ఈ నందనవనము - తేనెల పుష్పము ;
డెందము చిలికెను మంజుల రవళుని ;
తీయని గీతము లందుకున్నవి,
మెండుగ దండిగ - తుమ్మెద గుంపులు ; ||
చిన్నారి క్రిష్ణుని - అందెలు ఘల్లన,
పందెములాడెను పుడమి హుషారుగ ;
సాగరమ్మున ఎగసే అలలతొ ;
మువ్వల రవళుల నెయ్యమిదే, తదేనని ; ||
ఈ కొమ్మలకేలనె ఇంత సంబరము ;
మ్రోడు సైతము చివురిస్తున్నవి ;
ఎందులకు అని సందియమేల, బేలా!
చెట్టును ఎక్కెను కన్నయ్య ;
ఉవిదల కోకల హరివిల్లుగా ;
మారెను ఇప్పుడు - ఈ తరువుల శాఖలు ;
నానా విధముల - మెండుగ వింతగు -
అందములిటుల రాశులాయెను ;
వాసికెక్కినది భూలోకము సర్వము ;
ఈ ఉర్వితొ, నెయ్యము కోరుచు -
స్వర్గము ఇటకు - చప్పున వచ్చెను ; ||
================== ;
I namdanawanamu - tEnela pushpamu ;
Demdamu cilikenu mamjula rawaLuni ;
teeyani geetamu lamdukunnawi,
memDuga damDiga - tummeda gunpulu ; ||
cinnaari krishNuni - amdelu ghallana,
pamdemulaaDenu puDami hushaaruga ;
saagarammuna egasE alalato ;
muwwala rawaLula neyyamidE, tadEnani ; ||
ee kommalakElane imta sambaramu ;
mrODu saitamu ciwuristunnawi ;
emdulaku ani samdiyamEla, bElA!
ceTTunu ekkenu kannayya ;
uwidala kOkala hariwillugaa ;
maarenu ippuDu - ee taruwula SAKalu ;
naanaa widhamula - memDuga wimtagu -
amdamuliTula raaSulaayenu ;
waasikekkinadi bhuulOkamu sarwamu ;
ee urwito, neyyamu kOrucu -
swargamu iTaku - cappuna waccenu ; ||
& శుభకృత్ సుమ గీత మాలిక - 87 ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి