26, అక్టోబర్ 2022, బుధవారం

ప్రేమకు కొలతలు -100

అంతకు అంత, ఇంతకు ఇంత - 

ప్రేమకు ఏలా, అవీ ఇవి - అను 

వింత కొలతలు ; || 

అంతలొ ఇంత, ఇంతలొ అంత ; 

అంతకు కొంత - కొంతలొ కొంత - 

ప్రేమకు ఏలా, ఎందులకీ కొలమానములు ;

ఇటువంటి కొలతలు ; || 

అంతో ఇంతో, ఇంతో అంతో - 

మదిలో బైఠాయించేసి ; 

ఈ బుల్లి మురళీ రాగజగతిని, 

ఆలమందలు, పచ్చని పైరులు ;  

మోదము మీరగ ఓలలాడుటలు ; 

తనివితీరగా, ఎంతగ తలచిన - 

తరుగులేని తీయని  సుధావర్షముల - 

కురిపించేటి నీలి మేఘములే కదా, 

నీలమేఘశ్యామా, కృష్ణా ; ||

= ========================= ,

prEmaku kolatalu-100  ;

amtaku amta, imtaku imta - 

prEmaku ElA, awI iwi - anu 

wimta kolatalu ; || 

amtalo imta, imtalo amta ; 

amtaku komta - komtalo komta - 

prEmaku Elaa, emdulakee kolamaanamulu ;

iTuwamTi kolatalu ; || 

amtO imtO, imtO amtO - 

madilO baiThAyimcEsi ; 

I bulli muraLii raagajagatini, 

aalamamdalu, paccani pairulu ;  

mOdamu meeraga OlalADuTalu ; 

taniwiteeragaa, emtaga talacina - 

tarugulEni teeyani  sudhaawarshamula - 

kuripimcETi nIli mEghamulE kadA, 

neelamEGaSyAmaa, kRshNA ; || 

&

ప్రేమకు కొలతలు-100 ; 

రచయి3=కుసుమ, శుభకృత్ సుమ గీత మాలిక - 100 ; 

100 songs - happy 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి