21, ఫిబ్రవరి 2023, మంగళవారం

ఆనవాళ్ళు ఇవేనండీ ;-122

బృందావనమ్ములోన, 

            ఏ మల్లెపొదల మాటుననో -

ఎక్కడనో నక్కిఉండె గోపాలుడు

               మన గోవిందుడు ;|| 

చెంగల్వల పూలదండ గళమందున ధరియించెను ;

విరితావుల గుబాళింపు - సువాసనల ఆనవాలు - 

ముక్కుపుటములకు వరములు - 

           'మూ చూసీ, ట్టే పట్టేద్దాము

                      నల్లవాని నిపుడే, ఇట్టే పట్టేద్దాము ; || 

పగడాల పెదవుల మిసమిసలు, 

               దృక్ తారల తళతళలు ;

కిలకిలల నవ్వులు, తెలి దంత రోచిస్సులు -

చాల కొండగురుతులు - ఇట్టె పట్టేద్దాము ; || 

ఇట్టె ఇట్టె, చిటికెలోన దొరుకుతాడు అనుకుంటిమి ;  

ఎంతకినీ పట్టలేకున్నాము, ముద్దుపట్టిని,

యశోదమ్మ ముద్దుపట్టిని, ఇది ఏమి చోద్యమో!? ;  

ఇట్టె వాడు దొరుకుతాడు ... అనుకుంటే పొరపాటు ;

మోకు తాళ్ళు, సంకెలలు అక్కరలేదమ్మా! ;

వినయ విధేయతలల్లికల పెనవేసిన దారమ్ములు ;

"భక్తి అనే చిట్టిపట్టు దారమింతె చాలు ;

దొరుకుతాడు, వాడు భక్తసులభుడు ; 

తెలుసుకోండి ఓయమ్మా! ; ||

============================ ,  

komDagurtulu, AnawaaLLu iwEnamDI ;-  

bRmdaawanammulOna, 

           E mallepodala mATunanO -

ekkaDanO nakkiumDe, gOpAluDu

           ana gOwimduDu ; || 

cemgalwala pUladamDa -

           gaLamamduna dhariyimcenu ;

wiritaawula gubALimpu - 

             suwaasanala aanawaalu - 

mukkupuTamulaku waramulu -

           'mU cUsi',  iTTE paTTEddAmu ;

      nallawaaninipuDE

               iTTE paTTEddAmu ; || 

pagaDAla pedawula misamisalu -

           dRk taarala taLataLalu ;

kilakilala nawwulu, teli damta rOcissulu -

caala komDagurutulu - iTTe paTTEddAmu ; || 

iTTe iTTe, ciTikelOna dorukutADu anukumTimi ;  

emtakinee paTTalEkunnaamu, muddupaTTini,

yaSOdamma muddupaTTini, idi Emi cOdyamO!? ;  

iTTe wADu dorukutADu ... anukumTE porapATu ;

mOku tALLu, samkelalu akkaralEdammA! ;

winaya widhEyatalallikala  -

           penawEsina dArammulu ;

"bhakti anE ciTTipaTTu dAramimte cAlu ;

dorukutADu, wADu bhaktasulabhuDu ; 

telusukOMDi OyammA! ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  ఆనవాళ్ళు ఇవేనండీ ;-122 ;- part -2 ; & + ;- 

[& + ;- part-1 =  కొండగుర్తులు, ఆనవాళ్ళు -121 ;- ఆ చివరన నక్కిఉండె గోవిందుడు ; 

దుడుకు గోపాలుడు ; దుందుడుకు గోపాలుడు ]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి