamDugalu - ella lOkammulaku ;

ee ella lOkamulaku ; ||

&

రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక ;- 81 ;-  క్రిష్ణయ్య సంధ్యా వందనాలు ;