25, ఫిబ్రవరి 2023, శనివారం

సముల్లాస వ్యాప్తి-129

సంపెంగల ఊసులతో - కన్నియ హృది తన్మయి ;

ఇంపెగయగ ఒడి నిండెను పూలమాలలు ; ||

మాలి క్రిష్ణ రావోయీ!

తోటమాలి క్రిష్ణయ్యా రావోయీ!

బృందావన భద్రత విధి నీదేను ;

నీ శుభాగమనము, రాకడ -

ఉల్లాసము పరివ్యాప్తి ;  

పరిసరముల సముల్లాసము పరివ్యాప్తి ; 

జాలమేల, రావయ్యా - 

నీలమోహనాంగ, వేగిరమే రావయ్యా ; ||

ఈ హరిత ఉపవనముల -

నీ మురళీ రాగవరములు -

మృదుతరముగ జాలువారనీ ; ||

కుహు కుహూ గానములను - 

తమ గళముల నింపుకుని,

వేచిఉండె కోకిలలు ;

పరిమళలు నింపుకున్న -

లతాంకురములు వేచిఉండె ; ||

ప్రణయ సుధలు నింపుకున్న -

మణికలశ మానసముతొ,

వేచిఉండె రాధమ్మ!

రావోయీ కృష్ణయ్యా ; ||

====================== ,

samullaasa wyaapti ;- 

sampemgala UsulatO - kanniya hRdi tanmayi ;

impegayaga oDi nimDenu puulamAlalu ; ||

maali krishNa rAwOyI!

tOTamAli krishNayyA rAwOyI!

bRmdaawana bhadrata widhi needEnu ;

nee SuBAgamanamu, raakaDa -

ullaasamu pariwyaapti ;  

parisaramula samullaasamu pariwyaapti ; 

jaalamEla, raawayyA - 

nIlamOhanAmga, wEgiramE raawayyA ; ||

ee harita upawanamula -

nee muraLI raagawaramulu -

mRdutaramuga jaaluwaaranI ; ||

kuhu kuhuu gaanamulanu - 

tama gaLamula nimpukuni,

wEciumDe kOkilalu ;

parimaLalu nimpukunna -

lataamkuramulu wEciumDe ; ||

praNaya sudhalu nimpukunna -

maNikalaSa maanasamuto,

wEciumDe raadhamma!

raawOyI kRshNayyA ; ||

& part-2 ;- సముల్లాస వ్యాప్తి ;

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; God Krishna ;- songs - 129 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి