28, జనవరి 2023, శనివారం

వెన్నెల అత్తరు, సౌరభము

వెన్నెల వెన్నెల వెన్నెల -

నవ్య వెన్నెల, నవీన వెన్నెల ;

వెన్నెల చల్లని స్నానాలు, వెన్నముద్దల వాసనలు ;

మిళితం చేసిన మేను అత్తరుల సౌరభము ; 

నవనవలాడే నవమోహనుడే శ్రీకృష్ణుడు ; || 

రాధ నవ్వులు పున్నమలు - క్రిష్ణ స్నేహ సంభాషణలు ;

ముదమును కూర్చే వాక్ చతురతలు, 

జగతి శోభన తూర్పు కిరణములు ; 

ఈ జోడీ కథన కథనములు ; 

నవ్య నవ్యతల కావ్య జల్లులు || 

రాధా కృష్ణులు ఒద్దికగా, ఒబ్బిడిగా - 

నీ చల్లని ఒడ్డున కూరుచుని - 

చెప్పుకునేటి - కూరిమి ఊసులు, ముచ్చటలు ; 

లెక్క లేనన్ని ఆ కబురులను ; 

మాకు తెలుపుమా, సత్వరమే ఓ యమునమ్మా! ; || 

 వెన్నెల అత్తరు, సౌరభము ;

============================= , 

attaru saurabhamu ;-

wennela wennela wennela ; 

nawya wennela, naweena wennela ;; 

wennela callani snaanaalu, wennamuddala waasanalu ;

miLitam cEsina mEnu attarula saurabhamu ; 

nawanawalADE nawamOhanuDE SreekRshNuDu ; || 

rAdha nawwulu punnamalu - krishNa snEha sambhaashaNalu ;

mudamunu kuurcE waak caturatalu, 

jagati SOBana tUrpu kiraNamulu ; 

I jODI kathana kathanamulu ; 

nawya nawyatala kaawya jallulu || 

raadhA kRshNulu oddikagaa, obbiDigA - 

nee callani oDDuna kuurucuni - 

ceppukunETi - kuurimi uusulu, muccaTalu ; 

lekka lEnanni aa kaburulanu ; 

maaku telupumaa, satwaramE O yamunammA! ; || 

************************************************** ,

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- 101 start song ; ఆదివారం, జనవరి, ఫిబ్రవరి 2023 ; 

101 song start 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి