9, ఆగస్టు 2022, మంగళవారం

చిక్కని వెలుగులు - గీసెను బొమ్మలు- 90

చిక్కని వెలుగులు - గీసెను బొమ్మలు ;

చక్కని క్రిష్ణుని రాధిక నవ్వులు  ;

క్రిష్ణ ప్రేయసి రాధిక నవ్వులు ; ||

మిన్నాగులను వంచాడు - నందబాలుడు ;

విన్నాణమిదే, మన కన్నులు పొందెను ;

రక్కసులందరు వెక్కసపడగా -

సాహసమ్ములు చేసెను వెన్నుడు ; ||

చిన్న పల్లియ - మిన్న ఐనది ;

దివ్య సీమలకు - ప్రతీక ఆయెను ;

ఎల్ల వేళలా ఈ పగిదిని నవ్వులు ;

ఎగజిమ్ముటయే ఇట సాధారణమయా ; ||

============= ;

cikkani welugu - geesenu bommalu ;

cakkani krishNuni raadhika nawwulu ;

krishNa prEyasi raadhika nawwulu ; ||

minnAgulanu wamcADu - namdabaaluDu ;

winnANamidE, mana kannulu pomdenu ;

rakkasulamdaru wekkasapaDagaa -

saahasammulu cEsenu wennuDu ; ||

cinna palliya - minna ainadi ;

diwya seemalaku - prateeka Ayenu ;

ella wELalA I pagidini nawwulu ;

egajimmuTayE iTa saadhaaraNamayaa ; ||

&

రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక - 90 ; 😇乀🦜🦆

ninity feathers peacock 


రాధా కృష్ణ వాదులాటలు - 89

రాధ ;- చనువు ఎక్కువయి, 

చంకను ఎక్కినదెవరోయీ, వారెవరోయీ? 

క్రిష్ణ ;- పెంకి మాటలను నా కళ్ళను నింపినదెవరో!?

పెంకి మాటలను మన కళ్ళను నింపినదెవరో!?  

కళ్ళలొ కలలను - కళలుగ మార్చిన రాధిక కాదా!? 

మరి ఈ రాధిక కాదా!? ; ||

గోపిక 1;- పూవుల తోటి బాసలు ఆడుచు -

కొంగ్రొత్త భాషల విరించి ఎవరు?

గోపి 2 ;-  రాధా మానస మందిరమ్మున ;

కొలువై ఉన్న ధీరుడు క్రిష్ణుడు ;

అందరు ;- 

రాధ, కృష్ణ సంవాదములే - 

ముచ్చటలే- బహు ముచ్చటలే ; || 

========================= ,

raadhaa kRshNa waadulATalu ;- 

raadha ;- canuwu ekkuwayi, 

camkanu ekkinadewarOyI, waarewarOyI? 

krishNa ;- pemki maaTalanu naa kaLLanu nimpinadewarO!?

pemki maaTalanu mana kaLLanu nimpinadewarO!?  

kaLLalo kalalanu - kaLaluga maarcina raadhika kaadA!? 

mari ee raadhika kaadA!? ; ||

gOpika 1;- puuwula tOTi baasalu ADucu -

komgrotta bhaashala wirimci ewaru?

gOpi 2 ;-  raadhaa maanasa mamdirammuna ;

koluwai unna dheeruDu krishNuDu ;

amdaru ;- 

raadha, kRshNa samwaadamulE - 

muccaTalE- bahu muccaTalE ; ||  

&

రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక - 89 ;

8, ఆగస్టు 2022, సోమవారం

రాధిక నవ్వులు - క్రిష్ణ నయనాల దీపావళి - 88

రాధిక నవ్వులు - క్రిష్ణ నయనాల - వెలిగే దివ్వెలు ; 

ఇక దీపావళి - దివ్య దీపావళి ; ||

కొసరే వెలుగులు - మెరుపుల తీగలు ;

తోరము ఎక్కెను దిశల గుమ్మముకు ; ||

దోసెడు చుక్కలు - చింత పిక్కలు ;

అష్టాచెమ్మ - అరచేతుల చెమ్మ ;

సుదతికి కరములను నిమిరితె చాలును ;

ఆటల నమ్రత, పాటల నవ్యత ;

అందులకే ఇది బృందావనము ;

నిత్యారాధన సౌభాగ్యాలు ; ||

=============== ;

raadhika nawwulu - 

krishNa nayanaala weligE diwwelu ; 

ika deepaawaLi - diwya deepaawaLi ; ||

kosarE welugulu - merupula teegalu ;

tOramu ekkenu diSala gummamuku ; ||

dOseDu cukkalu - cimta pikkalu ;

ashTaacemma - aracEtula cemma ;

sudatiki karamulanu nimirite caalunu ;

aaTala namrata, pATala nawyata ;

amdulakE idi bRmdaawanamu ;

nityAraadhana saubhaagyaalu ; || 

శుభకృత్ సుమ గీత మాలిక  - 88 ; రచయి3 = కుసుమ ;

నందనవనము - తేనెల పుష్పము - 87

ఈ నందనవనము - తేనెల పుష్పము ; 

డెందము చిలికెను మంజుల రవళుని ;

తీయని గీతము లందుకున్నవి, 

మెండుగ దండిగ - తుమ్మెద గుంపులు ; ||

చిన్నారి క్రిష్ణుని - అందెలు ఘల్లన, 

పందెములాడెను పుడమి హుషారుగ ;

సాగరమ్మున ఎగసే అలలతొ ;

మువ్వల రవళుల నెయ్యమిదే, తదేనని ; ||

ఈ కొమ్మలకేలనె ఇంత సంబరము ;

మ్రోడు సైతము చివురిస్తున్నవి ; 

ఎందులకు అని సందియమేల, బేలా!

చెట్టును ఎక్కెను కన్నయ్య ;

ఉవిదల కోకల హరివిల్లుగా ;

మారెను ఇప్పుడు - ఈ తరువుల శాఖలు ;

నానా విధముల - మెండుగ వింతగు -

అందములిటుల రాశులాయెను ;

వాసికెక్కినది భూలోకము సర్వము ;

ఈ ఉర్వితొ, నెయ్యము కోరుచు - 

స్వర్గము ఇటకు - చప్పున వచ్చెను ; ||

================== ;

I namdanawanamu - tEnela pushpamu ; 

Demdamu cilikenu mamjula rawaLuni ;

teeyani geetamu lamdukunnawi,

memDuga damDiga - tummeda gunpulu ; ||

cinnaari krishNuni - amdelu ghallana, 

pamdemulaaDenu puDami hushaaruga ;

saagarammuna egasE alalato ;

muwwala rawaLula neyyamidE, tadEnani ; ||

ee kommalakElane imta sambaramu ;

mrODu saitamu ciwuristunnawi ; 

emdulaku ani samdiyamEla, bElA!

ceTTunu ekkenu kannayya ;

uwidala kOkala hariwillugaa ;

maarenu ippuDu - ee taruwula SAKalu ;

naanaa widhamula - memDuga wimtagu -

amdamuliTula raaSulaayenu ;

waasikekkinadi bhuulOkamu sarwamu ;

ee urwito, neyyamu kOrucu - 

swargamu iTaku - cappuna waccenu ; ||

 శుభకృత్ సుమ గీత మాలిక  - 87 ; రచయి3 = కుసుమ ;

యుగాలుగా ఎన్నో అవతారములు - 86

అగణితమ్ములు నీదు లీలలు, హేలలు ;

అగణితములైనట్టి ప్రాణి కోట్లను, స్వామి ;

బ్రోచు భారము నీపైన దాల్చినావోయి ; || 

అలనాడు పాల్కడలి చేరావు, 

ఆది కచ్ఛపి మూర్తి రూపమ్ము ధరియించి ;

అంత బరువైన మందరం గిరిని అలవోకగా - 

ఓరిమికి రూపమయి, నీ వీపుపై నిలిపావు ; ||

సూదంటి కోరపయి నిలిపి - 

వేదముల, విద్యలను - కాపాడినావు ;

ఆదిసూకర మూర్తి, అవతారమూర్తీ! 

విద్యంటె నీకు ఎంత మక్కువ స్వామి ; 

విద్యలను లోకముల కందించినావు 

ఈరేడు లోకములకు అందించినావు ; ||

కామదేవుని జనక, భక్తజన రక్షకా! 

కంటిరెప్పకు మల్లె లోకముల బ్రోచేవు ;

ఉద్ధరించుట - నీకు- మంచి విధి అయ్యేను, లెస్స లెస్స ; || 

పది మాత్రమే మాకు తెలిసిన రూపములు ; 

యుగయుగాలుగాను ఎన్నెన్ని - అవతారములు దాల్చి, 

అవధి లేని దయతొ ఆదరిస్తున్నావు , 

బాగు బాగు, కొండంత స్వామీ - మా శత కోటి వందనాలందుకోవయ్యా ;

విశ్వముల తండ్రీ, అనురూపవర్తీ - శ్రీపతీ, దశ అవతారమూర్తీ ; ||

============================== ,

agaNitammulu needu leelalu, hElalu ;

agaNitamulainaTTi prANi kOTlanu, swAmi ;

brOcu BAramu neepaina daalcinaawOyi ; || 

alanADu pAlkaDali cEraawu, 

aadi kacCapi muurti ruupammu dhariyimci ;

amta baruwaina mamdaram girini alawOkagA - 

Orimiki ruupamayi - nee weepupai nilipaawu ; ||

suudamTi kOrapayi nilipi - 

wEdamula, widyalanu - kaapADinAwu ;

aadisuukara muurti, awataaramuurtee! 

widyamTe neeku emta makkuwa swaami ; 

widyalanu  lOkamulakamdimcinaawu ;

eerEDu lOkamulaku amdimcinaawu ; ||

kaamadEwuni janaka, bhaktajana rakshakA! 

kamTireppaku malle lOkamula brOcEwu ;

uddharimcuTa - neeku- mamci widhi ayyEnu, lessa lessa ; || 

padi maatramE maaku telisina ruupamulu ; 

yugayugaalugaanu ennenni - awataaramulu daalci, 

awadhi lEni dayato aadaristunnaawu , 

baagu baagu, komDamta swaamee - maa Sata kOTi wamdanaalamdukOwayyaa ;

wiSwamula tamDrI, anuruupawartee - Sreepatee, daSa awataaramUrtI ; ||

శుభకృత్ సుమ గీత మాలిక - 86 ; రచయి3 = కుసుమ ;;

& song - 85 ; రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక  ; ;

prev = ▼  జులై (5) = మృదు హృదయిని రాధిక - 85 ;; అయ్యారె, తన్మయి - 84 ;; 

కొండగాలి కొంటెతనము - 83 ;; నఖద్యుతుల కాంతులు - 82 ;; క్రిష్ణయ్య సంధ్యా వందనాలు - 81 ;;