సుమరాణి రమణి రాధిక -
ఊహలు...... - ఊసులెన్నొ చేరేను -
క్రిష్ణయ్య సన్నిధిని ; ||
కదలి కదలి కదలి
"కడలి ఒడి"ని చేరేను -
వాహినీ జలనిధి ;
తరచి తరచి తరచి -
ఊసులెన్నొ చేరేను -
కన్నయ్య సన్నిధిని ......
సుమరాణి రమణి రాధికా -
ఊహల ఊసులెన్నొ చేరేను -
కన్నయ్య సన్నిధిని ; ||
మబ్బు మబ్బు కదలికలు,
చేరువలు, చేరికలు ……,
మెరుపు బృంద సృజనలెగసె ; ||
తెలి కిరణం - తెలివిడి లో-
హరివిల్లులు మొలిచెనులే,
సప్తవర్ణ హరివిలులు విరిసెనులే ;
పూవుబోణి రాధికా
భావనల అందములు -
కృష్ణ మురళి గానసీమ -
చేరుతున్న సందడి ఇది ;
ఆహా, ఆహాహా!
గోదా దేవికి - స్వీకృత
స్వర్ణ కలశ సుధలు ఇవి ; ||
[గోదా దేవి - రాధిక - ]
============================= ,
sumarANi ramaNi raadhika -
Uhalu, uusulenno cErEnu -
krishNayya sannidhini ; ||
kadali kadali kadali
kaDali oDini cErEnu -
waahinee jalanidhi ;
taraci taraci taraci -
uusulenno cErEnu -
kannayya sannidhini ......
sumarANi ramaNi raadhikaa -
Uhala uusulenno cErEnu -
kannayya sannidhini ; ||
mabbu mabbu kadalikalu,
cEruwalu, cErikalu ……,
merupu bRmda sRjanalegase ; ||
teli kiraNam - teliwiDi lO-
hariwillulu molicenulE,
saptawarNa hariwilulu wirisenulE ;
puuwubONi raadhikaa
BAwanala amdamulu -
kRshNa muraLi gaanaseema -
cErutunna samdaDi idi ;
AhA, AhAhA!
gOdaa dEwiki - sweekRta
swarNa kalaSa sudhalu iwi ; ||
&
గోదా దేవి - రాధిక ;- 182 ;