14, మార్చి 2023, మంగళవారం

కెరటాల సుమదళాలు-138

కెరటాల పూల రేకులు - 

సిద్ధం సిద్ధం ;

ఝణన ఝణన ఝణ నాట్యాల,

క్రిష్ణ చరణారవిందములను -

పూజ సేయు తృష్ణతో-

కాళిందీ కెరటాల-పూ రేకులు -

     సిద్ధం సిద్ధం ; ||

"మౌనభాష ఇక ఎందులకు!?"

నెమ్మదిగా ఉన్నట్టి -

నదివాహిని "తరంగిణులు" -

తారంగం తారంగం -

నటనాటల క్రిష్ణయ్య పదగుంఫన - 

లయగతుల పాదద్వయి -

ముదమారా చేరసాగె ; ||

చేరువనే వ్రేపల్లె - 

ప్రజలందరు గుమిగూడి,

చేరేరు నదిఒడ్డుకు ;

కాళీయుని పడగలిపుడు -

ఒడుపుగా - 

క్రిష్ణ చరణ నాట్యాలకు -

      రంగవేదిక ఐన -

వింత నేడు చూడంగా ; ||

=================== ,

PART - 1 ;-  keraTAla sumadaLAlu-138 ;-

keraTAla puula rEkulu - 

siddham siddham ;

JaNana JaNana JaNa nATyaala,

krishNa caraNaarawimdamulanu -

puuja sEyu tRshNatO-

kALimdii keraTAla-pUla rEkulu -

     siddham siddham ; ||

"maunaBAsha ika emdulaku!?"

nemmadigaa unnaTTi -

nadiwaahini "taramgiNulu" -

taaramgam taaramgam -

naTanATala krishNayya padagumphana - 

layagatula paadadwayi -

mudamaaraa cErasaage ; ||

cEruwanE wrEpalle - 

prajalamdaru gumigUDi,

cErEru nadioDDuku ;

kALIyuni paDagalipuDu -

oDupugaa - 

krishNa caraNa nATyaalaku -

      ramgawEdika aina -

wimta nEDu cUDamgA ; ||

**************************** ;

పాట   part - 1;- కెరటాల సుమదళాలు-138 ;- 

God krishna song-138 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి