చార్లీ చాప్లిన్” “ది గ్రేట్ డిక్టేటర్”నేటికీ సంచలన చిత్రంగా,
విజయదుందుభి మోగించే ఇంగ్లీష్ సినిమా “ది డిక్టేటర్”.
ఈ చలన చిత్రం అన్ని కోణాలనుండీ సంచలన రికార్డులకు మారుపేరుగా నిలిచింది.
ఈ English Movie ఆబాలగోపాలానికీ అభిమానపాత్రుడైన
మహా నటుడు “ఛార్లీ చాప్లిన్” కీర్తి కిరీటంలోని కలికితురాయి.
ఈ చిత్ర కథ, చాప్లిన్ ఫ్యాన్స్ కి అందరికీ తెలుసు.
జర్మనీ దేశాన్ని, జర్మని జాతి వారు
– ఆర్య వారసత్వ మూలములు ‘తమ కలిమి గా ‘కలిగిన వారని, త్రికర్మణా నమ్మాడు హిట్లర్.
తన మూఢ విశ్వాసాలను అత్యంత క్రూరంగా అత్యంత హేయంగా యావత్ ప్రపంచము నెత్తిన రుద్దాలని
యత్నించిన నియంత హిట్లర్ పోకడలకు వ్యంగ్య రూపకమే
1940 సంవత్సరము నాటి “The Great Dictator”.
ఈ మూవీ రూప కల్పనకి నాంది
అనుకోకుండా పలికిన సందర్భం వింత ఐనదే!
అలెగ్జాండర్ కోర్డా - chaplin's friend , film producer ;-
కోర్డా = అనే లాటిన్ పదానికి అర్ధం -
"sursum corda" which means "lift up your hearts ;
Alexander Kord అనే స్నేహితుడు, “Charlie! నీ ముఖంలోని ముక్కట్లు
(పోలికలు) కొన్ని యాంగిల్సులో హిట్లర్ లాగా ఉన్నాయి.” అన్నాడు.
మిత్రుని మాటలతో ఛార్లీ అద్దంలో తన బింబాన్ని పరిశీలించుకునాడు.
ఫొటోలలో తన Face ను, పోలికలనూ పరిశీలనగా
మళ్ళీ మళ్ళీ గమనించుకున్నాడు.
Alexander Korda వాక్కులు ఆతని అద్భుత చిత్రానికి
చిత్రంగా ముహూర్తం ఐనది.
హిట్లర్ ఆశయాల ఆచరణలో కూరిన అసంబద్ధత- ఆతని మూర్ఖత్వమూ
ఛాప్లిన్ యొక్క ప్రతిభా వ్యుత్పత్తులకు గీటురాయిగా నిలిచేలాగా
న భూతో, న భవిష్యతి - అన్న చందంగా ఛాప్లిన్ చేతిలో రూపొందినది.
మాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే – ఒకటేమిటి?
అన్ని కోణాలలోనూ సర్వతోముఖంగా నిర్మించబడినది.
ప్రపంచ దేశాల బొమ్మను వేసిన
గాలి బుడగ సన్నివేశం ఛార్లీ చాప్లిన్ కళాభినివేశానికి ప్రతిరూపం.
సినీ చరిత్రలో శిఖరాగ్ర స్థాయిలో సుస్థిరమైన చిత్రీకరణ అది.
బుడగను బ్యాలెన్స్ చేస్తూ ఆడిన నియంత ఆట,
నాట్యంగా ప్రేక్షకుని కంటికి ద్యోతకమయ్యే రీతిగా ఆ అమోఘ దృశ్యము.
ఆహా! ఆ మహా నటుడు ప్రశంసా వర్షంలోనిలువెల్లా తడియడంలో ఆశ్చర్యం ఏమున్నది?
“The Dictator” లో మహా నియంత, అశేష జర్మనీ ప్రజానీకాన్ని మేధో విమూఢ
చిత్తులనుగా చేసేసి, వారిని విపరీతమైన హింసా దౌర్జన్యాల చర్యలకు పురికొల్పిన పద బంధాలు అవి.
ఆ ప్రజలు నిర్హేతుకంగా, నిర్దయా హృదయులై తమ ప్రవర్తనతో సకల మానవాళినీ పెను ముప్పులోకి
నెట్టివేసిన దుష్ట లగ్నము అది. అంత ప్రభావవంతమైనది హిట్లర్ ప్రసంగం.
సరే! ఇప్పుడీ అప్రస్తుత ప్రసంగం ఎందుకని చదువరుల సందేహం. ఔనా?
సినీ సమీక్షా వర్గాలకు, ప్రత్యేకించి సినిమాలోని – హిట్లర్ స్పీచ్ ఆసక్తి గొలిపే అంశంగా పరిణమించినది.
హిట్లర్ వేష ధారణతో చార్లీ చాప్లిన్ మైకు ఎదుట నిల్చుని, అనర్గళంగా మాట్లాడాడు.
అప్పుడు చార్లీ చాప్లిన్ ఉరఫ్ Adolf Hitler తన డైలాగులను ఏ లాంగ్వేజీ లో మాట్లాడాడు? ”
– ఇదీ ఆ ప్రశ్న.
Final Speech by Charlie Chaplin (Barber) in the guise of Hitler
ఆ shot లో చాప్లిన్ – Esperanto Language ని ఉపకరణంగా మలుచుకున్నాడు –
అని సినీ వర్గాల భావన. ఎస్పిరాంటో భాష అంటే ఏమిటి? Esperanto language ఏ
కంట్రీ citizens వ్యావహారికంలో ఉన్నది?
Dr L.L. ZamenhOf అనే యూదు వ్యక్తి ఈ భాషకు బీజావాపనం చేసాడు.
Dr. Lazarus Ludwig Zamenhof పోలండ్ యూదుడు
(a Polish physician. Born on 15 Dec 1859 Died on 14 Apr 1917)
“ప్రపంచ భాష “అనే యోచనతో, సార్వ జనీన భాషకు శ్రీకారం చుట్టాడు.
హిందు దేశములో – ప్రాచీన కాలములో సకల భారతీయ భాషలను అనుసంధానించిన ప్రయోగమే సంస్కృత భాష.
మన దేశములో గీర్వాణ భాష ఆవిర్భావ భావన వంటిదే ఇలాగ ఈ Esperanto language.
1887 లో “ Unua Libro”అనే పుస్తకము ఈ విషయ సంబంధిగా ముద్రితమైన మొదటి
పుస్తకమని పేర్కొనవచ్చును. ఎస్పిరాంటో భాషను మాట్లాడే అభిలాష ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా ఒక
లక్ష నుండి పది లక్షల మంది దాకా ఉన్నారని అంచనా.
కొన్ని సినిమాలు కూడా Esperanto భాషలో నిర్మించబడినాయి కూడా!
;
Charlie chaplin 1940 , Alexander Korda ; aavakaaya Essay ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి