19, ఫిబ్రవరి 2023, ఆదివారం

ముగ్గురి ఒప్పులకుప్పలు-120

రత్నసింహాసనములు - 

రాధ నవ్వు వెలుగులు ;

ఈ - కొత్త కాంతి వెలుగులను ;

చందమామ జత చేసెను - 

వెన్నెలమ్మకు, తన వెన్నెలమ్మకు ; ||

చంద్రికలు ఆడేను ఒప్పులకుప్పలు ;

యమున అలలు - జత చేరెను -

హంగు పొంగుగా, వన్నె మీరగా ;

చలిగాలుల, పొగమంచుల పరదాలకిప్పుడు -

వనిత నవ్వు చాందినీలు విప్పారుచున్నవి ;

క్రిష్ణయ్యా! నీవంతిక*, మందగొండితనమువీడి -

నీదు, మధురాధర దరహాస లహరి ;

అందించుమయా, విప్పార్చి పరుచుమయా ; ||

[*[*నీ వంతు + ఇక = నీ వంతిక ] ;

==================================== ,

ratnasim haasanamulu - 

raadha nawwu welugulu ;

ee - kotta kaamti welugulanu ;

camdamaama jata cEsenu - 

wennelammaku, tana wennelammaku ; ||

camdrikalu ADEnu oppulakuppalu ;

yamuna alalu - jata cErenu -

hamgu pomgugaa, wanne meeragaa ;

caligaalula, pogamamcula paradaalakippuDu -

wanita nawwu caamdineelu wippaarucunnawi ;

krishNayyA! nee wamtika, mamdagoMDitanamuwIDi - 

needu, madhuraadhara darahaasalahari ;

amdimcumayA, wippArci, parucumayaa ; ||

[*nI wamtu + ika = nee wamtika ] ;

God Krishna Radha Songs - 120 




& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;-  

[అలలు, వెన్నెల, రాధ నవ్వులు ] =  ముగ్గురి ఒప్పులకుప్పలు-120 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి