3, మే 2022, మంగళవారం

ఇది యేమి వింత?!!

 సకల జీవులకు చకిత చతురముగ చిత్తో-ల్లాస సంపదలు

నికరముగా, ఉన్న పాటుననె-లభియించినవి

యేమి వింత?, ఇది యేమి వింత?!! ||

చిన్ని క్రిష్ణా!!

నీ- వినీల విలసిత కుంతలమ్ముల- హేలగ చేరెను భ్రమర శతమ్ములు;

అలకల చేరి ఊయలలూగే- పిల్ల గాలులు; అళులపైన బహు అలుకలు పొందెను ||

కొలను జలముల - సూర్య కిరణములు;- చంద్ర జ్యోత్స్నలు, చుక్క బింబములు,

మెలగు వినయముగ- నీ, నఖ ద్యుతులందున - తామెల్లరు ఇతిహాసములైనవి ||

సకల జీవులకు చకిత చతురముగ చిత్తోల్లాస సంపదలు

నికరముగా, ఉన్న పాటుననె- ఒనగూడినవి

యేమి వింత?, ఇది యేమి వింత?!!

Answer:-

నేనేమని అందును? ఇది యే వింత! అహాహా! కనుగొనగా -

ఇదియే మన అందరి వింత? మన వింత? ||

&

శుభకృత్ సుమ గీత మాలిక - 26 ; రచయి3 = కుసుమ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి