18, ఫిబ్రవరి 2023, శనివారం

గరుడగమనం, కుదుపులు -114

పక్షిరాజు మూపున తాపీగా కూర్చుని, 

వేణవూదుచుండెను క్రిష్ణమూరితి ; 

గండభేరుండమా! 

కుదుపులేమి లేకుండ - హడావుడి పడకుండ ;

నెమ్మదిగా సాగవోయి,

నీ గమనము వేగపడితె -

నీ మూపున కూర్చుని ఉన్నాడు -

వేణుగానలోలుడు ;

నువ్వు గాని తొట్రు పడితే -

మురళి కాస్త ఉలికిపడును -

రసగానము కలతపడును ;

లోకములను - ఆనందవాహినిలో - 

ఓలలాడించే సంగీతధార -, 

గండిపడితె ఊరుకోము -

అందుకనే, విహగపతీ, గరుడా!

నింపాదిగా సాగుమోయి ;

గరుడవాహనస్వామి -

కరుణారస రాగరాగిణుల -

మూర్ఛనల, శృతి లయల -

ఎల్లరి హృదయోల్లాసము ; ||  

=========================,

pakshiraaju mUpuna taapeegaa kuurcuni, 

wENawUducumDenu krishNamUriti ; 

gamDaBErumDamA! 

kudupulEmi lEkumDa - haDAwuDi paDakumDa ;

nemmadigaa saagawOyi,

nee gamanamu wEgapaDite -

nee muupuna kuurcuni unnADu -

wENugaanalOluDu ;

nuwwu gaani toTru paDitE -

muraLi kaasta  ulikipaDunu -

rasagaanamu kalatapaDunu ;

lOkamulanu - AnamdawaahinilO - 

OlalADimcE samgeetadhaara -, 

gamDipaDite UrukOmu -

amdukanE, wihagapatI, garuDA!

nimpaadigaa saagumOyi ;

garuDawaahanaswaami -

karuNArasa raagaraagiNula -

muurCanala, SRti layala -

ellari hRdayOllaasamu ; || 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; గరుడగమనం, కుదుపులు -114 ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి