31, ఆగస్టు 2020, సోమవారం

కందుకూరి రుద్రకవి - కొండోజీ అనుబంధం

 శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం - కోట సింహద్వారం నుండి అక్కడికి - సారస్వత సభకు చేరడమంటే మాటలా!? ద్వారపాలకులు ముందే బల్లెం లు, కర్రలను` ఇంటూ మార్కు`తో అడ్డం పెట్టేస్తారు కదా. 

కొలువులోని ఉద్యోగులు, సిబ్బంది - ఈ వర్ధమాన కవిగారికి తెలీదు.
తాతాచార్యుల వారి ముద్ర వీపు తప్పినా వీపుకు తప్పదు - ఇత్యాది సామెతలకు హేతువు ఐన
తాతాచార్యులు - ఆస్థాన కవులలో స్థిర స్థానం పొందిన కవి - అని అర్ధం ఔతూనే ఉన్నది కదా!
@@@@@@
శ్రీకృష్ణదేవరాయల వారి భువనవిజయం - ప్రాంగణంలో ఈశాన్య దిశలో ఉన్న పీఠంపై
కందుకూరి రుద్రకవి ఆసీనుడయ్యాడు. ఆ కుర్చీలో కూర్చునే అర్హత సంపాదించడానికి 
అతడు ఎన్నో అడ్డంకిలను, ఇక్కట్ల స్పీడ్ బ్రేకరను అధిగమించి రాగలిగాడు. 
ఎలాగైతేనేం, కొసకు -  శ్రీకృష్ణదేవరాయల వారి క్షురకుడు - 
కందుకూరి రుద్రకవికి హామీ ఇచ్చాడు, 
"మీకు సార్వభౌముల దర్శనం లభించడానికి, నాకు చేతనైనంత సాయం చేస్తాను." 
ఈ చిన్న మాట కందుకూరి రుద్రకవి కన్నులను ఆనందాశ్రువులతో నింపింది. 
స్నేహహస్తం అందించిన ఆ రాయల వారి మంగలి పేరు కొండోజీ. 
కందుకూరి రుద్రకవికి తటస్థపడిన ఈ వృత్తికారుడు మంగలి తిమ్మోజు కొండోజీ - 
నివాసం బాడవి పట్టణం.
శ్రీకృష్ణదేవరాయలవారి తర్వాతి రాజ్య పాలకులు సదాశివ రాయలుకు, అళియ రామరాయలు.
1542 నుండి 1565 వరకూ పాలించిన సదాశివ రాయలుకు, అళియ రామరాయలు లకు కూడా - సాన్నిహిత్య సేవకుడు. 
కేవలం మంగలి పని నిర్వహణయే కాక, ప్రభువులకు మంచి సలహాలు ఇచ్చే చురుకుదనం, ఇంగితజ్ఞానం ఉన్న వ్యక్తి, కనుకనే - మహా రాజులకు సఖ్యత ఉన్న భృత్యుడు అయ్యాడు కొండోజీ. 
కొండోజీకి బహుమతులుగా ఇచ్చిన భూములు, కానుకల వివరముల గురించిన 
దాన శాసనాలు ఈ విషయానికి ఆనవాళ్ళు. 
తనకు వీలు ఉన్నంతలో నలుగురికీ సాయపడే గుణం కలిగి ఉన్న మనిషి కొండోజీ, అందుచేతనే - కందుకూరి రుద్రకవి - "మంగలి కొండోజి మేలు మంత్రుల కంటెన్" అని పద్యాన్ని చెప్పాడు కవి. 
కందుకూరి రుద్రకవి - నుడివిన పద్య పంక్తి కాస్తా - లోకోక్తి ముక్తావళి గా మారింది. 1580 - నిరంకుశోపాఖ్యానము - కందుకూరి రుద్రకవి రచించిన ప్రబంధము. 
;
=======================, 
;
SreekRshNadEwarAyalu aasthaanam - kOTa sim hadwaaram numDi akkaDiki - sAraswata sabhaku cEraDamamTE mATalA!? 
dwaarapaalakulu mumdE ballAlanu imTuu maarkutO aDDam peTTEstAru kadaa. koluwulOni udyOgulu, sibbamdi - teleedu.
taataacaaryula waari mudra weepu tappinaa weepuku tappadu - ityaadi saametalaku hEtuwu aina taataacaaryulu - aasthaana kawulalO sthira sthaanam pomdina kawi - ani ardham autuunE unnadi kadaa! ;
@@@@@@  
SreekRshNadEwarAyala waari bhuwana wijayam - praamgaNamlO ISAnya diSalO unna pIThampai kamdukuuri rudrakawi aaseenuDayyADu. aa kurceelO kuurcunE arhata sampADAniki ataDu ennO aDDamkilanu, ikkaTla speeD brEkaranu adhigamimci raagaligADu.
elaagaitEnEm, kosaku -  SreekRshNadEwarAyala waari kshurakuDu - kamdukUri rudrakawiki haamee iaccaaDu, "meeku saarwabhaumula darSanam labhimcaDAniki, naaku cEtanainamta saayam cEstaanu.
ee cinna mATa kamdukUri rudrakawi kannulanu aanamdASruwulatO
nimpimdi. 
snEhahastam amdimcina aa raayala waari mamgali pEru komDOjI.
kamdukUri rudrakawiki ki taTasthapaDina ee wRttikaaruDu - 
mamgali timmOju niwaasam bADawi paTTaNam.  
SreekRshNadEwarAyalawaari tarwaati
raajya paalakulu sadASiwa rAyaluku, aLiyaraamaraayalu. 
1542 numDi 1565 warakU pAlimcina sadASiwa rAyaluku, aLiyaraamaraayalu laku kUDA - sAnnihitya sEwakuDu. 
kEwalam mamgali pani
nirwahaNayE kaaka, prabhuwulaku mamci salahaalu iccE curukudanam, imgitajnaanam unna wyakti,
kanukanE - mahaaraajulaku sakhyata unna BRtyuDu ayyADu komDOjI. komDOjIki bahumatulugaa iccina bhuumulu, kaanukala wiwaramula gurimcina daana SAsanaalu - ii wishayaaniki aanawALLu. tanaku weelu unnamtalO nalugurikee saayapaDE guNam kaligi unna manishi komDOjee, amducEtanE -
kamdukUri rudrakawi - "mamgali komDOji mElu mamtrula kamTen." ani padyaanni ceppADu kawi.
kamdukUri rudrakawi - nuDiwina padya pamkti kaastaa - lOkOkti muktaawaLi gaa maarimdi.
;
****************************************, ;
;
కందుకూరి రుద్రకవి - కొండోజీ అనుబంధం ;  
భక్తుల చరిత్రలు - 1 ; History devotees, king poets భక్తుల చరిత్రలు - 1 ;